క్రీడాభూమి

కెయిర్న్స్‌కు క్లీన్ చిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 30: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిర్న్స్‌కు ఊరట లభించింది. లండన్‌లోని సౌత్‌వార్త్ క్రౌన్ కోర్టు అతనిని నిర్దోషిగా ప్రకటించింది. పది గంటల, 17 నిమిషాలు జరిగిన వాదోపవాదాలను విన్న తర్వాత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. బ్రెండన్ మెక్‌కలమ్, రికీ పాంటింగ్, డానియల్ వెటోరీ వంటి పలువురు మేటి క్రికెటర్ల వాంగ్మూలాలు, సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించింది. వీరి సాక్ష్యాల వివరాలను పరిశీలించిన తర్వాత న్యాయమూర్తుల బెంచ్ సుమారు అరగంట సేపు చర్చించుకున్నారు. అనంతరం కోర్టు తీర్పు వెలువడింది. కెయిర్న్స్‌పై పెట్టిన అభియోగాలను రుజువు చేసే ఆధారాలు లేవని కోర్టు ప్రకటించింది. ప్రాసిక్యూషన్ కథనాలతో ఏకీభవించి అతనిని దోషిగా పేర్కొనలేమని స్పష్టం చేసింది.