డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నా జీవితాశయమే అది! దానికొరకై నేను ఎన్ని బాధలనన్నా పడేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని క్లియోపాత్రా హామీ ఇచ్చింది.
‘‘టాలమీతో మనం ఎందుకు రాజీపడరాదు?’’
‘‘అంటే?’’ అని ఆమె కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యాన్ని వెలిబుచ్చింది.
‘‘రాణీ! నీ భర్త నిన్నీనాటికి ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు తెలియంది కాదు. ఈజిప్షియన్లు తమ రాజదంపతుల మధ్య అనురాగం లేకుండటాన్ని సహించరని నీకు తెలుసు. నీవీనాడు దేశ బహిష్కృతవు అయ్యేందుకు ఇదే పెద్ద కారణమని అంగీకరించక తప్పదు. మీ ఇద్దరిమధ్యా చీలికలంటూ ఉండటంవల్లే, తప్పంతా నీదేననీ, నీ ప్రజలు నీకు తోడుగా లేరని తెలిశాకనే కదా, రోమన్ ప్రభుత్వం టాలమీనే రాజుగా అంగీకరించింది?’’’
ఆయన మాటల్ని మధ్యలోనే అందుకొని క్లియోపాత్రా కోపంతో అన్నది, ‘ఆచార్యా! అదంతా నా స్వవిషయం. ఇందులో అటు రోమన్‌కు కానీ, ఇటు ఈజిప్టుకు కానీ సంబంధమేమిటి?’’
ఇరాస్ నవ్వాడు. ‘‘రాణీ! నీవు సర్వ సామాన్యురాలివి ఐనట్లయితే, ఇతరులకు సంబంధం లేనిదానివిగానే ఉండేదానివేమో? కాని, వంశాచారాలనూ, వంశ మర్యాదలనూ అతిక్రమించటం, అందునా రాజవంశంలోనే ఇలాంటి దారుణం జరగటాన్ని నీ ప్రజలు ఒప్పరు. ప్రజాభిప్రాయాన్ని అనుసరించే కదా- నీవు పరిపాలన చేయవలసింది! వారు నీ ప్రవర్తనను అంగీకరించలేనప్పుడు నిన్ను మాత్రం ఎందుకు అంగీకరిస్తారు? వారి దృష్ట్యా తప్పంతా నీది! న్యాయం టాలమీ పక్షానేవున్నది’’ అన్నాడు.
‘‘కాని..’’ అన్నదామె. ‘‘టాలమీకీ, నాకూ ఈడా? జోడా? వాణ్ని నేను చిన్నతనం నుంచీ ఏవగించుకుంటూనే ఉన్నాను. సమయం దొరికితే ఆ వెధవను చంపేసి ఉండేదాన్ని!’’
ఇరాస్ పకపకా నవ్వాడు. క్లియోపాత్రా తాను తొందరపడి అనరాని మాటలన్నానేమోనని భయపడింది.
‘‘పిచ్చిపిల్లా! నీవు టాలమీని ద్వేషించినా, అతను నిన్నింకా ప్రేమిస్తూ, నీ సౌందర్యంమీద గంపెడాశ పెట్టుకున్నాడు కనుకనే, నీవీనాడు సజీవిగా ఉన్నావు. ఈనాడు కాకున్నా రేపైనా అతనికి భార్యగా ఉండగలవని అతను ఆశిస్తున్నాడు కనుకనే, నీ క్షేమానికి భంగం వాటిల్లకుండా కాపాడుతున్నాడు. నీ మనసులోని ఈ ద్వేషజ్వాలల్ని గూర్చి అతను పసికట్టినట్లయితే, ఏనాడో శక్తివంతుడైన అతను నిన్ను నల్లిని నలిపినట్లు నిలిపివేసి ఉండేవాడు- తెలుసా?’’
‘‘తెలుసు.. కాని, నా గొంతులో ఊపిరుండగా వాణ్ని నేను భర్తగా అంగీకరించలేను!’’ అన్నదామె నిశ్చయ కంఠస్వరంతో.
‘‘ఐనప్పుడు రుూ వివాహానికి ముందే నీవు పారిపోయి ఉండవలసిందే కదా!’’
‘‘అప్పుడు అవకాశం లేకపోయింది. వాణ్ని పెళ్లాడితేనే కానీ, ఈజిప్టు అర్ధ సింహాసనం నాకు దక్కేది కాదు. ఆ తరువాత నేనే రాణివౌతాను కదా అని ఆశించాను. కాని, టాలమీ నాకు ఆగర్భశత్రువైనాడు. ఏ విధంగా అధికారాన్ని చెలాయిద్దామనుకున్నా, నాకు అవకాశం లేకుండా పోయింది.. నీకంతా తెలుసు కదా!’’ అన్నదామె.
తనకు తెలిసిందీ, తాను అర్థం చేసుకోగలిగిందీ వేరు. ఆమె అభిప్రాయాలూ, ఆశయాలూ వేరూనూ. అందుకని ఆమె మనసు తెలుసుకునేవరకూ తన అభిప్రాయాలకు విలువ ఉండదని ఇరాస్ గ్రహించలేకపోలేదు. ఐతే క్లియోపాత్రా అంతే తేలికగా తన మనసు బైటపెట్టే మగువ కాదనీ అతనికి తెలుసు. అందుకని చర్చ ద్వారానే ఆమె హృదయం బైటపడగలదు.
‘‘సరే.. నీవు అనుకున్నదేమీ కుదరలేదు. అదలా ఉంచు.. ఇప్పటికి మాత్రం మించిపోయిందేమున్నది? వారానికి ఒకసారన్నా ఈజిప్టునుంచి రాయబారి వచ్చి నీ భర్త నీ రాకకు స్వాగతమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని చెబుతూనే ఉన్నాడు కదా! కాస్త ఆలోచించి చూడు. రాణి! ఇప్పుడు టాలమీ కూడా పెద్దవాడయ్యాడు. యవ్వనపు కోర్కెలతో కాగిపోతున్నాడు. నీలాటి జగదేక సుందరి తనకు భార్యయినందుకు నిజంగానే ఎంతో గర్వపడుతున్నాడు; తనంత అదృష్టవంతుడు లేడని అనుకుంటున్నాడు. ఐతే అతనికి నీవు ఏనాడూ అందలేదు, దరిజేరనివ్వలేదు. చేతకందని అదృష్టం దురదృష్టమే అవుతుంది. ఐనప్పటికీ అతనికి నీ మీద ఆశలు పూర్తిగా చల్లారలేదు. నీవు తిరిగి వస్తావనీ, తనతోకలిసి ఉంటావనీ, నీవు సుఖపడి, తనను సుఖపెడతావనీ అతనింగా నమ్ముతూనే ఉన్నాడు. ఆ నమ్మకం అతనిలో లేనినాడు ఈజిప్టు నుంచి రాయబారులు నీ కొరకు రారు. ఈజిప్షియన్ సైన్యాలే వచ్చి రుూ చిన్న పటాలాన్నీ, నిన్నూ, నన్నూ కూడా కాలబెట్టి నేలరాచి, బూడిద పోగులు మాత్రం ఇక్కడ వదిలి తిరిగి వెళ్తవి. ఆ విషమ స్థితి రాకముందే మనం జాగ్రత్తపడటం అవసరం..’’ అన్నాడు ఇరాస్; తన మాటలు క్లియోపాత్రలో ఎలాంటి సంచలనాన్ని కలిగిస్తవోనని ఆశతో ఎదురుచూస్తున్నాడు.
కాని క్లియోపాత్రాలో తిరిగి ఆవేశం ప్రవేశించింది. తనకు బొత్తిగా ఇష్టంలేని పనిని చేయించాలని తన మీద ఒత్తిడి జరుగుతూన్నట్లు ఆమె భావించింది.
‘‘ఇందాకనే అన్నాను కదా!- టాలమీకి, నాకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని!’’ అన్నదామె.
‘‘కాని, ఇంతకుముందే మరో మాట కూడా అన్నావు రాణీ! గుర్తుతెచ్చుకో! ఎన్ని అవస్థలు పడైనా సరే, ఎన్ని బాధలు భరించైనా సరే, ఈజిప్టు సింహాసనం ఎక్కాలన్నావు. అదే నీ జీవితాశయమన్నావు. ఐనప్పుడు మన రుూ ప్రస్తుత పరిస్థితిలో టాలమీతో రాజీపడటంకన్నా గత్యంతరంలేదు. నీవు మరి రోమ్ వెళ్ళవలసిన శ్రమ కూడా ఉండదు. నీ భావి జీవితమంతా రుూ క్షణంలో టాలమీ మీద ఆధారపడి ఉంది. అందుకని నేను చెప్పదల్చుకున్నదేమంటే- రుూనాడు రోమ్ నిన్ను ఈజిప్టు రాణిగా గుర్తించకపోయినప్పటికీ; టాలమీ నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తూ అడుగులకు మడుగులొత్తుతూ తన రాణిగా స్వీకరిస్తాడు! చివరకు నీ కోసమై రోమ్‌ను ఎదుర్కొనేందుక్కూడా అతను వెనుదీయడు. ఇదంతా నీకు బాధ కలిగించినప్పటికీ, నీ జీవితాశయం నెరవేరేందుకు అదే అడ్డదారి. ఈజిప్షియన్లు నిన్ను ఏవగించుకుంటున్నా, టాలమీ నీకు తన సింహాసనం మీద స్థానమిస్తాడు. చేతిలో ఉన్న సకలాధికారాలనూ ఉపయోగపరిచైనా సరే, అతను ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఎదురొడ్డి నిలుస్తాడు. వంశాచారానుసారంగా నీవు భర్తగా టాలమీని అంగీకరించినట్లయితే, ఈజిప్షియన్లు కూడా ఎదురు చెప్పే అవకాశాలుండవు’’
‘‘ఊహూ.. అది కుదరదు. నా జీవిత సర్వస్వాన్నీ ఆ టాలమీగాడి కాళ్ళముందు పడెయ్యడం జరగదు. ఈ శాశ్వత బానిసత్వానికి నేను ఒప్పుకోలేను’’ అన్నదామె.
మధ్యలోనే అందుకొని ఇరాస్ అన్నాడు: ‘‘పూర్తిగా విను రాణీ! ముందు ఈజిప్టు రాజవంశంలో తిరిగి ప్రవేశించందే, నీవు దమ్మిడీకి చెల్లవు. నీ మీద ఆశలన్నీ అడుగంటకముందే టాలమీని వలలో వేసుకో. చివరకు నటించైనా సరే, టాలమీని చెంగున కట్టుకోవచ్చు. స్ర్తికి, అందునా నీలాటి తెలివిగలదానికి, భూలోక రంభకు, టాలమీలాంటి కుర్రవాణ్ణి వశపరచుకోవటం ఒక లెక్కలోనిది కాదు; నీకన్నా ముందుగానే; నీ ప్రయత్నం లేకుండానే అతను నీ కాళ్ళముందు మోకరిస్తున్నాడు. ఈ సదవకాశాన్ని దుర్వినియోపరచుకోకు. ఈ విధంగా రాజుగారి భార్య- రాణిగానైనా సరే, నీవు తిరిగి ఈజిప్టు పరిపాలనలో భాగం పంచుకుంటే, క్రమంగా అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్ననాడు, ఇప్పటి నీ స్థానం టాలమీకి, టాలమీ స్థానం నీకూ ప్రాప్తించగలవు. స్ర్తి వ్యామోహంలో పడిన పురుషుడు తన స్థితిని తెలుసుకోలేడు. ఆ మైకంలోనే అతన్నుంచి నీకు కావలసిన అదికారాలన్నిటినీ చేజిక్కించుకోవచ్చు.
- ఇంకాఉంది -

-ధనికొండ హనుమంతరావు