డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈజిప్టు వ్యవహారాలను పరిష్కరించేందుకు ఆయన ప్రయత్నిస్తూన్నాడనే వార్తలు వస్తున్నవి. దీన్నిబట్టి ఈజిప్షియన్లు వాంఛించే స్వేచ్ఛా స్వాతంత్య్రాల స్వరూపం ఎలాంటిదో క్లియోపాత్రా గ్రహించింది. రోమన్ దాస్యమనేది ఎవ్వరికీ తప్పదు. ఇప్పుడు రోమన్ అండదండలుండేవారే ఈజిప్టుకు కూడా పాలకులవుతారు.
ఈజిప్టు నుంచి రాయబారి వచ్చి, తనను రమ్మని జూలియస్ సీజర్ ఆజ్ఞాపిస్తున్నట్లు చెప్పడు. ఆజ్ఞ! తన మీద అందరూ అధికారాలు చెలాయించేవారే కదా! అందాల ఉంచి, ఈనాడు సీజర్, రోమ్‌లోని తనస్థానాన్ని సుస్థిరం చేసుకోకుండా, అక్కడి సమస్యల్ని పరిష్కరించుకోకుండా ఈజిప్టు రాచ వ్యవహారాల్ని చక్కబెట్టే బాధ్యతను ఎందుకు నెత్తిన పెట్టుకున్నాడు?
సీజర్ జీవిత గాథను విన్న క్లియోపాత్రా తీవ్రంగా ఆలోచించింది. సీజర్‌కు తలమునకగా అప్పులున్నవి. ఆ అప్పులు తీర్చేవరకూ, తీరవగలిగేవరకూ రోమ్‌లో కాలు పెట్టలేడు! ఈ ధనాన్ని ఈజిప్టు నుంచి కొల్లగొట్టాలని ఆయన నిశ్చయించుకొని ఉంటాడు. ఐతే టాలమీ ప్రభుత్వం మొత్తాన్నిఇచ్చి, తమ స్వేచ్ఛను ఎందుకు పొందలేదు? లేక టాలమీ ఆ మొత్తాన్నిచ్చేందుకు నిరాకరిస్తే, తనను రాణిని చేసి, ప్రభుత్వ ఖజనానను వశపరచుకుందామనుకున్నాడా రుూ సీజర్?
తన దగ్గిర ప్రస్తుతం చిల్లిగవ్వలేదు. దినదినగండంగా బతుకుతోంది. హఠాత్తుగా తనను రాణిని చేసినా, పేరుకు పాలకురాలే అవగలదు కానీ, తాను బంగారాన్ని ఎలా ఇచ్చుకోగలదు?
గత ఏణ్ణర్థంగా టాలమీయే పన్నులు వసూలు చేసుకుంటున్నాడు. ఏమన్నా వుంటే అతని దగ్గరే ధనం దొరకాని కాని, తనలాంటి నిర్భాగ్యురాలి దగ్గిర ఉండగలదుకునేటంత మూర్ఖుడు, జూలియస్ సీజర్ మాత్రం అయి ఉండడని ఆమె తలపోసింది.
కాని సీజర్ పంపిన రుూ ఆహ్వానంలో ఆమెకో కొత్త ఆశ కనిపించింది. టాలమీ ఎదురు తిరిగే సూచనలు ఉన్నట్లయితే, ఆయన తననే రాణిని చేస్తాడు. ఐతే అప్పుడు కూడా తాను రోమ్‌కు ధనసహాయం చేయలేదు కదా!
లేక, టాలమీని సంతృప్తిపరిచేందుకుగాను, తనను వధించేందుకు రుూ ఎత్తుగడ వేశాడా? ఇదే నిజమైతే, తనను అంతదూరం పిలవనంపటం దేనికి? తనను హతమార్చేందుకు తగిన శక్త సామర్థ్యాలు టాలమీకే ఉండగా, సీజర్ సహాయం అవసరం కాగలదా?
లేక తనకూ, తన భర్తకూ పొత్తు కుదిర్చి, ఈజిప్టు రాజకీయాలను ఒక మార్గాన ఉంచి తనకు కావలసింది పిండుకునేందుకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరచాలని చూస్తున్నాడా? తనకూ, టాలమీకి పచ్చగడ్డి వస్తే భగ్గుమంటుంది. ఎవరో ఒకరే ఉండాలి. కాని ఆ రెండు కత్తులూ ఒకే ఒరలో ఇమడవు
ఆమె ఆలోచనలు పూర్తిగాకుండానే ఈజిప్టు నుంచి శీఘ్రయాన వార్తావహుడు వచ్చాడు, తనను జూలియస్ సీజర్ వెంటబెట్టుకొని రమ్మనే ఆజ్ఞను తీసుకొని వచ్చాడు.
ఆమె ఇంకా లోతులకు వెళ్ళి ఆలోచించసాగింది. సీజర్ ఈజిప్టు నుంచి ధన సహాయాన్ని పొందేందుకు మాత్రమే వచ్చి ఉండడేమో? ముందు రోమ్‌లో తన సర్వాధికారాన్ని పొందేందుకు మాత్రమే వచ్చి ఉండడేమో? ముందు రోమ్‌లో తన సర్వాధికారాన్ని సుస్తాపితం చేసుకోవలసిన అవసరాన్ని కూడా ఏమరచి, ఇక్కడ ఎందుకు వేళ్ళాడుతున్నాడు? ముఖ్యంగా ఏ క్షణాన్నయినా ఈజిప్టులో రోమన్‌లమీద తిరుగుబాటు జరిగిందంటే, జీవితమంతా తపస్సు చేసి సంపాయించిన రోమన్ సామ్రాజ్యం కూడా గుటకాయస్వహా అవుతుంది. ముందు రోమన్‌లోని తన శత్రువుల సంగతి చూసుకోడెందుకని?
తాను విన్నది. జూలియస్ సీజర్ విలాస పురుషుడని! అందమైన ఆడవాళ్ళ కోసం అతను ఏమైనా చేయగల సమర్థుడనీ విన్నది. ఇక తాను జగదేక సుందరిగా పేరు గాంచింది. తన అందచందాల్ని గూర్చి రోమ్‌లో కథలు చెప్పుకొంటున్నారని వేగులవాళ్ళ ద్వారా తనకు తెలిసింది. స్ర్తిలంటే నవనీత హృదయుడైన సీజర్, ఈజిప్టు నుంచి ధనసహాయమే గాక, తనలాంటి దేవ సుందరిని కూడా గెల్చుకుందామని ఆశించి ఉండడా?
రుూ ఊహతో ఆమె బుర్రలో మెరుపులు మెరిసినవి. ఇదే నిజమై ఉండొచ్చు. ఐతే ఆయన వయసుస 50 సంవత్సరాలకు దరిదాపుల్లో ఉన్నదని విన్నది. ముసలివాడికి తనలాంటి పడుచుది కావాలి!
మరి తనకో.. తనకు రోమన్ అంటే ఎంతో అపేక్ష! ఇక సర్వాధికారైన రోమన్ ప్రభువంటే ఎంతో మమత. ఆయన వయస్సా? వయస్సు అడ్డంకి ఏమున్నది? జగత్ ప్రసిద్ధమైన రాజవైద్యులు అనేకమంది ఈజిప్టులో ఉన్నారు. ముసలితనాన్ని పారద్రోలి పడుచుదనాన్ని ప్రసాదించగల అమోఘ ప్రక్రియలు వారి చేతుల్లో ఉండనే ఉన్నవి.
యుద్ధాలతో అలసిపోయి, జీవితమంటేనే వెగటేసే స్థితిలో ఉన్న సీజర్‌కు తాను మరో ప్రపంచాన్ని చూపగలదు. బహుశా అది స్వర్గమే అయి ఉండగలదని ఆయన్ను తాను నమ్మించగలదు. తన వలలో చిక్కుకుంటే, సీజర్ లాటి చారిత్రాత్మక పురుషుణ్ణి తాను లొంగదీసుకోగల సమర్థురాలే అవుతుంది. అప్పుడే తన అందచందాలకు విలువ. ఇదే తనకు అగ్నిపరీక్ష!
అతి త్వరలో వస్తున్నానని చెప్పమని వార్తావహుణ్ణి పంపేసింది క్లియోపాత్రా. ఆ తరువాత ఇరాస్‌ను పిలవనంపింది.
‘‘నేను ఈజిప్టు వెళ్లేందుకే నిశ్చయించుకున్నాను’’ అన్నదామె.
ఇరాస్ ఆశ్చర్యపడ్డాడు. కాదు భయపడ్డాడు!
‘‘రాణీ! జాగ్రత్తగా ఆలోచించు. తీరా అక్కడికి వెళ్లి చిక్కుపడతావేమో!’’ అన్నాడాయన.
‘‘జీవితంలో ఇంతవరకూ చిక్కుల్లో చిక్కుకోకుండా ఉన్నాను కనుకనా? ఆత్మహత్య చేసుకోవాలని గత రెండేళ్లుగా ఎన్నోసార్లు నిశ్చయించుకున్నాను. కాని చావలేకపొయ్యాను. ఒకవేళ ఈజిప్టులో నన్ను హత్య చేసినట్లయితే, దానికి విచారమెందుకు? నాకు నేను చేసుకోలేనిది వేరొకరు చేసి పెడతారుకదా?’’ అన్నదామె.
‘‘అది కాదు రాణీ! కోరి ప్రమాదాలను తెచ్చుకుంటావా? చూస్తూ చూస్తూ సింహం నిద్రిస్తున్న గుహలోకి జొరబడతావా?’’
క్లియోపాత్రా నవ్వింది.‘‘సింహాన్ని వశపరచుకోదలచుకున్నపుడు, దాని గుహలోకి జొరబడక తప్పుతుందా?’’ అన్నదామె.
ఇరాస్ నిర్ఘాంతపోయాడు లేడిలాంటి రుూ చిన్నపిల్లేమిటి సింహంలాంటి సీజర్‌ను వశపరచుకునేందుకు వెళ్ళటమేమిటో ఆయనకు అర్థం కాలేదు. అసలు అలాంటి ఊహ కలలో వచ్చినా, అది పీడకల కిందనే తీసుకోవాల్సి వుంటుందని ఆయనకు నమ్మకం.
గురువుగారిలో కలిగిన సంచలనాన్ని ఆమె గ్రహించింది. కాని, తన నిర్ణయాలు ఇప్పుడెవరికీ అర్థం కావు. ఫలితాలు తెలిశాక కాని తన తెలివితేటల్ని ఎవ్వరూ మెచ్చుకోరు. ఆ ఫలితాలు తనకు అనుకూలంగా ఉండగలవని ఆమె గాఢ నమ్మకం. అదీగాక ఇదే తన చిట్టచివరి ప్రయత్నం. చివరి ఆయుధం అంతకన్నా గతిలేదు.
‘‘బాగా ఆలోచించు రాణీ!’’’ అన్నాడాయన.
‘‘సరే.. సైన్యాన్ని సిద్ధం చేయించమంటావా రాణీ!’’ అన్నాడు ఇరాస్, ఎదురుచెప్పే సాహసంలేక. నిరాశతో కుంగిపోయే వ్యక్తి ఒక్కో సమయంలో ఎంత సాహసానికి సిద్ధపడాల్సి వుంటుందో , జీవితానుభవం వున్న ఆయనకు అర్థవౌతోంది.
‘‘అక్కర్లేదు.. నేను ఒక్కతే వెళ్తాను’’.
‘‘ఒక్కతెవా రాణీ!’’ అన్నాడాయన మరింత ఆశ్చర్యపడుతూ.
‘‘ఔను.. సైన్యాన్ని తీసుకొని వెళ్లి, నేను యుద్ధం చేయబోతున్నాననుకున్నారా?’’
- ఇంకా ఉంది