డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కాకపోవచ్చు. కాని రాచమర్యాదలకు లోటు లేకుండానూ కనీసం అంగరక్ష దళాలన్నా లేకుండానూ వెళ్తావా?’’’
‘‘వెళ్తాను’’ అన్నదామె నిశ్చయ కంఠస్వరంతో. ‘‘నాకు ఎవ్వరి సహాయమూ అక్కర్లేదు. స్వశక్తిమీదనే ఆధారపడతాను. గెలిచినా, ఓడినా విచారించవలసిందేమీ ఉండదు’’.
ఇరాస్ ఆశ్చర్యంలో మునిగిపోయి జవాబు చెప్పలేని స్థితిలో పడ్డాడు.
‘‘నేను రుూ రాత్రికే బయలుదేరుతాను. కాని, నేను ఈజిప్టు వెళ్లినట్లు మీకు మినహాగా మరెవ్వరికీ తెలియరాదు. పరమ రహస్యం. జాగ్రత్త. అక్కడ ఏమైందనేది నేను సాధ్యమైనంత త్వరలో తెలియపరుస్తాను. ఆలస్యమైనదని, మీరు ఇక్కణ్ణుంచి ఎవర్నీ పంపవద్దు. నేను వచ్చేవరకూ, లేదా ఆజ్ఞల్ని పంపేవరకూ నా ఆరోగ్యం బాగాలేనందువల్ల, నా గుడారంలోనే విశ్రాంతి తీసుకుంటున్నానని ప్రచారం చేయండి. ఇక్కడ నేను పరారైనానని ఏమైనా అల్లరులు బయలుదేరితే ఆ బాధ్యతలు మీవే అవుతవి!’’ అన్నదామె.
‘‘అర్ధరాత్రి నీవు ఒంటరిగా వెళ్ళటం! రాణీ! చీకట్లో వెళ్ళటం ప్రమాదం సుమా!’’ అని హెచ్చరించాడాయన.
క్లియోపాత్రా నవ్వింది. ‘‘ప్రమాదమే కాదు రక్షణ కూడాను!’’ అన్నది.
‘‘కోరి మృత్యువును ఆహ్వానించవద్దు’’
‘‘మనం ఆహ్వానించకుండానే మృత్యువు ఎదురవుతుంది. అది ఏ రూపంలో, ఎప్పుడు ఎక్కడ మనను కావిలించుకుంటుందో ఎవరికి తెలుసు? పోతే అన్నిటికి తెగించిన రుూ స్థితిలో నాకు భయమేమిటి?’’ అన్నదామె.
ఇక ఎదురుచెప్పేందుకేమీ లేక ఇరాస్ అన్నిటికీ ఒప్పుకున్నట్లు తల ఆడించాడు.
‘‘ఇక మీరు వెళ్ళవచ్చు. నేను బయలుదేరి వెళ్ళేటప్పుడు కూడా మీకు కబురు చేయను. నరమానవుల కంట పడకుండా నేను ఈజిప్టు జేరాలి. రాత్రికి రాత్రే మాయమవుతాను. మీకంతా తెలుసు కనుక ఇక చెప్పవలసినది కూడా లేదు’’
ఇరాస్ సెలవు తీసుకొని విచారవదనంతో భారంగా నడిచివెళ్లిపోయాడు.
క్లియోపాత్రా తిరిగి తన పన్నాగాలకు కొత్తగా రూపురేఖలు దిద్ది, ఆలోచనా సాగరంలో మునిగిపోయింది.
***
ఆ రాత్రి- అర్థరాత్రి దాటాక, తన పటాలంలోకల్లా అతి బలాఢ్యుడైన బానిసనొకణ్ని కబురు చేసి పిలిపించింది క్లియోపాత్రా.
కండలుతేరిన, ఆజానుబాహుడైన బానిస వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
నేలమీద విలువైన ఒక పెద్ద పర్షియన్ తివాసీ పరిచి ఉంది. దాని పనివాడితనం ఎవరినైనాసరే ఇట్టే ఆకర్షిస్తుంది. రాజభవనాల్లో ఉండతగింది కాని, గుడారాల్లో ఉండతగింది కాదది.
‘‘బానిసా!’’ అన్నది క్లియోపాత్రా.
‘‘ఏమి ఆజ్ఞ రాణీ!’’ అన్నాడు వాడు.
‘‘ఈ తివాసీ మోయగలవా?’’
పకపకా నవ్వాడు వాడు. ‘‘రాణీ! నా బలాన్ని పరీక్షించేందుకు రుూ తివాసీయా? ఈ డేరాను ఎడం చేత్తో ఎత్తమంటారా? లేదా ఆకలిగొన్న సింహాన్ని మీదికి వదలండి.. చేతులతో మాత్రమే దాన్ని సంహరిస్తాను’’ అన్నాడు వాడు.
‘‘నీవు అతి బలాఢ్యువని నాకు తెలుసు బానిసా! ఈ తివాసీని వెంటనే, ఈ అర్ధరాత్రి ఈజిప్టుకు చేర్చాలి..’’
‘‘చిత్తం!’’ అని వాడు తివాసీని చుట్టేందుకు సిద్ధమయ్యాడు.
‘‘ఆగు’’ అన్నదామె. ‘‘కానీ, ఈ తివాసీని మోయటం మాత్రం కాదు. చాలా జాగ్రత్తగా ఎత్తుకెళ్లాలి. కుదుపే ఉండరాదు’’
‘‘అర్థమైంది రాణీ.. లోపల గాజు సామాను ఉన్నప్పటికీ, పగలకుండా చేర్చగలను’’ అన్నాడా బానిస.
‘‘గాజుకన్నా సున్నితమైనది ఉంటే?’’ అన్నది క్లియోపాత్రా.
వాడొక్క క్షణం ఆలోచించి చుట్టూ చూశాడు.
‘‘క్షమించండి రాణీ! తివాసీలో మీరు పడుకున్నప్పటికీ, ఎలాంటి కదలికా తెలియకుండానే మోసుకెళ్లగలను’’ అన్నాడు వాడు.
ఆమె నవ్వింది.
‘‘బానిసా! నిజంగానే నేనీ తివాసీలో పడుకుంటాను. నీవు ఎంత జాగర్తగా తీసుకెళ్తావో?’’ అన్నదామె.
‘‘సందేహమెందుకు రాణీ! నా ప్రాణంకన్నా ఎక్కువగా చూసుకుంటాను. మీ ఉప్పు తినే రుూ శరీరాన్ని నమ్మండి’’.
‘‘బానిసా! నీమీద నాకెంతో నమ్మకం ఉన్నది. ఈ తివాసీ చుట్టలో నేను ఉన్నానని నీకు తప్ప మరెవ్వరికీ తెలియకూడదు. ఇక్కణ్నించి మనం సముద్రపుటొడ్డుకు వెళ్తాం. అక్కడొక నావ వున్నది. నావలో నీవు తివాసీతో సహా ఎక్కుతావు. సూర్యోదయానికల్లా నీవు ఈజిప్టు జేరుతావు. నీవు ఈజిప్షియన్‌వే కనుక, నిన్ను ఎవ్వరూ అనుమానించరు. తివాసీ భుజంమీద భద్రంగా మోసుకొని రాజభవనానికి వెళ్లాలి. అక్కడ కాపలావాళ్ళు నిన్ను అడ్డగిస్తారు. క్లియోపాత్రా రాణి రుూ తివాసీని జూలియస్ సీజర్‌కు కానుకగా పంపినట్లు చెప్పాలి. వాళ్ళు తివాసీని తమకు అప్పగించమంటారు; అలా వీలు కాదు- నీవే స్వయంగా సీజర్ ప్రభువుకు సమర్పించాలని రాణి ఆజ్ఞ! అని చెప్పాలి. వాళ్ళు నిన్ను లోనికి తీసుకెళ్తారు. అక్కడ తివాసీ నేలమీద ఉంచి మూతి విప్పు. తరువాత తివాసీ దానంతటదే విడిపోతుండగా, నీవు నిష్క్రమించు.. ఇది నీవు చేయగలవా?’’
‘‘సందేహమా రాణీ!’’
‘‘నాకేం ప్రమాదం జరుగకూడదు!’
‘‘నా గొంతులో ఊపిరుండగా మీ మీద ఈగను కూడా వాలనీను!’’
‘‘బయలుదేరుదామా?’’
‘‘చిత్తం!’’
‘‘తివాసీ కాదు నీవు మోసేది- నీ రాణిని అని మాత్రం గుర్తుంచుకో!’’
‘‘నాకంతా గుర్తే రాణీ! మీరు ఆజ్ఞాపించినట్లు సీజర్ ప్రభువు దగ్గరకు మిమ్ము జేర్చవరకూ, కంటిమీద రెప్ప కూడా మూయను!’’
క్లియోపాత్రా ఏమీ మాట్లాడలేదు. ఆమె హృదయం ఆతృతతో ఉరుకుతోంది. ఈనాడామె ఎంత అందంగా అలంకరించుకున్నదో కాని, గత రెండేళ్ళుగా ఆమెను నిత్యం చూస్తున్నవాళ్ళు కూడా చప్పున గుర్తించలేరు. ఇప్పుడామెను చూస్తే దేవలోకం నుంచి ఏ శాపకారణానో, హఠాత్తుగా భూమిమీద పడిన దేవకన్య గుర్తుకు రాకమానదు.
ఆమె తివాసీమీద పడుకుంది. బానిస ఆమెను ఎంతో సున్నితంగా చుట్టాడు. లోపల మనిషి ఉన్నదని అనుమానించేందుకు వీల్లేదు. ఆ తివాసీ అతి విశాలమైనది కావటంవల్ల మధ్యలో వున్న మనిషిని ఎవ్వరూ పోల్చలేరు.
‘‘రాణీ! మీకెలా ఉన్నది?’’ అన్నాడు బానిస.
‘‘సుఖంగానే ఉన్నది’’ అన్నదామె లోపలినుంచి. ‘‘తివాసీ కడుతున్నాను. మీకేమైనా బాధ కలుగుతుందేమో చెప్పండి’’
‘‘అలాగే’’
వాడు తివాసీని కట్టాడు.
‘‘అమ్మా! తివాసీని ఎత్తుకుంటున్నాను’’
‘‘ఎత్తుకో, నేను చెప్పిందంతా గుర్తున్నది కదా?’’ అన్నది క్లియోపాత్రా.
‘‘ప్రతి అక్షరమూ గుర్తున్నది’’
‘‘ఇక నాతో మాట్లాడవద్దు. ఎంత ప్రమాదం జరిగినా సరే నాతో మాట్లాడకు. బైటి మాటలు నాకు వినిపిస్తూంటవి కనుక నేనే అంతా గ్రహించుకుంటాను. లోపల నేను ఉన్నానని ఎవ్వరికీ అనుమానంకూడా కలగరాదు. అలా తెలుస్తే, మనిద్దరం ప్రాణాలతో రుూ భూమి మీద మరి ఉండం!’’ అన్నదామె.
‘‘చిత్తం.’’

- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు