జాతీయ వార్తలు
అస్సాం బిజెపి చీఫ్‌గా సోనోవాల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఎన్నికల కమిటీకీ ఆయనే సారథ్యం
న్యూఢిల్లీ, నవంబర్ 21: బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్న బిజెపి వచ్చే ఏడాది జరిగే అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోంది. కేంద్ర మంత్రి శరభానంద్ సోనోవాల్‌ను అస్సాం బిజెపి శాఖ అధ్యక్షుడిగా నియమించడంతో పాటు ఎన్నికల కమిటీ సారథ్య బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది. తద్వారా ఆ రాష్ట్రంలో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనేనని బిజెపి సంకేతాలు పంపింది. ఆదివారం జరిగిన ఈ నియామకాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. అలాగే ఆ రాష్ట్రంలో ఇటీవల పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి బిజెపిలో చేరిన సీనియర్ నాయకుడు హిమనాథ బిశ్వాస్ శర్మ పార్టీ ఎన్నికల కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని జవదేకర్ వెల్లడించారు.