క్రీడాభూమి

రికార్డుల వాకర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: భారత వాకర్లు రికార్డులు సృష్టించారు. ఇక్కడ జరిగిన జాతీయ చాంపియన్‌షిప్స్‌లో ఏకంగా ఏడు రికార్డులు నమోదయ్యాయి. 20 కిలో మీటర్ల రేస్‌లో వాకర్లు రియో ఒలింపిక్స్ కనీస అర్హత కంటే మెరుగైన టైమింగ్స్‌ను నమోదు చేశారు. కాగా, పురుషుల విభాగంలో ఉత్తరాఖండ్‌కు చెందిన గుర్మీత్ సింగ్ ఒక గంట, 21:24.57 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అతను కొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పాడు. గణపతి (తమిళనాడు) సందీప్ కుమార్ (హర్యానా) వరుసగా ద్వితీయ తృతీయ స్థానాలను ఆక్రమించారు. మహిళల 20 కిలోమీటర్ల ఈవెంట్‌లో జాతీయ రికార్డు హోల్డర్ కుష్బీర్ కౌర్ (పంజాబ్) సులభంగా స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. ఇప్పటికే రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన ఆమె తన లక్ష్యాన్ని ఒక గంట 34:52.70 నిమిషాల్లో గమ్యాన్ని చేరింది.