డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ ప్రాణాలతో కాదు, నా శవాన్ని మాత్రమే అందజేయండి. మీ సాంగత్యంలో పావనమైన రుూ దేహం మాత్రం ఆ నీచుడు తాకకుండుగాక!’’
సీజర్ ఆ మాటలకు వణికిపోతున్నడు. ఆ చిన్న పిల్ల ఇంత తెలివిగా తనలాంటి అనుభవశాలి సైతం కరిగిపోయేట్లుగా మాట్లాడగలుగుతుందని ఆయనెప్పుడూ అనుకోలేదు. ఐతే, ఆ వాక్యాలు ఆమె నాలుక చివర్లనుంచి వెలువడలేదు. హృదయపు లోతుల్లోనుంచి బయల్వెడబట్టే, వాటి ప్రభావం తన మీద పనిచేసింది!
‘‘రాణీ! నీ బుర్రలో భూతాలు నాట్యం చేస్తున్నవి! లేకుంటే ఈ వింత ఆలోచనలు ఎందుకు వస్తవి?’’’ అన్నాడు సీజర్.
‘‘మనలాంటి అభిప్రాయాలే ప్రపంచానిక్కూడా ఉంటాయని నేనెప్పుడూ అనుకోలేదు. నాకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవు. నా రుూ బతుకుమీద నాకు అధికారం లేదు. ఐతే మీ స్నేహంతో నాకు స్వాతంత్య్రం మీద అపేక్ష అంతరించింది. బలమైన బాహువుల వెనుక, మీ నీడలో బతకడమే స్వర్గమని నిర్ణయించుకున్నాను. ఈనాడు అంతకుమినహా నేను కోరేదేమీ లేదు.. ఐతే, ఇంత చిన్ని కోర్కె కూడా తీరుతుందనే ఆశ నాకిప్పుడులేదు’’ అన్నది క్లియోపాత్రా.
‘‘ఎందుకనీ?’’ అన్నాడు సీజర్.
‘‘ప్రభూ! ఆలోచనా మందిరంలో జరిగిన సంభాషణమంతా నేను విన్నాను. మీరు న్యాయాన్యాయ విచక్షణ కూడా లేకుండా నాకొరకై, సేనాపతుందర్నీ నొప్పించారు. రాబోయే ప్రమాదాలన్నిటికీ సిద్ధపడ్డానని ప్రకటించారు. ఐతే మీ కీర్తి ప్రతిష్ఠలు దశదిశలా అల్లుకున్నవి. రోమన్ సామ్రాజ్య చరిత్రలోనేగాక, లోక చరిత్రలోనే మీరు ప్రసిద్ధికెక్కారు. చరిత్ర రూపాన్ని మార్చగల కొద్దిమంది వ్యక్తుల్లో మీకు స్థానం ఉన్నది. అదంతా అలా ఉంచి, రుూనాడు కష్టపడి గెల్చుకున్న రోమన్ సామ్రాజ్యాన్ని కూడా నా కోసం బలిపెట్టడాన్ని ఎవరు హర్షిస్తారు? సీజర్‌లాంటి మహాయోధుడు, ఒకపడుచుదాని వలలో పడిపొయ్యేటంత బలహీనుడుగా చరిత్రకారులు మిమ్ము సృష్టిస్తారు. నా మూలంగా మీకు ఎదురయ్యే కష్టాలను, నష్టాలను ఎదుర్కోవలసి వుంటుంది. నేను మీకు దక్కకపోయినా, నాలాంటి సౌందర్యవతులు మీకు లభ్యపడవచ్చు. కాని, గెలుచుకున్న రోమన్ సామ్రాజ్యం చెయ్యిజారితే, అలాటిది మరొకటి మీకు దొరకదు. మీరు సృష్టించలేనూ లేరు కదా!’’ అన్నది క్లియోపాత్రా.
‘‘రాణీ! నేను రోమన్ సామ్రాజ్యాన్ని గెలుచుకున్నమాట నిజమే!’’ అన్నాడు సీజర్. ‘‘నాకు దేవతలందరూ సుముఖులై నన్నొక నియంతగా చేశారు. ఐతే నీవు నన్ను గెలుచుకున్నావు. టే రోవమన్ సామ్రాజ్యమూ, దాని నియంతా కూడా నీకు దాసులైనారు. కనుక చరిత్ర ప్రసిద్ధికెక్కే నా వ్యక్తిత్వం కన్నా, నీ వ్యక్తిత్వం గొప్పదై ఉండాలి. చరిత్ర నన్ను మాత్రమే ఆకాశానికెత్తి ఊరుకోలేదు. నీవు కూడ ఆచారిత్రాత్మక వ్యక్తివే అవగలవు. ఈ దృక్పథంతో చూస్తే నీవు నాకన్నా ఏమీ తక్కువదానివి కాదు. పోతే నీకీ ప్రపంచంలో నేను తప్ప మరేదీ అవసరం లేదనిపిస్తోందన్నావు. నా స్థితి కూడా అలాగే వున్నది. రోమన్ సామ్రాజ్యం నీ ముందు చాలా అత్యల్పమైనదిగా తోస్తోంది. నీ ఒక్కతె కోసం నేను కూడా ఏదైనా సరే ముందు వెనుకలు ఆలోచించకుండా త్యాగం చేయగల మనోధైర్యాన్ని కలిగి ఉన్నాను. యుక్తాయుక్తాల సంగతి నాకు అవసరం’’ అన్నాడు సీజర్.
‘‘కాని- ప్రభూ!’’ అన్నది క్లియోపాత్రా. ‘‘నా కారణంగా మీరు సర్వనాశనమయ్యేందుకు ఒప్పుకోను. చివరకు ప్రపంచం మనిద్దరినీ మదోన్మాదులుగా మాత్రమే చూడగలుగుతూంది. అప్పుడు మీరు విచారపడి కూడా ప్రయోజనముండదు. నాకు కలిగే నష్టం ఏ విధంగానూ లెక్కలోకి రాదు. కానీ, రుూ ప్రపంచానే్న పరిపాలించగల మీ సామర్థ్యం-’’
ఆమె మాట పూర్తిగాకుండానే సీజర్ అందుకున్నాడు. ‘‘క్లియోపాత్రా! స్వార్థంతో నన్నాశ్రయించావేమోననే సందేహం కొంచెం ఉండేది. ఇప్పుడదంతా మటుమాయమైంది. నీ నిండు హృదయాన్ని జయించగలిగినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. నేన పోగొట్టుకోబోతున్న కీర్తి అంటూ ఉంటే, మనప్రణయం ముందు అదెంత? ఇక చరిత్రకారుల్ని సంతృప్తిపరిచేందుకు నేను బతకటం లేదు. భూమిమీద ఒక స్వర్గాన్ని నిర్మించుకుకందామనుకుంటున్నాను. విధి అనుకూలించినందువల్ల కృతకృత్యుడనయ్యాను’’.
‘‘ఈ స్వర్గం తాత్కాలికమైనది స్వామీ!’’
‘‘అయినా నేను విచారించను రాణీ! జీవితం బుద్బుదమే అవునుగాక! ఆ బుడగ పగలబోయేముందు ఉబ్బుతుందని అందరికీ తెలుసు. అదేవిధంగా నా జీవితాంతంలో ఈ ఉబ్బరం ఎదురైందనుకున్న ఫర్వాలేదు. ఈ స్వర్గమే ఎల్లకాలమూ ఉండాలని కూడా ఆశించటం లేదు రాణీ! నిజంగా ఇదే శాశ్వతమైతే స్వర్గమంటే మొహం మొత్తిపోదా? కనుక మృత్యుదేవత నన్ను తనలోకి లీనం చేసుకుంటే మాత్రమేం? నీతో గడిపిన మధుర క్షణాలను స్మరిస్తూ ప్రాణాలు హాయిగా వొదులుతాను. ఊర్థ్వలోకాలలో ఒకవేళ నాకు నరకమే సంప్రాప్తమైనప్పటికీ, భూలోకంలోని నా అంత్యదినాల మధురానుభూల తాలూకు ఊహలను నెమరువేసుకుంటూ ఆ బాధలనన్నిటినీ హాయిగా అనుభవిస్తాను!’’
సీజర్ హృదయాంతరాళంలో తాను తప్ప మరేమీ లేదని క్లియోపాత్రాకు స్పష్టమైంది. కాని, తన ప్రియుడు ప్రమాదాలపాలవుతాడేమోననే భయం ఆమెను వేధించసాగింది.
‘‘ప్రభూ! మీకు నామీద ఏర్పడిన అనురాగానికి కృతజ్ఞురాలను. కాని నాలాంటి అనాథకోసమై మీరు త్యాగాలు చేయటం సబబు కాదు’’ అన్నదామె.
‘‘త్యాగాలా! రాణీ! మన ప్రణయ జ్యోతికి అటురోమన్ సామ్రాజ్యమూ, ఇటు ఈజిప్షియన్ సామ్రాజ్యమూ, చివరకు ప్రపంచమే బుగ్గవుగాక! నేను లెక్కచేయను. ఐతే నీ సాంగత్యంతో నేను వయసునే జయించనా. ఇంతవరకూ నీవు సీజర్‌ను ప్రియుడుగా మాత్రమే చూశావు. ఇక ముందు మహాయోధుడుగా కూడా చూడగలవు. నీ అనురాగసుధతో నేనెంత శక్తిని పుంజుకున్నానో, ఆ ఊహతో నే నెదురాడగల మహాశక్తులు ఎంత బలవరత్తరమైనవైనా సరే బూడిదవగలవో త్వరలోనే చూస్తావు. ఒకవేళ సర్వనాశనమే మనకు రాసిపెట్టి ఉంటే, క్లియోపాత్రా! నీకు అపాయం జరిగేముందు నా శవం నేలవాలుతుందని మాత్రం గుర్తుంచుకో!’’ అన్నాడు సీజర్.
క్లియోపాత్రా వెక్కి వెక్కి ఏడ్వసాగింది. కట్టలు తెంచుకున్న మహా నదులవలె ఆమె కళ్ళనుంచి నీరు ప్రవహించసాగింది. ఆమె స్థితి చూసి సీజర్ కూడా కళ్లు తడి చేసుకున్నాడు. ఐతే, అనేక యుద్ధాలో రాటుదేలిన గుండె కనుక నిభాయించుకున్నాడు.
‘‘ఇంకా ఎందుకు దుఃఖిస్తావు రాణీ! నా మాటలు నమ్మలేవా?’’ అన్నాడాయన.
‘‘ఇవి దుఃఖాశ్రువులు కావు ప్రభూ’’ ఆనందబాష్పాలు’’ అన్నదామె.
సీజర్ నిర్ఘాంతపోయాడు. తాను ఆమె ఖేధాన్ని మోదంగా మార్చగలిగినందుకు ఆయన గర్వపడ్డాడు.
‘‘పిచ్చిపిల్లా!’’ అని ఆమెను గాఢంగా కావింలించుకున్నాడు. ‘‘నా బొందిలో ప్రాణముండగా నీ మీద ఈగ కూడా వాలదు. టాలమీ కాదు కదా, బ్రహ్మరుద్రాదులు దిగి వచ్చినా నీకేమీ భయం లేదు. యుద్ధమే జరుగుతుంది. జయాపజయాలు దైవదాధీనాలే ఐనా, ఎటుపోయి ఎటొచ్చినా నేను విచారించను. విలువైన ఈ కాలాన్ని వృధా చేసుకుని, మనస్సులు పాడుచేసుకోవటం కాదు, రాణీ! లే.. అలంకరించుకో.. మన స్వర్గానికి భంగం కలిగించే నీచుల్ని చీల్చి చెండాడే బాధ్యత నాది.. అన్నట్లు ఇవాళ భోజనం చేయలేదా?’’ అన్నాడు సీజర్.
‘‘లేదు.. మీరు భోజనం మానుకున్నారుగా!’’
‘‘ఆ సంగతి నీకెలా తెలుసు?’’
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు