జాతీయ వార్తలు

మీడియా నిబద్ధత భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భావ ప్రకటనా స్వేచ్ఛపై రాష్టప్రతి కితాబు
న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు మీడియా వెన్నుదన్నుగా నిలుస్తోందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. విస్తృత స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మీడియా రంగానికి సవాళ్లు ఎదురవుతున్నా తట్టుకుని నిలబడుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. మలయాళ మనోరమ గ్రూప్ దినపత్రికల చీఫ్ ఎడిటర్ దివంగత కె.ఎం.మాథ్యూ స్వీయచరిత్ర ‘ద ఎయిత్ రింగ్’ పుస్తకాన్ని రాష్టప్రతి భవన్‌లో గురువారం ప్రణబ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం రాక ముందునుంచీ పత్రికలు కీలక భూమిక పోషించాయని ప్రశంసించారు. 1970 దశకం తొలినాళ్లనుంచి కె.ఎం.మాథ్యూతో తనకు పరిచయముందని, స్వాతంత్య్ర పోరాటానికి, మలయాళ మనోరమ గ్రూప్ విస్తృతికి అవినాభావ సంబంధం వుందని ప్రణబ్ కొనియాడారు. అభిప్రాయ భేదాలు ఏ స్థాయిలో ఉన్నా భావ ప్రకటనా స్వేచ్ఛ విషయంలో మీడియా ఎప్పుడూ రాజీపడలేదని అన్నారు. శతాబ్దాలుగా పత్రికా రంగం ఎదుగుదలను ఆయన ప్రస్తావిస్తూ నాటి కాలంనుంచి మీడియా బాధ్యతాయుతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో మీడియాకు ఎదురవుతున్న సవాళ్లను భారత జర్నలిస్టులు సమర్థంగా ఎదుర్కోగలరని తాను భావిస్తున్నానన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో మీడియా రంగానికి ఎదురవుతున్న సవాళ్లు ఎవరికి ఇష్టమున్నా లేకున్నా ఉంటూనే ఉంటాయని ప్రణబ్ పేర్కొన్నారు. ఆధునిక పరిజ్ఞానం పాత తరం ముప్పుగా భావించవచ్చనీ, కానీ ఇంటర్నెట్ ప్రవేశంతో ప్రపంచమంతా కుగ్రామంగా మారిన విషయాన్ని గుర్తించాలని అన్నారు. (చిత్రం) కె.ఎం.మాథ్యూ స్వీయచరిత్ర ‘ద ఎయిత్ రింగ్’ పుస్తకాన్ని రాష్టప్రతి భవన్‌లో ఆవిష్కరిస్తున్న ప్రణబ్ ముఖర్జీ