జాతీయ వార్తలు

కమిటీని రద్దుచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమావేశానికి గైర్హాజరైన జెపిసి సభ్యులు
కొత్త మలుపు తిరిగిన భూసేకరణ బిల్లు వివాదం
కమిటీకి విలువ లేదని కాంగ్రెస్, టిఎంసి అసంతృప్తి

న్యూఢిల్లీ, నవంబర్ 24: భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు బిల్లుపై ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య నలుగుతున్న వివాదం మంగళవారం సరికొత్త మలుపు తిరిగింది. ఈ బిల్లుకు సంబంధించి కొన్ని సవరణలు సూచించటానికి ఏర్పాటైన పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త కమిటీ తమ కమిటీని రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం జరగవలసిన సమావేశానికి గైర్హాజరయ్యారు. అత్యంత జటిలంగా తయారైన ఈ బిల్లును ఉపసంహరించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ కొద్దిరోజుల క్రిందట మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రకటించినందున తమ కమిటీకి విలువ లేదని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే కమిటీని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన అహ్లూవాలియా ఈ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. పార్లమెంట్‌కే తప్పించి ప్రధానితోసహా ఇతరులెవ్వరికీ కమిటీ జవాబుదారీ వహించాల్సిన అవసరం లేదని ప్రతిపక్షాలను బుజ్జగించేందుకు అహ్లూవాలియా ప్రయత్నించినా ఫలించలేదు. ‘మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని చేసిన ప్రకటనే ప్రభుత్వ నిర్ణయమైతే మన కమిటీకి విలువే లేదు. పని చేయవలసిన అవసరం లేదు. ప్రభుత్వ విధానం ఏమిటో స్పష్టంగా తెలిసిన తరువాతే తదుపరి నిర్ణయం తీసుకుందామ’ని ప్రతిపక్షాలు వాదించాయి. జేపీసీ సమస్యలపై అధ్యయనం చేస్తోందన్న విషయం తెలిసినప్పటికీ ప్రధాని మోదీ బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిల్లును ఉపసంహరించుకోవాలన్న నిర్ణయాన్ని ప్రకటించారా? ఎన్నికల ఫలితాలు వెలువడినందున ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చిందా? అన్న విషయం తేలాల్సి ఉందని ప్రతిపక్షాలు చైర్మన్‌కు కరాఖండీగా చెప్పాయి. ప్రధాని మోదీ జేపీసీ ముందుకు వచ్చి ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. జేపీసీ నివేదికను ఇవ్వటానికి సిద్ధపడుతున్న సమయంలో తమ ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపాదించాలనుకున్న బిల్లును ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం తీసుకుందని ప్రధాని చెప్పటం కమిటీని అగౌరవపరచినట్లే అవుతుందని ప్రతిపక్షాలు వాదించాయి. వాస్తవానికి ఈ కమిటీ ఈ నెల 27లోపు తన నివేదికను అందచేయవలసి ఉంది. కమిటీని రద్దు చేయవలసిందిగా జేపీసీలోని అధిక సంఖ్యాకుల డిమాండ్ సరికొత్త సమస్యలకు దారితీసే అవకాశం ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి.