జాతీయ వార్తలు

చిన్మయానందపై బ్లాక్‌మెయిల్ ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి చిన్మయానందపై బ్లాక్‌మెయిల్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనను లైంగికంగా వేధించాడని ఇప్పటికే ఆయనపై న్యాయశాస్త్ర విద్యార్థిని ఆరోపణలు చేసిన విషయం విదితమే. దీనిపై సుప్రీం కోర్టు నియమించిన సిట్ ఎదుట కూడా ఆ విద్యార్థిని పలు ఆరోపణలు చేసింది. యూపీలో అనేక ఆశ్రమాలు, విద్యాసంస్థలు ఉన్న చిన్మయానందను షహజాన్‌పూర్ కాలేజీలో చేరేముందు కలిశానని, హాస్టల్ రూమ్‌లో సదుపాయం కల్పించారని, హాస్టల్ రూమ్‌లో స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడని ఆ విద్యార్థిని ఆరోపించింది. అంతేకాదు తనపై అత్యాచారం చేసి దానిని కూడా వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేశాడని తెలిపింది. ఇలా తనను పదే పదే మోసం చేశాడని ఆ విద్యార్థిని కమిటీ ముందు పేర్కొంది.