క్రీడాభూమి

కెప్టెన్సీని వదలడంలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 24: భారత వనే్డ, టి-20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన పదవిని పట్టుకొని వేళ్లాడుతున్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే చాలాకాలం అదనంగా అతను పదవిలో కొనసాగాడని ఒక వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. ధోనీ స్థానంలో టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకే వనే్డ, టి-20 బాధ్యతలు కూడా అప్పచెప్పాలని సూచించాడు. ప్రతి కెప్టెన్‌కూ రెండు దశలు ఉంటాయని, మొదటి దశలో విజయపరంపరలు కొనసాగుతుండగా, జట్టులోని ఆటగాళ్లంతా ఎంతో గౌరవ మర్యాదలతో మెలగుతారని తెలిపాడు. రెండో దశలో పరాజయాలు ఎదురవుతాయని, ఆటగాళ్లకు కెప్టెన్‌పై నమ్మకం సడలిపోతుందని వివరించాడు. ధోనీ ప్రస్తుతం రెండో దశలో ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. మనుకా ఓవల్ మైదానంలో భారత బౌలర్లు విఫలం కావడానికి ధోనీ కూడా కారకుడేనని అన్నాడు. ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌ను సక్రమంగా నిర్ణయించకపోవడంతో బౌలర్లకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైందన్నాడు. బౌలర్లకు ధోనీ స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకాన్ని ఇవ్వలేకపోతున్నాడని పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ స్థానంలో కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పడం సమంజసంగా ఉంటుందని ఇయాన్ చాపెల్ భారత క్రికెట్ అధికారులకు సూచించాడు.