జాతీయ వార్తలు

కేంద్ర బలగాలు పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగడానికి వీలుగా అదనపు బలగాలను తరలించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు కేంద్ర సాయుధ బలగాలు పంపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నాయకత్వాన బిజెపి ప్రతినిధి బృందం సోమవారం ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందించింది. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరగడానికి చర్యలు తీసుకోవాలని బిజెపి కోరింది. కేరళ ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని వారు ఆరోపించారు. తాజాగా విడుదలైన ఎన్నికల జాబితాలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నట్టు పార్టీ ఫిర్యాదు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,24,06,061 మంది ఉండగా జాబితాలో 2,56,27,620 మంది ఓటర్లు ఉన్నారని చూపారని తెలిపారు. అనేక మంది అర్హులకు ఓటు హక్కే లేదని బిజెపి ఆరోపించింది. ఎన్నికల కమిషన్ తక్షణం జోక్యం చేసుకుని తప్పులు సరిదిద్దడంతోపాటు ఆన్‌లైన్ ద్వారా ఓటర్ల నమోదుకు చర్యలు తీసుకోవాలని ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. కేరళలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగకుండా కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఇసికి చెప్పారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న మతకలహాలు బిజెపి బృందం ఇసి దృష్టికి తీసుకొచ్చింది. ‘రాష్ట్రంలో వందలాది మంది బిజెపి కార్యకర్తలు మృతి చెందారు. పోలీసులు, పాలనా యంత్రాంగం అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో జాతి వ్యతిరేక శక్తులు తిష్టవేశాయి. అసాంఘిక శక్తుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అధికార పార్టీ చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది’ అని బృందం ఆందోళన వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించేందుకు, అలాగే కేంద్ర బలగాలు తరలింపునకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చింది.