జాతీయ వార్తలు

చంద్రబాబు, లోకేశ్ గృహ నిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. అదికార పార్టీకి చెందిన నేతలు తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, ఈ దాడులకు నిరసనగా టీడీపీ ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఆత్మకూరు బయలుదేరుతున్న నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. పల్నాడులో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. అలాగే టీడీపీ ఆందోళనలకు ఎలాంటి అనుమతి లేదని కూడా ఆయన వెల్లడించారు. తమను గృహ నిర్బంధం చేయటంపై టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ ట్విట్టర్‌లో స్పందిస్తూ రాట్రంలో ప్రజస్వామ్యం నాశనమైందని, ఇది తుగ్లక్ పాలనకు పరాకాష్ట అని అన్నారు.