డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్వంగా తల ఆడించాడాయన.
‘‘రాణీ! రా... నిలబడ్డావేం? సీజర్ నీకు ఎప్పడూ స్వాగతం చెప్పేందుకు సిద్ధంగానే ఉంటాడు’’ అన్నాడాయన చిరునవ్వుతో.
ఒకసారిగా సిగ్గు తెరలు ఆమె ముఖంమీద జారినవి. ఇంత హఠాత్తుగా ప్రణయం ఫలించేప్పటికి ఆమె భరించలేకోయింది. ఎన్నో రాజకీయ విషయాలను గూర్చి సీజర్‌కు తాను విన్నవించుకోవాలని ఆమె ఊహించింది. ఐతే అవేవీ ఆ క్షణంలో ఆమెకు గుర్తులేవు. ఈ గది బైట ప్రపంచమంటూ ఉన్నదనే భావం కూడా ఆమెలో కలగలేదు. ఈ చిన్ని ప్రపంచంలో సర్వాధికారి ఐన సీజర్ ఉన్నాడు. సీజర్ ఏలిక. తాను అతని సింహాసనంలో సగ భాగాన్ని ఆక్రమించుకునేందుకు ఆహ్వానించబడుతోంది. అంటే సగం ప్రపంచానికి తానీ యణంలో పట్టమహిషమవుతోంది. దురదృష్టం వలెనే, అదృష్టం కూడా పట్టుకుంటే పీడిస్తూనే వుంటుంది కాబోలు! ఆశ్చర్యంతో ఆమె కదలలేకపోయింది.
‘‘క్లియోపాత్రా! రాణీ! సిగ్గుపడుతున్నవా? ముసలివాణ్ణని ఏవగించుకుంటున్నావా? రోమన్ సామ్రాజ్యాధిపతినని భయపడుతున్నావా?’’ అన్నాడాయన.
ఇవేవీ కావు! చివరకు సీజర్ ముసలివాడనే భావం తనలో మొట్టమొదటి చూపులోనే మాయమైంది. ప్రపంచానికంతటికీ ఆయన వయస్సు తెలిసి ఉండొచ్చు. కానీ తనకు - తకళ్లకు ఆయన నవయువకుడుగానూ, తనకు ఈడు జోడుగానే ఉన్నాడు! సీజర్ కంఠస్వరంలో ఇంతకుముందు తను విన్న సింహ శార్దూల గర్జనలు లేవు. మృధుమధురంగా ఉండే గానంలా తనకీ ఆహ్వానం వినవొచ్చ్ది. కాని, కనె్నవలపు, సిగ్గు తనను కదలనీయటంలేదు.
అనుభవశాలైన సీజర్ ఆమె అవస్థను గ్రహించాడు. దగ్గిరికి వెళ్లి చేయి పట్టుకున్నాడు. ఆమె ఉద్రేకంతో పెనుగాలిలో ఎండుటాకువలె వణికిపోయింది. తుఫానల్లే వచ్చి వొళ్ళోపడిన రుూ అదృష్టానికి తను కూడా వణికిపోతున్నాననుకున్నాడు సీజర్. మొత్తంమీద నిలవతొక్కుకున్నాడు.
ఆయనకూ బైట ఒక ప్రపంచమున్నదనే జ్ఞానం పోయింది. తాను గడిపిన అర్ధశతాబ్ద జీవితానికీ, మానవ రక్తాన్నిఏరులు కట్టించి పోరాడిన యుద్ధాలకూ ఆ దేవతలు కరుణించి, తనకిచ్చిన వరప్రసాదమీ క్లియోపాత్రా అని నమ్ముతున్నాడు. ప్రస్తుతం తాను ఈజిప్టులో చిక్కుకుపోయిన సంగతి కానీ, ఈనాడు ఈజిప్షియన్ ప్రభుత్వం తన పట్ల మిత్రత్వాన్ని చూపుతోందో, శతృత్వానే్న చూపుతుందో తెలియని అయోమయ స్థితి కానీ, తన ఆజ్ఞలకు లోబడి, అధికారాన్ని శిరసావహించే రాజ్యాంగం కానీ ఆయనినప్పుడు పీడించటంలేదు.
ఈజిప్టుకు రాకపూర్వం, ఈ దేశస్థులు పశువులతో సమానులనీ, చదువు, సంస్కారం లేని మొద్దులని సీజర్ అనుకున్నాడు. సంస్కారమనేది ఒక్క రోమ్‌కే కాకుండా, ఈజిప్టుకూ, మొత్తం ప్రపంచానికే పంచి పెట్టవలసింది రోమన్ జాతేనని భ్రమించాడు. విజ్ఞానాన్ని వెదజల్లేందుకు తన దేశస్థులకు పెట్టింది పేరని పొరబడ్డాడు. ఇప్పుడా పొరలన్నీ విడిపోతున్నవి.
ఈజిప్టు నిజంగా సంభ్రమాశ్చర్యలకు పుట్టినిల్లయిన దేశం! ఇక్కడ సంభవం కానివి ఏమిటనిపిస్తుంది! మూడురోజుల క్రితం తాను అలెగ్జాండర్ శవాన్ని చూశాడు! మూడు శతాబ్దాలు గడిచినా, ఆ శవం చెడకుండా కాపాడబడింది. ఆ జగదేకవీరుణ్ణి దర్శించి, తన జన్మ సార్థకమైనదనుకున్నాడు.
ఈజిప్షియన్ చక్రవర్తులు బతికి ఉండగా ఎంత విలసాంగా, హోదాగా, వైభవోపేతంగా బతుకుతారో, చచ్చిన తరువాత కూడా వారి శవాలకు అంత మర్యాదా జరుగుతుంది. ప్రతి ఈజప్షియన్ చక్రవర్తీ, తన ఓదాకు తగినట్లుగా బతికి ఉండగానే తన సమాధిని సిద్ధం చేసుకుంటాడు. ఆసమాధి- అదొకప్రపంచం! అందులో ఆయన శవంతోపాటు, ఆయనకు ప్రీతికరమైన వస్తు సముదాయం, ధనరాసులూ, రత్నవైఢూర్యాలూ- ఒకటేమిటి ఆయన తాలూకు ఐశ్వర్యమంతా ఉంచబడుతుంది. చూసేందుకు రుూసమాధులు పర్వతాలల్లే, కొనలుదేరి ఉంటవి. ప్రపంచంలోని వింతల్లో ఈ పిరమిడ్లు ఒకటిగా ప్రసిద్ధికెక్కినవి.
ప్రతి పాలనకు, తనహయాంలో తాను కూడబెట్టిన ఐశ్వర్యలన్నిటినీ, తన శవంతోపాటే భూస్థాపితం చేసుకుంటాడు. కనుక, తరువాత సింహాసనాన్నధిష్టించేవారికి ఏమీమిగిలి ఉండదు. ఇక రుూ పిరమిడ్లలోని శవం ఎన్నటికీ చెడదట! బ్రహ్మదేవుడు కూడా రుూ పిరమిడ్‌ను ఛేదించలేడు. అసలు సింహద్వారం ఎక్కడున్నదో ఎవ్వరికీ తెలియదు. ఎంత పనివాడితనం లేకుంటే, ఎంత విజ్ఞానం లేకుంటే రుూ పిరమిడ్‌లను ఈజిప్షియన్‌లు నిర్మించగలరు?
ప్రపంచంలోని విజ్ఞానమంతా పుస్తకాల రూపాన, అలెగ్జాండ్రియాలోని పుస్తక భాండాగారంలో ఉన్నదని ప్రతీతి. ప్రపంచంలోని నలుమూలలనుంచీ అనేకమంది పండితులూ, మహామేధావులూ అలెగ్జాండ్రియాలోని రుూ పుస్తక భాండాగారంలో గుప్తపరచబడిన విజ్ఞానాన్ని పొందాలని తహతహలాడుతూ వస్తుంటారు!
మరి రోమ్‌లో ఇలాంటిది ఏమున్నది? ఒక్క అధికారం, యుద్ధకౌశలం మినహా ఇంకేమున్నది?
ఇక్కడి శిల్పాలలో జీవకళ ఉట్టిపడుతోంది. చేతి పనుల్లో మానవుని మేధస్సు తొణికసలాడుతోంది. ఈజిప్టులో సంస్కారం లేదనుకునేవారు సంస్కారహీనులే అవగలరు.
ఈ ఐదారు రోజుల్లోనూ తానెన్నో వింతల్ని గూర్చి విన్నాడు. ఇక్కడి వైద్యులు అతి ప్రజ్ఞావంతులట! ముసలితనాన్ని పారద్రోలే కాయకల్ప చికిత్సలు వారికి కరతలామలకాలట! ప్రాణదానం మినహా ఏదైనా చేయగల సర్వ సమర్థులని వారికి పేరట!
ఇలాంటి వింతలున్న దేశంలో తాను పడటం, అంతకన్నా క్లియోపాత్రా లాంటి సౌందర్యవతి, జగన్మోహినిని తాను పొందగలగటం, ప్రపంచంలోని వింతలకు మరొక సంఖ్యను కలుపుతోందంటే ఆశ్చర్యమా?
మొదటినుంచీ రుూ వింత ప్రపంచంలో పెరుగుతున్నప్పటికీ, ఇవన్నీ క్లియోపాత్రాకు వింతలే కావు. వింతల్లా రోమ్ నుంచి వచ్చి రుూ ప్రచండ యోధుడు, వృద్ధకేసరి తనలాంటి లేడిపిల్లకు ఇంత తేలిగ్గా లొంగిపోవటం! తనను తాను నమ్మలేని స్థితిలో పడిందామె! తన స్వప్నాలు రూపురేఖలు దిద్దుకొని, వాస్తవానికి మారుతూన్నవి.
ఇన్నాళ్ళూ తన జీవితమొక కన్నీటి గాథ మాత్రమే అని నమ్మిందామె. ఇప్పుడా కన్నీరు, మున్నీరై, గడ్డకట్టి, ఆ శిలలతో నిర్మితమైన ఆనంద భవనమే తనకొక కానుక! జీవితమే ధన్యమైన క్షణాలంటూ ఉంటే, అవి ఇప్పుడే ఇక్కడే తాను ప్రత్యక్షంగా చూడగలుగుతోంది!
రాజభవనంలో రతీ మన్మథులు తాండవమాడారు. అర్ధశతాబ్ద జీవితం తాను నిజంగానే వృథా చేశానని సీజర్ తలిచాడు. ఇప్పటికైనా తనకీ అందాల రాశి దక్కి జీవిత శేషమన్నా వృథా కాకుండా చేసినందుకు ఆయన సంతోషించాడు. యవ్వనపు ప్రథమ పుష్పాలతో, ఏనీచుణ్ని పూజించవలసి వస్తుందోనని భయపడిన క్లియోపాత్రా తపస్సుకు మెచ్చి ఆ దేవతలే తమ అంశంగా సీజర్‌ను పంపారని ఆమె తలచింద.ఉభయులూ ఒకరికొరకు మరొకరు రుూ భూమి మీద కొంత కాలయాపనతోనే కలిశారనీ భావించారు. బొందితోస్వర్గానికి వెళ్ళటం అసంభవమని ఒకప్పుడు వారు నమ్మారు. ఇప్పుడా నమ్మకం పటాపంచలైంది.
సీజర్- పులిలాంటివాడు పిల్లయిపోయాడు. ఇప్పుడాయనకు రోమన్ సామ్రాజ్యం మనసులో లేదు. రాజ్యకాంక్ష లేదు. ప్రపంచంలో క్లియోపాత్రా మినహా మరో వ్యక్తి తనకు లేదు.

- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతఠావు