జాతీయ వార్తలు

ఉగ్రవాది ఆసిఫ్ హతం:డీజీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని సోపోర్ జిల్లాలో ఉగ్రవాది ఆసిఫ్‌ను మట్టుబెట్టామని డీజీపీ దిల్బాగ్ సింగ్ స్పష్టం చేశారు. బుధవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ సోపోర్‌లో ఆసిఫ్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడని తెలిపారు. పోస్టర్లు అంటించటం, స్థానికులను బెదిరించటం, రోజువారీ పనులకు వెళ్లకుండా చేయటం, దుకాణాలు తెరవద్దని బెదిరింపులకు పాల్పడుతున్నాడని డీజీపీ వెల్లడించారు. ఆసిఫ్ కారులో వెళుతున్నట్లు పక్కా సమాచారం అందటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులపై ఆసిఫ్ గ్రెనేడ్లు విసరటంతో ఇద్దరు గాయపడ్డారు. ఆసిఫ్ కారును వెంబడించి పోలీసులు అతడ్ని మట్టుబెట్టారని డీజీపీ తెలిపారు. జమ్మూలోని పది జిల్లాల్లో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. సమాచార వ్యవస్థ నూరుశాతం పనిచేస్తుందని డీజీపీ తెలిపారు.