జాతీయ వార్తలు

తేరుకున్నట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నైలో తగ్గుముఖం పట్టిన వరద
పాలు, నీళ్లు ఇంకా కరవే
రోడ్లపైకి వస్తున్న జనం
పాక్షికంగా మొదలైన రవాణా
ఎటిఎంల వద్ద జనం క్యూలు
ప్రారంభంకాని విమాన సర్వీసులు
కుండపోత వాన, భారీ వరదలతో అతలాకుతలమైన చెన్నపట్నం క్రమంగా తేరుకుంటోంది. అనేక ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో శనివారం జనం రోడ్డెక్కారు. రైల్వే, టెలీకమ్యూనికేషన్ సర్వీసులు పాక్షికంగా పునరుద్ధరించటంతో, నగరవాసులు బయటి ప్రపంచంలోకి వస్తున్నారు. భారీ వర్షాలకు ఇప్పటి వరకూ 245మంది చనిపోయినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. శివారు ప్రాంతాలు మాత్రం ఇంకా వరదనీటిలోనే నానుతున్నాయి. పాలు, నీళ్లులాంటి అత్యవసర సాయం కోసం జనం ఎదురుచూస్తున్నారు. ఇక అక్కడక్కడా పని చేస్తున్న ఎటిఎంల వద్ద మైళ్లకొద్దీ జనం వరుసలు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే, ప్రధానంగా త్రివిధ దళాలు, ఎన్‌డిఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. చెంబరంబాక్కం, పుజల్, పూండి, రెడ్‌హిల్స్ రిజర్వాయర్లనుంచి నీటి విడుదలను తగ్గించడంతో అడయార్, కూవం నదుల్లో ప్రవాహం తగ్గి నగరంలో వరద పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఇదిలావుంటే, ఈనెల 8 వరకూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ సైతం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. (చిత్రం) పాల ప్యాకెట్ల కోసం ఎగబడుతున్న వరద బాధితులు