జాతీయ వార్తలు

ఆభరణాలపై సుంకం రద్దు ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: వెండి యేతర ఆభరణాలపై విధించిన ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. విలాస వస్తువులను ఈ పన్ను పరిధి నుంచి తొలగించే ప్రసక్తే లేదని ప్రభుత్వం గురువారం రాజ్యసభలో స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆభరణాలపై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని విధించి ఆ వ్యాపారాన్ని ఖూనీ చేస్తోందని విపక్షాలు చేసిన ఆరోపణను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. సామాన్య ప్రజలు ఉపయోగించే వస్తువులపైనే పన్ను విధిస్తున్నప్పుడు విలాస వస్తువులను పన్ను నుంచి మినహాయించడం ఎలా కుదుదురుతుందని ఆయన విపక్షాలను ప్రశ్నించారు. చేతి వృత్తుల వారిని ప్రభుత్వం వేధించడం లేదని, 12 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ కలిగిన కార్పొరేట్ ఆభరణ తయారీ సంస్థలు గత ఏడాది ఈ పన్ను పరిధిలో ఉండగా, ఆ తర్వాత రూ.6 కోట్ల వరకు టర్నోవర్ కలిగి ఉన్న ఆభరణ తయారీదారులను ఈ పన్ను నుంచి మినహాయించామని, తద్వారా చిన్నతరహా ఆభరణ తయారీదారులు, చేతి వృత్తుల వారికి ఈ పన్ను నుంచి వెసులుబాటు కల్పించామని జైట్లీ వివరించారు. రాజ్యసభలో సావధాన తీర్మానానికి ఆయన సమాధానమిస్తూ, సబ్బులు, టూత్‌పేస్టులు, రేజర్లు, పెన్సిళ్లు, సిరా, పండ్ల రసాలు తదితర సామాన్య వస్తువులపై ఎక్సైజ్ సుంకాన్ని విధించినప్పుడు విలాస వస్తువులను పన్ను నుంచి ఎందుకు మినహాయించాలని ప్రశ్నించారు.

2016-17 ఆర్థిక సంవత్సరంలో
జిడిపి వృద్ధి 7.8 శాతం

ఐరాస నివేదిక అంచనా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: భారత దేశ ఆర్థిక వ్యవస్థ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం మేర వృద్ధి చెందవచ్చని, 2017-18లో అది మరింత వేగవంతమై 7.8 శాతానికి చేరుకోవచ్చని గురువారం ఇక్కడ విడుదల చేసిన ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి పేర్కొంది. నిలకడయిన ఉపాధి అవకాశాల కారణంగా దేశీయంగా వినయోగం పెరగడంతో పాటుగా ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం ప్రధానంగా దీనికి కారణమని ఆ నివేదిక పేర్కొంది. సమీప భవిష్యత్తులో వృద్ది అంచనా సానుకూలంగా ఉందని. 2006లో వృద్ధి రేటు 7.6 శాతం, 2017లో 7.8 శాతంగా ఉండవచ్చని ఆ నివేదిక అభిప్రాయ పడింది. నిలకడైన ఉపాధి అవకాశాల వృద్ధి, దానికి తోడు ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం కారణంగా పట్టణ ప్రాంత కుటుంబాలు ఖర్చు చేయడం మరింతగా పెరిగే అవకాశాలున్నాయని ఆ నివేదిక పేర్కొంది. రుణాలకోసం అయ్యే ఖర్చు తక్కువగా ఉండడం, అలాగే దేశంలో వ్యాపారం చేయడానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ మెరుగైన ర్యాంక్ ఇవ్వడం కారణంగా నిలకడైన పెట్టుబడుల వాతావరణం కనిపించడం కూడా దీనికి తోడవుతోందని ఆ నివేదిక పేర్కొంది.
ఇదిలా ఉండగా ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్-రా)ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత దేశ జిడిపి వృద్ధి అంచనాను ఇంతకు ముందు అంచనా వేసిన 7.9 శాతంనుంచి 7.7 శాతానికి కుదించింది. రుతుపవనాలు మామూలుస్థాయికి మించి ఉండవచ్చన్న వాతావరణ విభాగం అంచనాలు వ్యవసాయ రంగానికి అనుకూలమైనదే అయినప్పటికీ పారిశ్రామిక రంగం కోలుకోక పోవడం భారత అభివృద్ధి పుంజుకోవడానికి ప్రధాన అడ్డంకిగా ఉండే అవకాశముందని, నెలవారీ పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో సైతం ఇది ప్రతిఫలిస్తోందని ఆ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది.
భారీ నష్టాల్లో మార్కెట్లు

సెనె్సక్స్ 461 పాయింట్లు పతనం ౄ 7,900 పాయింట్ల దిగువకు నిఫ్టీ

ముంబయి, ఏప్రిల్ 28: గత రెండు రోజులుగా లాభాల బాటలో సాగిన స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలు చవి చూశాయి. దీంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 461 పాయింట్లకు పైగా నష్టపోయి 26 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. గత మూడు వారాల్లో సెనె్సక్స్‌ఒక్క రోజులో ఇంత నారీగా నష్టపోవడం ఇదే మొదటిసారి. తాజాగా మరోసారి ఉద్దీపనాలను ప్రకటించరాదని బ్యాంక్ ఆఫ్ జపాన్ (బిఓజి) తీసుకున్న నిర్ణయం మదుపరులను ఆశ్చర్యానికి గురి చేయడం మార్కెట్ల భారీ పతనానికి ప్రధాన కారణం. అలాగే ఏప్రిల్ నెల ఫ్యూచర్స్, అప్షన్ల ముగింపు నేపథ్యం కారణంగా మదుపరులు ఆచితూచి వ్యవహరించడం, ఆసియా మార్కెట్లలో మాంద్యం కారణంగా అంతర్జాతీయ సూచీలు బలహీనంగా మారడం లాంటి వాటి కారణంగా మదుపరులు భారీ ఎత్తున అమ్మకాలకు పాల్పడ్డం కూడా సూచీలను ఒత్తిడికి గురి చేశాయి. ఫలితంగా నేషనల్ స్టాక్ ఎఖ్సచేంజి సూచీ నిఫ్టీ సైతం 7,900 పాయింట్ల దిగువకు పడిపోయింది. ప్రధానంగా లోహాలు, చమురు,గ్యాస్, ఎఫ్‌ఎంసిజి, వౌలిక సదుపాయాలు, ఆటో రంగాల షేర్ల పతనం కారణంగా సూచీలు భారీగా పతనమైనాయి. నిన్నటి ముగింపుకన్నా పైస్థాయిలో ప్రారంభమైన సెనె్సక్స్ ఆ తర్వాత అమ్మకాలు జోరందుకోవడంతో నష్టాల మాట పట్టాయి. దీంతో అది 461 పాయింట్లు పతనమై 25,603 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ 5 తర్వాత సెనె్సక్స్ ఒకే రోజు ఇంతగా పతనం కావడం ఇదే మొదటిసారి. జపాన్ ప్రధాన సూచీ నిక్కీ 3.65 శాతం పతనం కాగా, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.27 శాతం పతనమైంది. ఐరోపా షేర్లు సైతం భారీగా పతనమైనాయి. హెచ్‌డిఎఫ్‌సి, ఐటిసి,ఎంఅండ్‌ఎం, మారుతి సుజుకి, గెయిల్, టాటా స్టీల్, ఎన్‌టిపిసిలాంటి మార్కెట్ హెవీవెయిట్‌లు 3.21 శాతంనుంచి 2.45 శాతం దాకా పడిపోయాయి. సెనె్సక్స్‌లోని మొత్తం 30 కంపెనీల షేర్లలో 27 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ సైతం 132.65 పాయింట్లు పడిపోయి 7,847.25 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, కొరియా ఎక్స్‌చేంజిలో సెనె్సక్స్ ఆధారిత డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌లు లిస్టింగ్ చేయడానికి ఆ ఎక్స్‌చేంజితో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బిఎస్‌ఇ గురువారం ప్రకటించింది. భారత్, దక్షిణ కొరియాలలో డెరివేటివ్స్ మార్కెట్లు మరింత అభివృద్ధి చెందడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని బిఎస్‌ఇ ఆ ప్రకటనలో తెలిపింది.