అమృత వర్షిణి

లంబోదర లకుమికరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత బాగా పాడుతున్నావమ్మాయ్! అచ్చం సుశీల కంఠమేసుమా! కాస్త సాధన చేశావా? నిన్ను మించిన వాళ్ళెవరుంటారు?’ ఎవరో ఓసారి పాడేసిన పాటను పదిసార్లు వినగా వినగా నేర్చుకుని పాడే పాటకు పరవశులయ్యే వాళ్ళ ప్రశంసలతో నిండిన మాటలివి. ‘సాధన’ అంటే ఏమిటి? ఒకే పాట పాతికసార్లు వింటే ఆ పాట నోటికి పట్టేస్తుంది. అలాగే తు.చ. తప్పకుండా అనుకరించి పాడచ్చు. కానీ అందులో నుండి సంగీతం ఉద్భవించదు. సంగీతం ఆధారంగానే ఆ పాట పుట్టింది.
పాట వినగానే చాలా బాగుందని మెచ్చుకుంటూ సాధన చేయమంటే అర్థం బాగా సంగీతజ్ఞానం పెంచుకోమనిచ్చే దివ్యమైన సందేశం.
విత్తు ముందా? చెట్టు ముందా?’ అన్నట్లుగా హాయిగా విన్నది విన్నట్లుగా చిలకపలుకుల్లా ఒప్పజెప్పేస్తోంటే ఇంకెందుకు సంగీతజ్ఞానం? అని భావించేవారున్నారు.
అద్దంలో చూస్తే మన రూపం మనకే చాలా బాగుంటుంది. ఒకటికి నాలుగుసార్లు దువ్వెన అటూ ఇటూ తిప్పేస్తుంటాం. ఈ సూత్రం సంగీతానికీ వర్తిస్తుంది. మన పాట మనకు కాదు. వినేవారికి నచ్చాలి. ఒకప్పటి ప్రఖ్యాత జానపద కళాకారిణులైన సీత, అనసూయలు ఒకటిన్నర దశాబ్దాల పాటు జనాన్ని తమ మృదుమధుర గానంతో ఉర్రూతలూగించేశిన ఘనాపాఠీలు. నేను స్వయంగా నా చిన్నతనంలో విన్నాను. ఆ యిద్దరిలోనూ అనసూయకు మంచి సంగీత జ్ఞానం వుంది. శాస్ర్తీయ సంగీతం బాగా నేర్చుకుని ఆ జ్ఞానంతో జానపదగేయాలకు సంగీత సౌరభాన్ని నింపి, సీతతో కలిసి ఆంధ్ర దేశంలో తిరిగి జానపదగీతాల్లోని మాధుర్యాన్ని నాలుగు చెరగులా విస్తరింపచేసిన గాయనీమణులు.
ఆ పాటలు విన్న సినిమా దర్శకులు బి.ఎన్. రెడ్డి, భానుమతి, సాలూరి రాజేశ్వరరావు లాంటి అగ్రశ్రేణి దర్శకులు, నటీనటులు, సంగీత దర్శకులు సీత అనసూయ పాడిన ఆ జానపదగీతాలకు దాసోహమన్నవారే. దేవులపల్లి కృష్ణశాస్ర్తికి అనసూయ స్వయంగా మేనకోడలు. దేవులపల్లి సినిమాలకు పాటలు రాయడం ‘మల్లీశ్వరి’తో ప్రారంభమైంది. బి.ఎన్. రెడ్డి చెల్లెలి పెళ్ళికి అనసూయ జానపద సంగీత కచేరీ ఏర్పాటుచేశారు. ఆ యిద్దరూ పాడిన యమునా కళ్యాణి (యమన్)లో ‘జయదేవుని అష్టపది’ ‘్ధరసమేరే యమునా తీరే..’ బి.ఎన్.గారికి బాగా నచ్చింది. ‘మల్లీశ్వరి’లో అలాంటి పాటే కావాలని అడిగారు. వెంటనే దేవులపల్లివారు ‘మనసున మల్లెల మాలలూగెనే’ రాశారు. ఈ ధీరసమీరే ట్యూన్ తీసుకెళ్ళి ఆ పాటకు తగిలించేశారు. ఈ విషయం కొందరే ఎరుగుదురు. జానపదగేయాలకు సంగీత గౌరవం కల్పించిన గాయనీమణులు ఆంధ్రలో ఈ యిద్దరే. ఏ బాణీలో పాడాలన్నా ప్రామాణిక సంగీతజ్ఞానం అవసరమన్నది ఒకరు చెప్పవలసిన పనిలేదు. సంగీత వాతావరణం సామాన్యంగా యింట్లో నుంచే ప్రారంభవౌతుంది. పాటంటే యిష్టపడే తల్లిదండ్రులెవరికైనా తమ సంతానం కూడా పాడితే వినాలనిపించదా? కానీ సంగీతం ఒకొక్కసారి వంశపారంపర్యంగా రావచ్చు. రాకపోవచ్చు. అదేం చిత్రమో? దీర్ఘరోగాలు మాత్రం వంశపారంపర్యమంటారు డాక్టర్లు.
సంగీత కళానిధి డా. శ్రీపాద పినాకపాణి తమ అక్క నేర్చుకుంటుండగా, ప్రభావితులై సంగీతం మీద మక్కువ పెంచుకున్నారు. వృత్తిరీత్యా ఆయన డాక్టరు. కేవలం ఆభిరుచితో సరిపెట్టుకోలేదు. సంగీతపు లోతుల్ని బాగా గ్రహించి విద్వాంసులకే విద్వాంసుడవటమే విశేషం.
సంగీతాన్ని సముద్రంతో పోలుస్తారు. సముద్ర స్నానమని చెప్పి రెండు చెంబులు నెత్తిమీద జల్లుకుంటే అది సముద్ర స్నానవౌతుందా? కార్తీక పౌర్ణమి పుణ్యదినం ప్రాతఃకాలంలో రెండు పాదాలూ సముద్ర జలాల్లో ముంచిన మరుక్షణం నీరూ, నింగీ కలిసిన చోట ఆకాశం వైపు ఒక్కసారి చూసి ‘ఔరా! యింత విశాల భూమితో బాటు ఆఖండమైన జలాలను సృష్టించిన నీ మేధాశక్తికి జోహారులయ్యా!‘ అని ఆ సృష్టికర్తకు అంజలి ఘటించని వాడెవ్వడో చెప్పండి!? అదిగో, అలాగే సంగీత సాగరం కూడా. మణులూ, మాణిక్యాలూ వెదికే వాళ్ళతో బాటు నత్తగుల్లల్ని వెదికే వాళ్ళూ కనిపిస్తారు. దీనికి ఎక్కువ శ్రమ పడనక్కరలేదు. సప్తస్వర సుందరులను కళ్ళారా చూసి భజించి, అలౌకికమైన ఆనందాన్ని అనుభవించిన నాదయోగులు బహు అరుదుగా జన్మిస్తారు. సంగీత యోగానికి కుటుంబ వాతావరణం ఒక్కటే కాదు. లక్ష్యాన్ని అందుకోవాలనే పట్టుదల, ఏకాగ్రత, నిశ్చలభక్తి పెట్టుబడిగా తప్పనిసరి. ఓపిక వుంటే మణులూ, మాణిక్యాలతో పాటు అనిర్వచనీయమైన బ్రహ్మానందం దొరుకుతుంది. లేదంటే గట్టుమీద ఏరుకునే నత్తగుల్లలే మిగులుతాయి. సంగీతానందాన్ని అనుభవించే వ్యక్తి కళాకారుడై సమాజంలో ప్రవేశిస్తే, ఆ సమాజమే అతన్ని పెద్దవాణ్ణి చేస్తుంది. ఒక్కసారి సంగీతరుచి మరిగితే, మనం దాన్ని వదులుకోలేం. అది మనల్ని వదలదు. ఆ సంబంధం జీవాత్మ పరమాత్మల సంబంధంలాంటిది. పాట తెలియడం కాదు. పాట ఎలా పాడాలో తెలియాలి. నేర్చుకుని పాడాలి. కానీ నేర్చుకుంటున్నట్లు పాడకూడదు. పాటలో ఎప్పుడూ లయ, అంతర్వాహిలా వుంటుంది. లయకోసం పాటకాదు! 3సంగీత కళానిధి‘ అంటూండేవారు. రాగంలో వున్న ఈ పిళ్ళారి గీతంతోనే సంగీతాన్ని ఆరంభిస్తారు. లక్ష్మీకరుడలైన స్వామీ! లంబోదరా! శివుని కుమారుడవైన తండ్రీ! నా సంగీత విద్యకు సార్థకతను చేకూర్చమని పురందర దాసు కన్నడ భాషలో మలహరి రాగంలో కూర్చిన గీతమిది.
దక్షిణాదిలో ‘పిళ్ళైలు ఎక్కువ. వారికి వినాయకుడంటే మహాప్రీతి, భక్తీను. మొట్టికాయలు వేసుకుంటూ బొజ్జగణపయ్యను చూసి గుంజీలు తీసే భక్తజనం మీకు వీధివీధిలోనూ కనిపిస్తారు. శ్రుతి శుద్ధంగా పదిమందీ కలిసి ఈ మలహరి గీతం పాడితే చాలు. మీకు వీలైతే వినండి. మనస్సుకు ఎంత ఆశ్లాదంగా వినిపిస్తుందో గమనించండి. చిన్నతనం నుంచి మన పిల్లలకు సంగీతాభ్యాసం అలవాటవ్వాలి. అదేమి ఖర్మమో! ఈ వేళ పాఠశాలల్లో కనీసం జాతీయగీతాలైన వందేమాతరం, జనగణమనలు పాడించలేని దుస్థితిలో వున్నాం. జాతీయ పండుగల సందర్భంలో దేశభక్తిని ప్రబోధించే ఈ జాతీయగీతాలెప్పుడైనా తప్పుల్లేకుండా లయ తప్పకుండా పాడించటం విన్నారా?
చిన్నవాళ్ళు మొదలు, వయసు పండినవాళ్ళ వరకూ ఈ రెండు జాతీయగీతాలూ అనుమానంగానే పాడుతుంటారు. గమనించే వుంటారు. ‘ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెనలు వేసినట్లు, చదువుకునే వయస్సులోనే అబ్బవలసిన సంగీతాన్ని వదిలేసి గాయకులై పోవాలని కోరుకోవడం అత్యాశ, దురాశ కూడాను. బంకించంద ఛటర్జీ ఈ జాతికిచ్చిన అద్భుతగీతం ‘వందేమాతరం. అందులో చాలా చరణాలున్నాయి. కానీ ఒకటి, రెండు చరణాలతోనే సరిపెట్టారు. తప్పులు లేకుండా పాడితే ఎన్ని చరణాలైనా వినగలుగుతారు. తాళం దైవానికి వదిలేసి 3అపలయలో పాడుతున్న సంగతి వారికే తెలియదు. అదీ చిత్రం. పైగా తెలిసిపోయినట్లు చిరునవ్వులొలికిస్తారు. ‘దేశ్‘ రాగంలో వుంటుందీ గీతం. వందేమాతరం.. వందేమాతరం.. సుజలాం.. సుఫలాం.. మలయజ శీతలాం.. అని పాడిన తర్వాత ఒక అరావృతం సేపు ఆగితేగాని తాళం పూర్తవ్వదు. వందేమాతరం అన్న తర్వాత రెండోసారి పాడిన తర్వాత కూడా అరావృతం సేపు ఆగాలి. కానీ ఆగరు. అలా పాడేస్తూ పోతారు. చూడండి! సినిమా హాళ్లో చిత్రం ప్రారంభమవగానే, ఖంగారుగా లోపలికి ప్రవేశించిన ప్రేక్షకులు స్తిమితంగా కాళ్ళు చాపి కూర్చున్న ప్రేక్షకులను చీకటిలో కనిపించక కాళ్ళు తొక్కేసి వెళ్ళిపోతుంటారు. అదుగో! అలా వుంటుందీ వందేమాతరం గానం. మరో జాతీయగీతం జనగణమన. జనగణమన అధినాయక జయహే.. భారత భాగ్య విధాతా..’ అని పాడి కొంచెంసేపు ఆగితే కానీ ఆ తాళం పూర్తవ్వదు. తాళం పూర్తి అయ్యేలోపుగానే పంజాబ్ సింధు మొదలైపోతుంది. తాళంలో మాటల్ని సరిగా పాడలేని సందర్భాలు అనేకం. అయినా తలవొంచుకుని పాడేస్తుంటారు. శంకరాభరణం రాగంలోని ఈ మాటలు పదిమంది కలిసినా, పాతికమంది కలిసి పాడినా ఉత్తేజవంతంగానే ఉంటాయి. ఒక్కసారి ఒళ్ళు గగుర్పొడిచి దేశభక్తి భావాలు సహజంగానే ఆ కాస్సేపట్లోనూ కలగడం చూస్తూనే వుంటాం. తప్పులు లేకుండా, తాళం తప్పకుండా పాడితేనే ఆ గీతానికి గౌరవం దక్కుతుంది. ఆ గీతం వ్యవధి నిమిషానికి లోపే. పిల్లలు మొదలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సైతం ఈ జనగణమన గానంలో ఎనే్నసి మెలికలు తిరిగి పోతారో మీకు తెలుసు.. నిర్లిప్తత, నిరాసక్తతలే కారణం. వందేమాతరం, జనగణమన ఆకాశవాణి కళాకారులచేత పాడించిన ఘనత ఆకాశవాణిదే.. ఆకాశవాణి వాద్యబృందంవారు ఈ జాతీయగీతాలతో పాటు వైష్ణవజనతో, రఘుపతి రాఘవ రాజారాం వంటి భజనలు రికార్డుగా విడుదల చేశారు.
బాల్యం నుంచీ సత్ప్రవర్తన, సద్భుద్ధి, సన్మార్గంలో నడిచేందుకు ఈ జాతీయ గీతాల స్ఫూర్తి ఒక కారణం.. పాడానిపించేవి, పాటపట్ల అనురక్తిని కలిగించేవి కూడా యివే. పాడాలనే ఉత్సాహం ఒక్కటే చాలదు. నేర్చుకునే అర్హత కూడా వుండాలి. లంబోదర లకుమికర‘ కొబ్బరికాయ కొట్టేవరకే.. ఈ గణపతి ప్రార్థనతో ముందు స్వరాల ఉనికి మాత్రం తెలుస్తుంది. స్వరమే ఆధారం. ఈ స్వరాల్లో అనేక ప్రకృతి వికృతి భేదాలు, సంవాది, వివాది, అనువాది స్వరాలు, సప్త తాళాల్లో అలంకారాలు.. తెలియటం ప్రారంభమైతే సంగీత సముద్రం గట్టున కూర్చున్నట్లు లెక్క. ఆరోహణ, అవరోహణాది దశవిధగమకాల జ్ఞానం కొంతైనా తెలిస్తే, పాటలో రాగం ఎలా వుంటుందో అర్థం చేసుకునే ఆస్కారం వుంటుంది. లక్ష్య లక్షణాలు రెండూ తెలియాలి. తెలిసి రామచింతన చేయమన్నారు త్యాగయ్య. తమిళనాడులో సంగీతజ్ఞానంతో వేలాది సినిమా పాటలు పాడిన నేపథ్య గాయకులలో యిద్దరు ముఖ్యులున్నారు. ఒకరు శీర్కాళి గోవిందరాజన్, మరొకరు టి.ఎం.సౌందరరాజన్. కొనే్నళ్ళు సినీ సంగీతరంగాన్ని శాసించిన గాయకద్వయం. శ్రీమతి కె.బి.సుందరాంబాళ్ అనే గాయనిపేరు మరింత ప్రసిద్ధం. అవ్వయ్యార్‌లో ఆమె పాడిన పాటలు యిప్పటికే సంప్రదాయ సంగీత ప్రియులకిష్టం. వీరందరూ సంప్రదాయ సంగీతాన్ని వదలకుండానే విజయాలు సాధించిన ఘనులు. మహావిద్వాంసులయినా, కాకపోయినా శ్రుతిశుద్ధంగా కనీసం నాలుగు దేశభక్తి గీతాలు రవ్వంత పాడగలిగే స్థాయిలో వుంటే, అదే పదివేలు. నలుగురికి మార్గం చూపించిన వారవుతారు. నలుగురిచేత పాడించగలిగితే చాలు ధన్యులవుతారు. భక్తి గీతాలైనా దేశభక్తి గీతాలైనా బాల్యం నుంచే పాడగలిగే అలవాటుండాలి. పిల్లల్ని పాటకు దూరం చేసినంతకాలం.. మనం మాట్లాడే సామాజిక స్పృహ‘ అందరాని ద్రాక్షే.

చిత్రం..కె.బి.సుందరాంబాళ్

- మల్లాది సూరిబాబు 90527 65490