ఐడియా

గర్భిణులకు మేలు చేసే కొబ్బరి నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాహార్తిని తీర్చడానికి, శరీరానికి చలువ చేయడానికే కాదు.. కొబ్బరి నీళ్లలో గర్భిణులకు అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కేరళలోని కొబ్బరి అభివృద్ధి బోర్డు (సిడిబి)కి చెందిన నిపుణులు ఈ విషయాన్ని వెల్లడిస్తూ, గర్భిణులు విరివిగా కొబ్బరి నీళ్లను తాగితే వారికి అవసరమైన ఫ్లూయిడ్స్, ఎలొక్ట్రలైట్స్ అందుతాయని పేర్కొంటున్నారు. మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-సి, క్లోరైడ్స్, ఎలొక్ట్రలైట్స్, రిబోఫ్లావిన్ వంటి పోషకాలు కొబ్బరి నీళ్లలో దండిగా లభిస్తాయి. శరీర వ్యవస్థకి కావాల్సిన సుగర్, సోడియం, ప్రోటీన్లు కోసం తరచూ కొబ్బరి నీళ్లను తాగడం మంచిదని వారు సూచిస్తున్నారు. ఉదయానే్న కొబ్బరి నీళ్లను తాగితే నీరసం, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. నిర్జలీకరణం (శరీరంలో నీరు లేకపోవడం), అలసట వంటి లక్షణాల నుంచి బయటపడేందుకు, రోగనిరోధక శక్తి పెరిగేందుకు కొబ్బరి నీళ్లు దోహదం చేస్తాయి. మూత్ర సంబంధ సమస్యలు, అధిక రక్తపోటు తొలగిపోయేందుకు గర్భిణులు కొబ్బరి నీళ్లను తాగడం ఉత్తమం.