డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమన్ సామ్రాజ్యాన్ని పాంపేలాంటి అజేయుని చేతుల్లోంచి గెల్చుకున్నాడంటే ఆయన యుద్ధ కౌశలాన్ని గూర్చి ఇంకేం చెప్పనవసరం లేదనుకుంటనా!’’’
‘‘ఆయన రాజకీయ జీవితం సంగతి అలా ఉంచండి. వ్యక్తిగత జీవితమేమిటి?’’ అన్నది క్లియోపాత్రా.
ఇరాస్ మాట్లాడకుండా తల వంచుకొన్నాడు.
‘‘మాట్లాడరేం?’’ అన్నదామె.
‘‘ఆయన వ్యక్తిగతం జీవితం వినేందుకు అంత గొప్పగా ఉండదు రాణీ!’’’ అన్నాడాయన.
‘‘ఏం?.. అంత నీచమైనదా?’’
‘‘నీచమని కాదు; ప్రతి మానవునికి కొన్ని లోపాలూ బలహీనతలూ ఉంటవి’’
‘‘అదే వివరంగా చెప్పండి’’ అందామె- వికసించిన మొహంతో.
క్లియోపాత్రా, రుూ వ్యక్తిగత జీవితం మీద ఎందుకు కుతూహలాన్ని చూపుతుందో ఇరాస్‌కు అర్థం కాలేదు. ఐనప్పటికీ తన విధులను నిర్వర్తించటంలో ఆయన ఏమరి ఉండదు. అందుకని చెప్పనారంభించాడు;
‘‘జూలియస్ సీజర్ చండ ప్రచండుడు. ఆయన మాట్లాడటం, ఆజ్ఞాపించటమే! ఐతే అందమైన స్ర్తిల దగ్గర జావయిపోతాడు. యుద్ధరంగంలో పులి, సౌందర్యవతుల ముందు పిల్లి!’’’
క్లియోపాత్రా మనసు తేలికపడినట్లు నిట్టూర్చి, ఆతృతగా ఇరాస్ వంక చూసింది- త్వరగా చెప్పమన్నట్లు.
‘‘జీవితంలో మూడు నాలుగుసార్లు ఆయన పెళ్ళిళ్లు చేసుకున్నాడు. ఐతే ఆయనకు మగ సంతతి అంటూ లేదు. ఒకసారి భార్య వ్యభిచరించిందనే అభియోగంమీద అదంతవరకూ నిజమో ఎవరికీ తెలియదు- ఆమెకు విడాకులిచ్చాడు. ఆయనకు ఎంతోమంది ప్రియురాళ్ళు ఉన్నారని అంటారు. మొత్తంమీద స్ర్తిల మీద ఆయనకు మమత హెచ్చు.
‘‘ఆయన జీవితంలో ఆనందాన్ని పొందటం ఒక ఆశయంగానే నెరవేర్చుకుంటున్నాడు. యుద్ధ్భూమికి కూడా రాజభవనాలు తరలి వెళ్ళుతవట! ముఖ్యంగా జనానా వెంట ఉంటుందట! ఇక ఆయన వెచ్చించే ధనానికి అంతూ పంతూ లేదు. రోమ్‌లో ఐశ్వర్యవంతులందరి దగ్గిరా ఋణాల చేసాడట! ఎలాగైనా సీజర్ సర్వాధికారి ఐతేనే తప్ప తమ ఋణాలను రాబట్టుకునే అవకాశముండదని భాగ్యవంతులందరూ సీజర్‌కు భుజమిచ్చారు. ఇప్పుడు రోమ్‌లో సీజర్ విజయాన్ని అందుకున్నందుకు అందరూ సంతోషపడుతున్నారు.’’
క్లియోపాత్రా కళ్ళు మూసుకొని దీర్ఘాలోచనలో పడింది. తన మాటల్ని వినటం లేదేమోనని ఇరాస్ తలచాడు.
‘‘వినటంలేదా రాణీ!’’ అన్నాడు.
‘‘వింటున్నాను..’’ అన్నదామె. నిజానికి ఆమె ఆ మాటలిన దృశ్యాల్లోకి మార్చుకొని చూడగలుగుతోంది.
‘‘అంతేనా?’’ అన్నదామె కళ్ళు తెరుస్తూ.
‘‘వినదగింది అంతే!’’
‘‘సరే.. మీరు వెళ్ళవచ్చు’’
ఇరాస్ సెలవు తీసుకొని వెళ్లిపోయాడు.
ఒంటరిగా కూర్చొని ఆమె దీర్ఘంగా ఆలోచించసాగింది. మానవుడు ఎంత బలవంతుడైనా, ఏదో ఒక బలహీనతంటూ ఉండకపోదు. ఆ బలహీనతను ఆధారంగా అతన్ని జయించటం సులభం. ఈ విధంగా వాడిపోయిన ఆమెఆశలు తిరిగి చిగురించనారంభించినవి. ఐతే వాటికి ఇప్పుడిప్పుడే పునాదులు ఏర్పడుతూన్నవి. అవి ఏ విధంగా పరిణమించి ఏ రూపాన్ని దాలుస్తవనేది మరికొంతకాలం వేచి ఉంటేనేన కాని తేలదు.
8
రెండు రోజుల తరువాత పాంపే ఈజిప్టు వచ్చాడు.
పాంపే నిన్నటిదాకా సర్వాధికారి మాత్రమే కాదు; రాజుల్ని నియమించగల శక్తివంతుడు. కాని, రుూనాడు కేవలం ప్రాణరక్షణార్థం ఈజిప్టు తీరాల్ని వెతుక్కుంటూ వచ్చాడు.
కేవలం 2వేలమంది సైనికులతో ఓడలో వచ్చాడు. తీరాన రోమన్ సైనికులు నిలబడి ఉన్నారు ఈజప్షియన్ ప్రభుత్వాధికారులు స్వాగతమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఐతే తీరా ఈజిప్టు గడ్డమీద కాలుపెడితే ఏవౌతుందోనన్న సందేహం ఉంది. ముఖ్యంగా పాంపే భార్య వొడ్డుకు వెళ్ళొద్దని భర్తను బతిమాలింది. కాని గట్టున రోమన్ సైనికుల్ని చూశాక పాంపే మరి ఆగలేకపోయాడు.
చిన్న తెప్పమీద , నానా అవస్థాపడి పాంపే ఈజిప్టు తీరంమీద కాలుమోపాడు. వెంటనే ఆయన్ను ఒక వైపున ఆహ్వానిస్తూనే, రెండోవైపున తల నరికారు. తలను మాత్రం బల్లేనికి గుచ్చి, శరీరాన్ని సముద్రంలోకి విసిరిపారేశారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న పాంపే భార్య దుఃఖభారంతో తన ఓడను తరలించుకు పారిపోయింది.
నిన్నటిదాకా తమకు ఏలికగా వున్న పాంపే తల నరుకుతూంటే రోమన్ సైనికులు శిలావిగ్రహాలవలె నిలబడి చూస్తున్నారు. ముందువరుసలో రోమన్ సైనికులున్నారు. వారి వెనుక ఈజిప్షియన్ సైనికులున్నారు. ఈజిప్షియన్లు విచ్చుకత్తులతో సిద్ధంగా ఉన్నారు. రోమన్ సైనికులు కదిలినా, మెదిలినా తెగేసేందుకు ఏర్పాట్లు జరిగినవి. ఈ సంగతి తెలిసిన రోమన్ సైనికులు మాట్లాడలేదు.
అదీగాక రోమన్ సైనికులు చాలా సంవత్సరాలుగా ఈజిప్టులోనే ఉండి, స్థిరపడిపోయారు. వారికి ఏలిక ఎవరైనా ఒకటే! తమను సుఖంగా ఈజిప్టులో ఉండనిస్తే చాలు! ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకొని కాపరాలు చేస్తూ,, సంతానాన్ని పొందారు అందుకని ఇప్పుడు రుూ రోమన్ సైనికులకు రోమ్‌మీదకన్నా, ఈజిప్టుమీదనే అభిమానం పెంపొందింది.
పాంపేకు జరిగిన గౌరవ మర్యాదలు విని క్లియోపాత్రా వణికిపోయంది. అధికారమనేది ఎంత ప్రమాదకరమైనదో ఆమె కళ్ళారా చూస్తోంది. రోమన్ ప్రభుత్వం పాంపేను ఆకాశపుటంచులకు జేర్చింది. కనుకనే రుూనాడు అతను అంత ఎత్తునుంచీ కిందపడి ప్రమాదానికి గురయ్యాడు.
ఐతే పాంపేను సంహరించినందుకు సీజర్, ఈజిప్షియన్లను అభినందిస్తాడని ఆమె నమ్మలేకపోయింది. ఎందుకంటే ఒకప్పుడు సిరియాలోని రోమన్ రాజబార కార్యాలయం, రోమన్‌ను బంధించే హక్కు ఈజిప్షియన్‌కు లేదని తనకు తాఖీదు పంపింది. ఇక ఈనాడు రోమన్ ప్రభువునే చంపటాన్ని సీజర్ లాంటి మరో ప్రభువు ఆమోదింపగలుగుతాడా?
మూడు రోజుల అనంతరం సీజర్ ఈజిప్టు గడ్డమీద కాలు పెట్టడు. ఆయనకు పాంపే తల బహుమతిగా ఇవ్వబడింది కాని, ఆయన ఎంతో దుఃఖపడ్డాడు. పాంపేను చంపినవారిని బంధించాడు.
సీజర్ 34 ఓడల్లో వచ్చాడన్న వార్తలు క్లియోపాత్రకు అందినవి. ఆయన బహుశా ఏ 4వేలమంది సైనికులతో వచ్చి ఉంటాడు. ఈజిప్షియన్ సైన్యం కనీసం 20వేలు ఉంటుంది. యుద్ధ్భూమిలో అలిసిపోయిన వచ్చిన సీజర్‌నూ, ఆయన సైన్యాన్నీ బూడిద చేసేందుకు ఇంతకన్నా మంచి సమయం ఈజిప్షియన్‌లకు మరి ఉండదు.
ఈజిప్టులోని రోమన్ సైనికులు కూడా ఈజిప్టు పక్షమే వహిస్తారు. సిరియానుంచి రోమన్ సైన్యాలు వచ్చేలోగా సీజర్‌ను కాలబెట్టి నేల రాయవొచ్చు. ఈజిప్షియన్‌లకు ఈ పరాయి ప్రభుత్వం తమమీద అధికారాన్ని చెలాయించటం బొత్తిగా ఇష్టంలేదు. వారు తమ స్వాతంత్య్రాన్ని సాధించుకునేందుకు ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు.
కాని, అలా జరగలేదు!
పైపెచ్చు విజయుడైన జూలియస్ సీజర్‌కు ఈజిప్టు ఘనస్వాగతమిచ్చింది. రాజభవనంలోనే ఆయన మకాం చేశాడు.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు