జాతీయ వార్తలు

ఆనందీబెన్ రాజీనామాకు బిజెపి హైకమాండ్ ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: గుజరాత్ సిఎం ఆనందీబెన్ రాజీనామాను బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమోదించారు. ఇక్కడ ప్రధాని మోదీ నివాసంలో బుధవారం ఉదయం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ, యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలని భావిస్తూ ఆనందీబెన్ రాజీనామా చేశారన్నారు. ఆమె ఈరోజు గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేస్తారన్నారు. దాన్ని గవర్నర్ ఆమోదించాక కొత్త సిఎంను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. గుజరాత్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి కొత్త సిఎంను పార్టీ పరిశీలక బృందం ఎంపిక చేస్తుందన్నారు. సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.