జాతీయ వార్తలు

మరో 400మంది వరద బాధితుల తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరక్కోణం, డిసెంబర్ 5: వర్షాల తాకిడికి జలమయంగా మారిన చెన్నై మహానగరం నుంచి మరో 400 మంది బాధితులను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రక్షించి హైదరాబాద్, ఢిల్లీ నగరాలకు తరలించాయి. అరక్కోణం నావల్ ఎయిర్ బేస్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏసి-17 గ్లోబ్ మాస్టర్ ద్వారా 172 మందిని ఢిల్లీకి చేర్చారు. ట్రూ జెట్ విమానం ద్వారా మరో 70 మందిని, ఇండిగో విమానం ద్వారా 150 మందిని ఢిల్లీ, హైదరాబాద్‌లకు చేర్చినట్లు నౌకాదళాధికారులు తెలిపారు. శుక్రవారం అరక్కోణం, తాంబరం ఎయిర్ బేస్ నుంచి ఆరువందల మంది ప్రయాణీకులను ఢిల్లీ, హైదరాబాద్‌కు చేర్చినట్లు ఆయన చెప్పారు. వరద బాధితులైన విమాన ప్రయాణీకులకు సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సాంకేతిక విమాన సర్వీసులను శనివారం ప్రారంభించామని, కమర్షియల్ ఆపరేషన్ల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. చెన్నై విమానాశ్రయం నుంచి నీటిని తోడుతున్నామన్నారు. అరక్కోణం ఎయిర్ బేస్ చెన్నైకు 70 కి.మీ దూరంలో ఉందన్నారు. ట్రూజెట్, స్పైస్ జెట్ విమానాల్లో బెంగళూరుకు, హైదరాబాద్‌కు ప్రయాణీకులను తరలిస్తున్నామన్నారు. ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం నుంచి 70 మంది విద్యార్ధులు తాంబరం ఎయిర్‌బేస్‌కు చేరుకున్న వెంటనే వారిని సి-17 విమానం ద్వారా వారిని పాట్నా, ఢిల్లీకి తరలించామన్నారు. వివిధ చోట్ల చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు నేవీ చేతక్ హెలికాప్టర్ల సేవలను ఉపయోగించుకున్నట్లు నౌకాదళాధికారులు తెలిపారు.