జాతీయ వార్తలు

చిదంబరానికి సుప్రీంలో దక్కని ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టుఅయిన మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి ఇంకా ఊరట లభించలేదు. ఆయన అరెస్టుపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈడీ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైనప్పటికీ సీబీఐ దాఖలు చేసిన కేసును ఈనెల 26కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈడీ నుంచి రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. చిదంబరానికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఆగస్టు 26 వరకు ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేయరాదని స్పష్టం చేసింది. అయితే ఆయన విచారణకు సహకరించాలని సూచించింది. ఈడీ, సీబీఐ రెండు కేసులపై సోమవారం మరోసారి విచారణ జరుపుతామని వెల్లడించింది.