జాతీయ వార్తలు

ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రాన్ని కోరిన సిపిఎం
న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయడానికి అవసరమైన చట్టం చేయటంతో పాటు విద్య, వైద్యం వంటి ప్రాథమిక సదుపాయాలు దేశంలోని హరిజన, గిరిజన వర్గాలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. గురువారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ శీతాకాలం సమావేశాల మొదటి రెండు రోజులను కేవలం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలపై చర్చిండానికే కేటాయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఆ వర్గాల అభ్యున్నతికి తీసుకోవలసిన చర్యలను సిపిఎం సూచించింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక సమావేశం నిర్వహించలేకపోతున్నందున హరిజన, గిరిజన వర్గాలకు సంబంధించిన సమస్యలపై విస్తృతంగా చర్చించటానికి ఐదు రోజులను కేటాయించాలని కోరారు. ఈ మేరకు సిపిఎం నేతలు కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్లమెటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్యనాయుడుకు వినతిపత్రం అందించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఎం నేతలు కె రాధాకృష్ణన్, వి శ్రీనివాసరావు, ఆసిమ్‌బాల, జి మమత వినతిపత్రంలో కోరారు. ఎస్సీ, ఎస్టీలపై పెరుగుతున్న అత్యాచారాలను అణిచివేయవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆ వర్గాల అభ్యున్నతికి సబ్‌ప్లాన్ రూపొందించి అమలు చేయాలన్నారు. పైవేటు యాజమాన్యాల అధీనంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించటానికి ఉద్దేశించిన సవరణకు మోక్షం కలిగించాలని కేంద్రాన్ని కోరారు.