జాతీయ వార్తలు

శాసన మండలి ఎన్నికలకు ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: తెలంగాణాలో స్థానిక సంస్థల నుండి శాసన మండలిలోని 12 సీట్లకు జరుగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ సోమవారం ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్ నుండి దామోదర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుండి డా.చంద్రశేఖర్, నల్గొండ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ టికెట్‌పై పోటీ చేస్తారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మధుసూధన్ మిస్ర్తీ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలో సి.పి.ఐ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణా కాంగ్రెస్‌లో విభేదాలు పొడసూపటం తెలిసిందే. సి.ఎల్.పి నాయకుడు కె.జానారెడ్డి, నల్గొండ లోకసభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎం.పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సమర్థించగా పి.సి.సి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పెద్ద కాంట్రాక్టర్ అనీల్‌కుమార్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. కాంగ్రెస్ అధినాయకత్వం అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రంగంలోకి దించాలనే నిర్ణయానికి వచ్చింది.
ఖమ్మం జిల్లా స్థానిక సంస్ధల కోటా నుంచి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పువ్వాడ నాగేశ్వరరావుకు కాంగ్రెస్ ఇదివరకే మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల స్థానిక సంస్ధల కోటా నుంచి ఎమ్మెల్సీలను ఎన్నుకునే విషయంలో పరస్పరం సహకరించుకోవాలని కాంగ్రెస్- టిడిపి నాయకులు భావించి, ఆ దిశగా చర్చలు కూడా జరిపినట్లు ప్రచారం జరిగింది. కాగా టిడిపి శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. సీట్ల సర్దుబాటు జరగనందుకే అలా ప్రకటించి ఉంటారని ఇరు పార్టీల నాయకులు అంటున్నారు.