జాతీయ వార్తలు

నిబంధనలకు పాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇష్టారాజ్యంగా ‘డ్యూయల్ టెక్నాలజీ’ కేటాయింపులు
ఓ విధానమే రూపొందించని మాజీ టెలికాం మంత్రి రాజా
ప్రత్యేక కోర్టుకు చెప్పిన సిబిఐ
న్యూఢిల్లీ, నవంబర్ 23: మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా అప్పట్లో శ్వాన్ టెలికాం ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌టిపిఎల్)కు లబ్ధి చేకూర్చడానికి నిబంధనలను తుంగలో తొక్కి తన ఇష్టారాజ్యంగా డ్యూయల్ టెక్నాలజీ లైసెన్సులను ఆమోదించారని సిబిఐ సోమవారం ప్రత్యేక కోర్టుకు చెప్పింది. 2జి స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణం కేసులో తుది విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్.. టెలికామ్ నియంత్రణ సంస్థ (ట్రాయ్), టెలికాం కమిషన్ ఒత్తిడి చేసినప్పటికీ, రాజా డ్యూయల్ టెక్నాలజీ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, ఆమోదించడానికి ఎలాంటి విధానాన్ని రూపొందించలేదని కోర్టుకు చెప్పారు. డ్యూయల్ టెక్నాలజీ లైసెన్సుల జారీకి ఏదైనా విధానాన్ని రూపొందించాల్సిందిగా ప్రతి ఒక్కరు సూచించినప్పటికీ, రాజా నిర్లక్ష్యం చేశారని ఆయన ప్రత్యేక సిబిఐ న్యాయమూర్తి ఒ.పి.శైనీకి తెలిపారు. ఎలాంటి విధానం లేకుండానే డ్యూయల్ టెక్నాలజీ లైసెన్సుల జారీకి రాజా ఆమోదం తెలిపారని ఆయన చెప్పారు. ‘ఆమోదం తెలిపే అధికారం మంత్రికి ఉంది. కాని, విధానం ఎక్కడుంది?’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వమే లైసెన్సులు మంజూరు చేస్తోంది కాబట్టి మొత్తం ప్రక్రియ అంతా నిష్పక్షపాతంగా ఉండాల్సి ఉంటుందని ఆయన వాదించారు. ఈ మొత్తం ప్రక్రియ ఎస్‌టిపిఎల్‌కు అనుకూలంగా సాగిందని గ్రోవర్ వాదించారు. బహిరంగ ప్రకటన కూడా చేయలేదని ఆయన వెల్లడించారు. బహిరంగ ప్రకటన చేయకుండా ప్రభుత్వ ఆస్తిని కేటాయించారని, కొంతమందికి లబ్ధి చేకూర్చేలా ఈ ప్రక్రియ జరిగిందని అని ఆయన వాదించారు. ఈ వాదనలు మంగళవారం కూడా కొనసాగనున్నాయి. ఢిల్లీ సర్కిల్‌లో డ్యూయల్ టెక్నాలజీ లైసెన్సు పొందటానికి ఎస్‌టిపిఎల్ కన్నా టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్, స్పైస్ కమ్యూనికేషన్స్ అర్హత కలిగి ఉన్నప్పటికీ అకారణంగా లైసెన్సు పొందలేకపోయాయని సిబిఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది.
(చిత్రం)మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా