డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లియోపాత్రా- ఆమెకీ రాజ్యమెందుకు? తాను రాణిగా బతక్కుంటే మాత్రమేం? అలెగ్జాండ్రియా అంత ఆదగ్ధమైతే మంచుకు పొయ్యేదేమిటి? తన చేతికి చిక్కిన సీజర్ తనను ఏలుకున్నన్నాళ్ళూ తనకు మరో సమస్యే ఉండేందుకు వీల్లేదు. ఈ విధంగా రెండు వ్యక్తిత్వాలూ కరిగి ఒకే మూసలో పోసినట్లు ఏకత్వాన్ని వహించినవి.
***
ఆ రాత్రి చందమామతో పాటే సీజర్, క్లియోపాత్రాలు మేలుకొని ఆకాశ, విహారాలు చేశారు. క్లియోపాత్రా ఏం మాట్లాడిందో సీజర్‌కు తెలియదు. ఆమె కంఠస్వరాన్ని మాత్రమే విని ఆయన పరవశుడౌతున్నాడు.
సీజర్, ఆ వయస్సులో ఎన్ని అబద్ధాలాడి ప్రణయోద్రేకాన్ని వెలిబుచ్చాడో క్లియోపాత్రకు తెలియదు. కంఠస్వరం ఆయనలోని వీరత్వాన్ని, గంభీరతను మాత్రమే ఆమె వినగలిగింది. మహాసముద్రంలో కింకిణీరవాలతో, వేగంగా ప్రవహించే నది- క్లియోపాత్రా, గంధీరంగా ఘీంకరిస్తూనే తనలో ఐక్యం చేసుకొనే మహా సాగరం సీజర్! బైటి ప్రపంచమంతా మిథ్య! తాము సృష్టించుకొన్న రుూ స్వర్గమే సత్యం! నిత్యం!
ఐతే బైటి ప్రపంచంతో ఆ ప్రణయారాధకులకు నిమిత్తం లేకపోయినా, బైటి ప్రపంచానికి వారితో చాలా అవసరాలు ఉన్నవి. ఒకరు ప్రపంచానే్న ఆజ్ఞాపించగల అధికారాలున్నవారు. రెండోవారు- ఈజిప్టు చరిత్రను ఎటుపడితే అటు తిప్పగల శక్తి సంపన్నులని రుజూ అవబోతోంది! మిగతా ప్రజలందరూ అల్పులే ఐనప్పటికీ, ఆ ప్రజా ప్రవాహం ఎటు మళ్ళాలనేది ఈ ప్రణయారాధకుల చేతుల్లోనే వున్నది.
తెల్లవారేలోగా సీజర్, క్లియోపాత్రాలు ఏకమయ్యారనీ, క్లియోపాత్రా రోమన్ నాయకునితో వ్యభిచరించిందనీ రాజభవనంలోని ప్రతి ప్రాణికీ తెలిసిపోయింది. ఈ సీజర్ తనకేదో వొరగబెడతాడని ఆశించి ఆయన్ను ఆహ్వానించి, రాజ భవనంలోనే విడిది ఏర్పటుచేసినందుకు, తిన్న ఇంటి వాసాలను లెక్కబెట్టినవిధంగా ఆయన ప్రవర్తించాడని తెలుసుకొని టాలమీ అగ్గయిపోయాడు. తను ఇప్పటికీ రెండో ప్రాణంగా భావించే తన అక్క - కాదు భార్య, ఈ రాజకీయ దుమారం చల్లారగానే బలాత్కరంగానైనా తనకు బిడ్డల్ని కనేందుకు ఆమెను సిద్ధం చేయించాలని కలలుకన్న క్లియోపాత్రా తనకు దక్కకపోను, రాజవంశానికే కళంకం వచ్చిపడే విధంగా, ఆ విదేశీయ వృద్ధుని కౌగిలిలో చిక్కుకుంటుదని ఎవరనున్నారు?
సీజర్ ఈజిప్టును ఉద్ధరించవలసిందేమీ లేదు. ఈజిప్టు సహాయం పొంది, తనను తాను నిలువ తొక్కుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇక్కడికి వచ్చి పడ్డాడు. రాభవనంలో ఒక భాగం ఆక్రమించి, తన పతాకమైన గద్ద చిహ్నాన్ని ఎగరేశాడు. ఇప్పుడు గద్దవలెనే తనచేతుల్లోని జగదేక సుందరిని తన్నుకుపోయాడు. సీజర్ స్నేహపాత్రు కాకుంటే మానె, ద్రోహి కూడాను!
తెల్లవారగానే రాజభవనంలో జరిగిన ఘోరాన్ని గూర్చిన కథలు అలెగ్జాండ్రియా అంతా అల్లుకొనిపోయినవి. ఎలాగైనా సీజర్‌తో సంధి చేసుకొని ఎంత త్వరగా వీలైతే, అంత త్వరగా ఆయన్ను ఈజిప్టు నుంచి సాగనంపాలని ఇంతవరకూ ఈజిప్షియన్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. క్లియోపాత్రాను పిలిపించి, టాలమీకి, ఆమెకూ సంధి గూర్చి తన పని పూర్తిచేసుకొని, కావలసిన కనకాన్ని మూటగట్టుకొని తన దారిన పోయే పెద్దమనిషి కదా రుూ సీజర్ అనుకుంటే- రాజ కుటుంబానికీ, ఈజిప్టు చరిత్రకే మసిపూసేందుకు సిద్ధపడిన నీచుడయ్యాడు.! వీరిద్దరికీ ఏం ఈడు, జోడని ప్రజలు అచ్చెరువొందారు. ఆ పరదేశితోపాటే, క్లియోపాత్రా కూడా కుటుంబ గౌరవాన్నీ, దేశ ప్రతిష్ఠనూ కూడా లెక్కచేయని దేశద్రోహిగా మారిపోయినందుకు ప్రజల్లో అలజడి బయలుదేరింది.
రోమన్ ప్రభుత్వాధికారాలనుంచి శాశ్వతంగా బైటపడేందుకు ఇదే సదవకాశమని టాలమీ ప్రభుత్వ నాయకుడు పోథినస్ పసిగట్టాడు. ఈజిప్షిన్‌లందరూ ఒకే తాటిమీద నడుస్తే, ఇప్పుడు తమ దేశంలో వున్న రోమన్ సైనికులకు, సీజర్‌తో సహా నల్లుల్ని నలిపినట్లు నలిచిపారెయ్యటం ఒక లెక్కలోనిది కాదు. అసలే రోమన్ సైన్యం చాలా చిన్నది. అదీగాక అహోరాత్రులు యుద్ధరంగంలో పోరాడి అలసిపోయి వున్నది. వారికిప్పుడు యుద్ధోత్సాహం లేదు సరికదా, అంతకన్నా శాశ్వత నిద్రే మేలనే భావంతో ఉన్నారు.
ముఖ్యంగా కొన్ని మాసాలుగా సీజర్ తమను పోషిస్తున్నాడనే కాని, తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని బంగారు రూపాన ఇవ్వటంలేదు. నిజానికి సీజర్ ఈ యుద్ధంతో పరమ దరిద్రుడయ్యాడు. యుద్ధంలో గెలుపొందాక తమకేదో వొరగబెడతాడనే ఆశ మాత్రం సైనికులకు ఉన్నది. ఐతే సీజర్ మాటలు వినసొంపుగానూ, మధురంగానూ ఉంటూన్నవే కాని, ఆయన చేతినుంచి దడీ రాలటంలేదు.
ఎదుటపడి ఎదురుతిరిగే సాహసమైతే ఎవ్వరికీ లేదు కాని, సమయం వస్తే సీజర్‌కు ప్రాణాలొడ్డి యుద్ధం చేసేందుకు రోమన్‌లు సిద్ధంగా లేరు. ఈ కారణంగానే సీజర్ తన సైనికులకు మొహం చూపటంలేదలు. వ్యవహారాలన్నీ బెట్టుగా నడుపుకొస్తున్నాడు.
ఈజిప్టులో దొరికే ధనంలో కొంత భాగాన్ని వాళ్ళ మొహాన పడెయ్యాలని ఆయనకు ఉన్నది కాని, అసలంటూ ఆ ధనం ఉన్నదోలేదో, ఒకవేళ ఉన్నా తన చేతుల్లోకి వొస్తుందో రాదో ఆయనకే అర్థం కావటంలేదు. అందుకనే క్లియోపాత్రాను కూడా ఆహ్వానించి, బ్రహ్మిని తిమ్మిని చేసి, వాటా పుంజుకుందామని ఆయన ఎత్తువేశాడు. ఇన్నాళ్ళూ ఆ ఎత్తు ఎవరూ గ్రహించలదని ఆయన అనుకుంటున్నాడు. ఇది నిజమైతే కావచ్చు కాని, ఇప్పుడు ఆయన నిజరూపం, వున్నదానికన్నా ఘోరాతి ఘోరంగా కనిపిస్తోంది.
ఇంతకుపూర్వం కూడా క్లియోపాత్రా మీద ఈజిప్షియన్లకు సదభిప్రాయం లేదు. టాలమీ వంశంలోని ఆడపిల్లలు ఒక శాపమని ప్రజల అభిప్రాయం. ఔలటీస్ టాలమీ పెద్ద కూతురు పితృద్రోహానికి వొడిగట్టి తండ్రి రోమ్‌లో వున్న సమయంలో సింహాసనాన్ని ఆక్రమించింది. ఐతే అప్పుడే పెద్ద తిరుగుబాటు జరిగి ఉండేది కాని, ఔలటీస్ టాలమీ కూడా ప్రజల ద్వేషానకి గురై ఉండటంవల్ల వారు ఆయన కూతుర్ని భరించారు.
ఆయన అనంతరం రాజు, రాణీలుగా- టాలమీ, క్లియోపాత్రాలు సింహాసనం మీద ఉన్నట్లయితే, వారి కలయికతో దేశంలో శాంతి నెలకొల్పబడేది. అందుకు మారుగా వారిలో చీలికలు ఏర్పడి, రెండు పక్షాలైనవి. తనకు తగిన సహకార సానుభూతులు ప్రజల్లో లేవని గ్రహించిన క్లియోపాత్రా పారిపోవలసి వచ్చింది. పారిపోయి ఆమె ఈజిప్టు మీదనే దాడి చేసే సన్నాహాలు జరుపుతోందనే వార్తలు ప్రజల హృదయాల్లో కారుచిచ్చును రేపినవి. ఆమెను దేశద్రోహిగానే వారందరూ పరిగణిస్తున్నారు. సమయం చిక్కినట్లయితే క్లియోపాత్రాను, ఈజిప్షియన్ ప్రజలే చంపివేసి ఉండేవారు.
ఇక ఇప్పుడు ఆ దేశద్రోహి, మరొక దేశద్రోహితో ఏకమైనందుకుగాను ప్రజలు ఎంత మండిపడి ఉంటారో ఊహించవచ్చు. ఇప్పుడు జరిగే తిరుగుబాటుతో ఈజిప్టు శాశ్వతంగా తన స్వాతంత్య్రాన్ని సంపాదింకుంటుంది. రోమన్‌లు ఈజిప్టు వైపు చూపే సాహసాన్ని కోల్పోతారు. పోతే దేశద్రోహిగా తయారైన క్లియోపాత్రాను దుమ్ములో కలుపుతే ఈజిప్టు శాంతి భద్రతలకు నిలయమగలదు. ఇలాంటి అభిప్రాయాలను టాలమీ ప్రభుత్వం వెలిబుచ్చితే, ప్రజలు ఏకకంఠంతో జేజేలు కొట్టారు.
ఇప్పుడు జరిగే తిరుగుబాబాటులో ఎంతో ఉద్రేకం ఉంటుంది.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు