మెయిన్ ఫీచర్

ఇన్‌స్టెంట్ ‘విడాకులు’ ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్ నుంచి భర్త ఫోన్ చేయగానే ఇష్రాత్ జహాన్ ఆనందంగా ఎత్తింది. ఫోన్‌లో భర్త నోటి నుంచి ‘‘తలాక్ తలాక్ తలాక్’’ అనే మూడే మూడు మాటలు వినిపించాయి. ఫోన్ కట్ అయింది. ఆ మూడు మాటలతో అపురూపమైన భార్యాభర్తల అనుబంధం ఆనాటితో తెగతెంపులు అయింది. కోర్టుల్లో వాదోపవాదాలు ఉండవు. చర్చలుండవు. పెద్దల సంప్రదింపులు అనేవి అసలే లేవు. చాలా సింపుల్‌గా విడాకులు పొందవచ్చు. మగపిల్లాడు పుట్టలేదనే చిన్న సాకుతో ఇష్రాత్ భర్త ముర్తాజ ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2000 సంవత్సరంలో వారికి వివాహమైంది. వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మగపిల్లాడు పుట్టలేదని భర్త ఫోన్‌లో మూడుసార్లు తలాక్ చెప్పేసి విడాకులు తీసుకున్నాడు. పాపం ఆ తరువాత కొన్ని నెలలకే ఆమెకు మగపిల్లాడు పుట్టాడు. మగపిల్లాడు పుట్టాడు కదా భార్యగా స్వీకరించమని ప్రాధేయపడినా ఆ భర్త మనసు కరుగలేదు. ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేసు కోర్టులో నడుస్తుండగానే భర్త మరో వివాహం చేసుకుని ఆమె ముగ్గురు పిల్లలను తీసుకుని దుబాయ్ వెళ్లిపోయాడు. తన పిల్లలను తన వద్దకు పంపి వారిని పెంచటానికి కొంత డబ్బు డిపాజిట్ చేయమని ఇష్రాత్ జహాన్ కోరుతోంది.

నోటి మాటతోనూ, ఉత్తరాలలోనూ, ఈ-మెయిల్‌లోపంపే టెక్స్ట్ మెస్సేజ్‌లతోనే విడాకులు పొందే స్థితి నుంచి తమను కాపాడమని నేడు దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు గళమెత్తుతున్నారు. ఒక్క క్షణంలో..ఒక్క మాటతోవేలాది ముస్లిం మహిళల గొంతుకోస్తున్న ఈ ఇన్‌స్టెంట్ విడాకులను అత్యధిక దేశాలు నిషేధించగా, పాకిస్తాన్ వంటి ముస్లిం దేశాలు సైతం తిరస్కరించగా.. అతి తక్కువ దేశాల్లోనే తలాక్ విధానం అమలవుతోంది. ఇద్దరు పిల్లల తల్లయిన 35 ఏళ్ల సైరాభాను తలాక్ విడాకులు విధానాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దేశంలో సివిల్ కామన్ కోడ్ ఎందుకు అమలు చేయకూడదు? సైరాభానులాంటి మహిళలకు న్యాయపరంగా అందాల్సిన సహాయం ఎలా ఉండాలి? అని అత్యున్నత న్యాయస్థానం దాదాపు మూడు దశాబ్దాల నుంచి పాలకులను అడుగుతున్న ప్రశ్నలకు ఈనాటికైనా సరైన సమాధానం దొరుకుతుందేమోనని ముస్లిం మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆనాడు షాబానో అనే మహిళ ఈ తలాక్ విడాకుల విధానంపై 1980లో సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఆనాటి నుంచి నేటీ వరకూ కూడా బూజు పట్టిన ఈ చట్టాలను దులిపే సాహసం ఎవ్వరూ చేయలేదు. నేడు మోదీ సర్కార్‌లో కాస్తంత కదలిక రావటంతో పాటు దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు ఈ తలాక్ బారి నుంచి తమను కాపాడమని ఉద్యమిస్తుంటే.. దీనిపై వాదోపవాదాలకు, చర్చలకు మళ్లీ తెర లేవటం సంతోషం. గత ఏడాది సైరాబానో కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ వాదనలను సైతం పరిగణనలోకి తీసుకుని ఈ తలాక్ విధానంపై అత్యున్నత న్యాయస్థానం అడుగుముందుకు వేయబోతుంది.
దేశంలో ముస్లిం జనాభా దాదాపు 155 మిలియన్ల వరకు ఉన్నారు. పెరుగుతున్న ముస్లిం జనాభాకు అనుగుణంగా వారి పర్సనల్ చట్టాల్లో ఉన్న లోటుపాట్లు ఎప్పటికప్పుడు సవరించాల్సిన అవసరం కూడా ఉంది. బలహీనమైన చట్టాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సైతం ముస్లిం మహిళలకు అనేక కష్టాలను నేడు తెచ్చిపెడుతుంది. వాట్సప్, స్కైప్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని వందమంది విడాకులు ఇచ్చినట్లు భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ (బిఎంఎంఏ) వెల్లడించింది. 2007 సంవత్సరంలో వౌఖికంగా తలాక్ చెప్పి వేలాది మంది విడాకులు తీసుకున్నట్లు ముస్లిం మహిళా సామాజికవేత్త జకియా సోమన్ వెల్లడిస్తున్నారు. ఇలా విడాకులు పొందిన బాధిత ముస్లిం మహిళల్లో పేదవారే అధికం. వారికి కనీసం బతకటానికి జీవనభృతిని కూడా ఇవ్వకుండా మహిళలను తాత్కాలిక చరాస్తిగా భావించి తాత్కాలిక సుఖ సౌఖ్యాల కోసం ఇలా విడాకులు ఇస్తూ పోతుంటే ఆ మహిళల మనోవేదన అంతాఇంతా కాదు.
అదే విడాకులు పొందిన ముస్లిం మహిళ మరో వివాహం చేసుకోవాలంటే అంత సులువు కాదు. వివాహం సంతోషానికి బదులు దుఃఖాన్ని కలిగిస్తే అటువంటప్పుడు ముస్లిం మహిళ షరియా కోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా ఆమెకు సరైన న్యాయం జరగటం లేదు. దీనికి కారణం షరియా కోర్టులలో పురుషాధిక్యత రాజ్యమేలటమే. నూటికి 89 కేసులలో ముస్లిం మహిళలు మెహర్‌ను పొందలేకపోతున్నట్లు ఆలిండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్టు అధ్యక్షురాలు షైష్టా అంబర్ తెలియజేస్తున్నారు.
మహిళల పట్ల వివక్ష కారణమవుతున్న ఈ ట్రిపుల్ తలాక్ అంశం లా కమిషన్ రూపొందించిన ప్రశ్నావళిలో ఓ ప్రశ్నగా రావటం నేటి వివాదానికి కారణం. ముస్లిం పర్సనల్ లాపై సమీక్ష చేయాలని ఓ పక్క ముస్లిం మహిళలే కోరుకుంటుంటే ట్రిపుల్ తలాక్‌పై దేశవ్యాప్తంగా ముస్లింల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు వెళతామని ముస్లిం పర్సనల్ లా బోర్డు సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఇన్ని అనర్థాలకు కారణమవుతున్న ట్రిపుల్ తలాక్‌తో అసలు మహిళలకు ఎలాంటి నష్టం లేదని బుకాయస్తూ సివిల్ కామన్ కోడ్‌కు మోకాలడ్డుతోంది.

షాబానో వారసత్వం..

ఉమ్మడి పౌరస్మృతిపై రాజకీయ వివాదం రాజుకున్న నేపథ్యంలో షాబానో
వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నేటి ముస్లిం మహిళలు విజయం
సాధించేందుకు సమాయత్తమవుతున్నారు.
ముస్లిం మత విశ్వాసాల్లో జోక్యం అనే భావనకు తావు లేకుండా రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కును కాలరాస్తున్న తలాక్‌ను పూర్తిగా నిషేధించాల్సిందేనని ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 92.1శాతం మంది మహిళలు డిమాండ్ చేశారు.
ఈ సర్వే దాదాపు 10 రాష్ట్రాల్లో నిర్వహించారు.
ఆర్థిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ముస్లిం మతంలో 18 ఏళ్లు నిండ
కుండానే దాదాపు 55 శాతం మంది వివాహాలు చేసుకుంటున్నారు.
అమాయక బాలికలు తలాక్ అనే విధానానికి జీవచ్ఛవాలుగా
జీవితాన్ని వెళ్లదీస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.
తలాక్ ద్వారా విడాకులు పొందిన మహిళల్లో దాదాపు 91.7శాతం మంది
మళ్లీ పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడటం లేదు.
తలాక్ బాధితుల్లో 82శాతం మందికి ఎలాంటి ఆస్తులు కూడా లేవు.
దాదాపు 53శాతం మంది మహిళలు గృహ హింసకు బలవుతున్నారు.
...............................
ఇద్దరు పిల్లల తల్లయిన 35 ఏళ్ల సైరాబాను తలాక్ విడాకులు విధానాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దేశంలో సివిల్ కామన్ కోడ్ ఎందుకు అమలు చేయకూడదనే అంశంపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది.
.......................................
‘‘నేను ఈ విడాకులను ఆమోదించటం లేదు. నాకు న్యాయం కావాలి. నాకు పిల్లలు కావాలి. వారిని పెంచి, మంచి భవిష్యత్తు కల్పించటానికి అవసరమైన మెయింటినెన్స్ కావాలి’’
- ఇష్రాత్ జహాన్

-టి.ఆశాలత