క్రీడాభూమి

గులాబీ బంతులు.. ఫ్లడ్‌లైట్ల వెలుగులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి డే/నైట్ టెస్టుకు అడెలైడ్ రెడీ
అడెలైడ్, నవంబర్ 26: అడెలైడ్ ఓవల్ మైదానం 138 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టానికి వేదిక కానుంది. మొదటి అధికారిక టెస్టు మ్యాచ్‌లో ఆడిన ఆస్ట్రేలియా తొలి డే/నైట్ టెస్టులోనూ భాగస్వామి కావడం విశేషం. 1877 మార్చి 15న మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా ఢీ కొంది. ఇప్పుడు అడెలైడ్ వేదికగా న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి ఆరంభం కానున్న మొట్టమొదటి డే/నైట్ టెస్టు మ్యాచ్‌ని ఆడనుంది. వనే్డ, టి-20 ఫార్మెట్స్‌లో మాదిరిగానే టెస్టుల్లోనూ డే/నైట్ మ్యాచ్‌లు జరగాలన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తున్నది. అయితే, క్రికెట్ రూపురేఖల్ని మార్చకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. ఇటీవల కాలంలో వనే్డ, టి-20 ఫార్మెట్ల విజృంభణతో ఐదు రోజులు కొనసాగే టెస్టులకు ఆదరణ తగ్గింది. దానికితోడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనులను మానుకొని మ్యాచ్‌లకు హాజరుకావడం అభిమానులకు కష్టసాధ్యంగా మారింది. పడిపోతున్న ప్రేక్షకుల సంఖ్యతో బెంబేలెత్తిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధికారులు కూడా డే/నైట్ టెస్టులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఆ నేపథ్యంలోనే తొలి డే/నైట్ మ్యాచ్ శుక్రవారం నుంచి ఆసీస్, కివీస్ జట్ల మొదలుకానుంది. మొత్తం మీద టెస్టు మ్యాచ్‌ల్లో కనిపించే సంప్రదాయ ఎర్ర బంతుల స్థానంలోనే గులాబీ బంతులు దర్శనం ఇవ్వనున్నాయి. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో, పింక్ బంతులతో జరిగే టెస్టు అభిమానులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
తేల్చుకోలేకపోతున్న బౌలర్లు
బౌలర్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రాత్రి పూట పిచ్ స్వభావం ఎలా ఉంటుందో తెలియపోవడం అందుకు ఒక కారణం. పింక్ బంతులు ఏ మేరకు సహకరిస్తాయన్నది కూడా ఒక ప్రశ్న. రాత్రిపూట, గులాబీ బంతులతో బౌలింగ్ చేసే సమయంలో ఏ విధానాలను అనుసరించాలో అర్థంగాక మల్లగుల్లాలు పడుతున్నారు.

మకావూ బాడ్మింటన్ క్వార్టర్స్ చేరిన సింధు
మకావూ, నవంబర్ 26: భారత టెన్నిస్ స్టార్, తెలుగు తేజం పివి సింధు ఇక్కడ జరుగుతున్న మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మూడో రౌండ్‌లో ఆమె ఇండోనేషియాకు చెందిన లిండవేణి ఫనేత్రీని 21-17, 21-18 తేడాతో ఓడించింది. మంచి ఫామ్‌ను కొనసాగించిన ఆమె వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది. తర్వాత మ్యాచ్‌లో చైనాకు చెందిన చెన్ యుఫెయ్‌తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్, సాయి ప్రణీత్ కూడా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. ప్రణయ్ 21-11, 21-19 స్కోరుతో క్వియావో బిన్ (చైనా)ను ఓడించగా, ప్రణీత్ 21-15, 21-16 స్కోరుతో ఆండ్రె కుర్నియావన్ డెడ్జోనో (ఇండోనేషియా)పై విజయం సాధించాడు.

హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ భారత్‌కు నేడు తొలి పరీక్ష
రాయ్‌పూర్, నవంబర్ 26: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) ఫైనల్స్‌లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టుకు శుక్రవారం మొదటి పరీక్ష అర్జెంటీనా రూపంలో ఎదురుకానుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న అర్జెంటీనా, రెండో ర్యాంక్‌లోని నెదర్లాండ్స్, మూడో ర్యాంకర్ జర్మనీతోపాటు భారత్ గ్రూప్ ‘బి’ నుంచి ఈ టోర్నీలో పోటీపడుతున్నది. దీనితో సర్దార్ బృందానికి ప్రతి మ్యాచ్ ఒక సవాలుగా మారనుంది. హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రోలాంట్ ఆల్ట్‌మన్స్ ఇప్పుడు జట్టుకు కోచ్‌గా అదనపు బాధ్యతను పోషిస్తున్నాడు. అతని పర్యవేక్షణలో భారత ఆటగాళ్లంతా గురువారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన సిరీస్‌లో సర్దార్ బృందం తీవ్ర స్థాయిలో పోటీనిచ్చింది. ఫైనల్‌ను పెనాల్టీ షూటౌట్ వరకూ తీసుకురావడం భారత ఆటగాళ్ల ప్రతిభకు నిదర్శనంగా పేర్కోవాలి. ఇలావుంటే, హెచ్‌డబ్ల్యుఎల్ ఫైనల్స్ గ్రూప్ ‘ఎ’ నుంచి ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్, బెల్జియం, కెనడా జట్లు కూడా ఈ టోర్నీలో పోటీపడుతున్నాయి.

ముంబయ, కేరళ మ్యాచ్ డ్రా
నవీ ముంబయ, నవంబర్ 26: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో శుక్రవారం ముంబయ సిటీ, కేరళ బ్లాస్టర్స్ జట్ల మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆంటానియో జర్మె న్ చేసిన కీలక గోల్ కేరళను ఓటమి నుంచి రక్షించిం ది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ముం బయకి 25వ నిమిషంలో జువాన్ అగిలెరా ద్వారా గో ల్ లభించింది. ఈ గోల్ లభించిన వెంటనే ముంబ య ఆటగాళ్లు పూర్తి రక్షణాత్మక విధానాన్ని అనుసరిం చారు. కేరళకు ఈక్వెలైజర్ అందకుండా అడ్డుకోవడాని కే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో దాదాపు చివ రి వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. గోల్స్ కోసం కేర ళ ఆటగాళ్లు ప్రయత్నిండం వాటిని ముంబయ క్రీడాకా రులు అడ్డుకోవడంతో మ్యాచ్ దాదాపు ముగింపు దశ కు చేరింది. ముంబయ విజయం ఖాయంగా కనిపిస్తు న్న సమయంలో జర్మెన్ అసాధారణ ప్రతిభను కనబ రిచాడు. 89వ నిమిషంలో చక్కటి గోల్ చేశాడు. కేరళ కు ఈక్వెలైజర్‌ను సంపాదించి పెట్టడం ద్వారా ముంబ య విజయాన్ని అడ్డుకున్నాడు.

ఇన్ స్టేడియా హక్కులకు రూ. 2 కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ, నవంబర్ 26: వినోదం పన్ను ఎగవేతకు పాల్పడి, ఒకానొక దశలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మ ధ్య జరిగే నాలుగో టెస్టు మ్యాచ్‌ని నిర్వహించే అవకా శాన్ని కోల్పోయే ప్రమాదంలో పడిన ఢిల్లీ అండ్ డిస్ట్రి క్ట్స్ క్రికెట్ సంఘం (డిడిసిఎ) ఆనందంతో ఊగిపోతున్న ది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నిర్వహించు కోవచ్చని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఎంతో ఆనందంలో ఉన్న డిడిసిఎకు తాజాగా హక్కుల వేలం ద్వారా రెండు కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇన్‌స్టాండ్ హక్కులను ఇవ్వ డానికి టెండర్లను డిడిసిఎ పిలిచింది. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ హైకోర్టు నియమిం చిన లోధా కమిటీ పర్యవేక్షించింది. ఎలాంటి అవకత వకలు లేకుండా, పారదర్శకం గా టెండర్ల ప్రక్రియను ముగించింది. కాగా, టెండర్లకు దరఖాస్తులు, ధరావ తు వంటి మార్గాల్లో డిడిసిఎకు మరో 50 లక్షల రూపాయలు లభించాయ.