అమృత వర్షిణి

అంతరంగ శుద్ధి - ఆనంద సిద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలియని మాటేం కాదు. ‘అన్నాద్భవంతి భూతాని..’ మనం తినే అన్నం వల్లే ఈ సర్వజీవకోటి పుట్తోంది. అన్నం వల్ల తయారయ్యేదే మనస్సు. మనసు వల్ల పుట్టేది భావం. భావంవల్ల జన్మ - బంధనాలకు, మోక్షానికీ కారణం ఈ మనస్సే.
మనం పొద్దునే్న లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రపోయే వరకూ మన మనస్సులో అలా ఎనె్నన్నో భావాలు వరుసగా పుట్తూనే ఉంటాయి.
దీనికి కారణం అన్నమే. అన్నం వల్లే ప్రాణి పుట్తోంది. మళ్లీ ఈ అన్నం తినటంవల్లే ప్రాణి అంతర్థానవౌతోంది. అన్నం వల్ల తయారైన దేహం అన్నం లేకపోతే అల్లల్లాడిపోతుంది. స్వచ్ఛ భారత్ నినాదం అంటే పెద్దపెద్ద చీపుళ్లతో వీధులూడుస్తూ ఫొటోలు దిగడం ఒక్కటేనా? శుచిగా తినాలి. తినే ఆహారం, దోషభూయిష్టంగా వుంటే తిన్నవాడి బుద్ధులు కూడా అలాగే ఉంటాయి. శరీరం రోగగ్రస్తవౌతుంది. బుద్ధికి మంచి ఆలోచనలు పుట్టవు. దేవాలయాల్లోని మూలవిరాట్టుకు మహానివేదన, చాలా గోప్యంగా చేస్తారు. ఆ సమయంలో ‘తెర’ అడ్డంగా ఉంటుంది. ‘తెర’ తొలిగిన తర్వాతనే దర్శనం - మీకు అనుభవమే - దృష్టి దోషం కూడా దోషమే, అంది శాస్త్రం.
ఆకలితో వున్నవాడికి భగవంతుడు ‘అన్నంలో’ కనిపిస్తాడు. అందుకే అన్నదానం అన్ని దానాల్లోనూ మిన్న.
‘అతిథి వచ్చి ఆకలన్న అన్నమిడిన అంతేజాలు.
క్రతువు సేయవలెనని కాంక్ష యేటికే మనసా’ అంటాడు భద్రాచల రామదాసు.
అతిథి అంటే అనిత్యంగా వుండేవాడు.
ఒక్క రాత్రి వుండి తిని వెళ్లిపోయేవాడు, అతిథి.
డొక్కా సీతమ్మగారికి లభించిన కీర్తి యిదుగో దీనివల్లే. ‘అన్నదాతా సుఖీభవ’ అంటూ లేవారుట. మనస్ఫూర్తిగా ఆదరించాలి. మ్రొక్కుబడిగా కాదు
నా చిన్నప్పుడు కొన్ని ఇళ్లల్లో పెద్దలు ‘అపరాహ్ణం’ అయ్యే దాకా వుండి అతిథులెవరైనా వస్తారేమో’ అని ఎదురుచూశి, చూశి, అప్పుడు తినేవారు. అటువంటి కొన్ని కుటుంబాలు నాకు గుర్తే. దానికి ప్రేమ ఒక్కటే కారణం - నీతి ఒక్కటే మూలం. ధర్మమే అసలు సూత్రం. పెట్టి పుట్టాడంటారు. పది మందికి పెట్టి తినమనడం ఇందుకే - కలివిడిగా కలిసిమెలిసి తిరిగి ఒకనాటి ఉమ్మడి కుటుంబాలు కాస్తా యిప్పుడు విడిపోయాయి. ఈవేళ కనీసం వాళ్లే కలిసి భోజనం చేయరు. యింక అతిథి సంగతి దేవుడెరుగు. బుద్ధులే స్వచ్ఛంగా లేకుండా పోయి ఊరికే నినాదాలు చేస్తూ పోతే ఏం ప్రయోజనం?
రావలసిన మార్పు మనస్సుకే - ఇప్పుడదే లోపించింది. ‘నా చిన్ని బొజ్జకూ శ్రీరామరక్ష’ అంటూ బ్రతకడమే లక్ష్యంగా సాగిపోతోంది. ప్రక్కవాణ్ణి పలకరించటమే అరుదైపోలా? లోపం ఎక్కడ?
‘ఎన్నడు తెలిసేము ఎచ్చరిక ఎప్పుడో/ ఇన్నియు కన్నవె యొఱిగీ నెఱగ/ నిన్నటి యాఁకవి నేడూ వున్నది/ కన్న దినంబె కడ చనెను/ పన్ని నిదుర, మాపటికినున్న దదె/ యెన్నగ, రాతిరి, యొందో, పోయ ॥
కాయపు సుఖములు గంపలనున్నవి/ పాయమే కైవావి పండెనదే
రుూ యెడ సంసార మింటనే వున్నది/ చేయును, నోరును చెనటై
నిలిచె ॥
విడువని జన్మములు వెంటనే వచ్చీ/ తడవేటి మోక్షము దవ్వాయ/ యెడవక శ్రీవేంకటేశ! నీ మఱగు/ పడి చొచ్చితి, నా భారము నీది ॥
చూడగానే యిది ‘అన్నమయ్య’ సాహిత్యమని వెంటనే చెప్పగల సాన్నిహిత్యం ఏర్పడింది, మనకు.
రాశిలోనూ వాసిలోనూ అన్నమయ్య వంటి అద్వితీయ సంపన్నుడు, పద సాహిత్య రంగంలో అంతకు ముందూ లేరు- ముందు కూడా ఉండబోరు
జీవిత సారాన్ని కాచివడబోసి తన సంకీర్తనల్లో ఇమిడ్చి వేశాడు. చెప్పదల్చుకున్నది ముఖమాటం లేకుండా చెప్పిన ధీశాలి.
‘జ్ఞాన సంబంధమైన ఎఱుక మాకెప్పుడు తెలుస్తుందయ్యా! అన్నీ తెలిసినట్లు కనిపిస్తాయి. ఈ మాయ తొలగించలేవా? నిన్నటి ఆకలి నేడూ ఉంది. నిన్నటి రోజు గడిచిపోయింది. ఈ రాత్రి నిద్దుర, నిన్నటి రాతిరి నిద్దుర ఒక్కటే. కాని నిన్నటి రాత్రి నిద్ర ఎక్కడికి పోయిందో?
తీర్చుకోవలసిన సుఖాలు ఎన్నో వున్నాయి. కాని అనుభవించేందుకు వయస్సు వుండాలిగా? వనం కాస్తా గతంలోకి వెళ్లిపోరుంది.
ఈ చేయి, నోరు చేయకూడనివి చేస్తూ ఈ శరీర సంసారంలో నా కపట బుద్ధికి సాక్ష్యంగా నిలిచాయి. నన్ను వదలకుండా జన్మలు వెంటవెంటనే తరుముకుంటూ వస్తున్నాయి. ఈ మాయను తొలగించు. నా భారం నీది’ అంటాడు పద కవితామహుడైన అన్నమయ్య.
* * *
మనం అనుకున్నది అప్పుడప్పుడు జరక్కపోతే ‘ఆఁ! ఏం దేవుడండీ! ఎంతగా పూజ చేశాం? ఎన్ని ప్రార్థనలు చేశాం? కొంచెమైనా ఆయనకు దయ లేదు - ఎన్నాళ్లు పడాలో ఈ బాధలు?’ అంటూ దైవాన్ని దూషించేందుకు ఎవరూ వెనుకాడరు. మానవ స్వభావం. వ్యక్తిత్వ వికాసపరంగా ఆలోచిస్తే, ‘నేనింతే. పనికిమాలిన వాణ్ణి. దేనికీ పనికిరాను. నాకేమీ చేతకాదు. నాకంటే అందరూ గొప్పవాళ్లే. నా బ్రతుకే ఇలా వుందని’ వాపోయేవాళ్లు. మనుషుల ముందు ఆ భావాన్ని ప్రదర్శిస్తే చులకనై పోతారు. అదే దేవుడి ముందు ఏడిస్తే మనం చేసే ప్రార్థనలన్నీ ఆయనకు చేరటం తథ్యం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవటం ఖాయం’ అని పెద్దలు అనుభవంతో చెప్పేమాట.
మనమంటే యిష్టపడే వాళ్లూ ఉంటారు. పడని వాళ్లూ ఉంటారు. ఒక వ్యక్తి అందరికి ఉత్తముడిలా కనిపించడు. కానీ పైవాడికి అందరూ ఒక్కటే. అందుకే దైవంతో ప్రత్యక్ష సంబంధాన్ని బాగా పెంచుకున్న వారికి అసలే బాధా వుండదు. ఋషులైనా నాదయోగులైనా, ముక్కుమూసుకుంటూ తపస్సు చేసుకుంటూ బ్రతికిన మునీశ్వరులకైనా ఈతిబాధలు తప్పలేదు - వారు గట్టిగా గగ్గోలు పెట్టి ఏడవలేదు. బాధలన్నీ తీర్చగలిగేవాడెవడో వాణ్ణే పట్టుకున్నారు. ‘కొఱమాలిన నరులను కొనియాడను నేను’ అన్నాడు త్యాగరాజు. సరిగ్గా పోతన కూడా ఇలాగే అన్నాడు.
ఈ పని మీ వల్లనే సాధ్యం - దయచేసి నాకు ఈ మాట సహాయం చేసి పుణ్యం కట్టుకుందురూ’ అని ఎవరినైనా అడిగి చూడండి. అతని ముఖంలో ఎన్ని రంగులు కనిపిస్తాయో పరిశీలించండి. ఉపకారం చేయనీ చేయకపోనీ, ‘ఊడిగం చేయాల్సి వస్తుంది సుమా?’ అన్నట్లుగా మాట్లాడే పెద్ద మనుషులెందరు లేరు లోకంలో? త్యాగయ్యగారి వంశంలో ఆయన ఒక్కడే తప్ప పుట్టిన మహానుభావుడు. మిగిలిన సోదరులంతా యించుమించు కొందరు అయోగ్యులూ, అప్రయోజకులే. ఏదో కృష్ణా రామా అనుకుంటూ, ప్రపంచంతో సంబంధం లేకుండా తానూ, తన పాట, తన శిష్యులూ లోకంగా బ్రతికే వ్యక్తిని పట్టుకుని ‘ఈ యిల్లు అమ్ముతావా? లేదా? కానీ సంపాదన లేదు, సరిగదా ఈ సంగీతమొకటి. పొద్దస్తమానం వేళాపాళా లేకుండా ఈ గానాబజానాలొకటి మా నెత్తి మీద’ అని సూటిపోటి మాటలతో మనసును చిత్రహింసలకు గురిచేసిన జపేశ్యుడు -త్యాగయ్య సంగీతం ఏమిటో, ఎంత గొప్పవాడో తెలియని మూర్ఖుడు. అయినా భరించాడు త్యాగయ్య.
‘అన్యాయము సేయకురా నన్నన్యునిగా చూడకురా నా యెడ!’ అంటూ తిన్నగా పూజా మందిరంలోని రాముడికి మొఱ పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆస్తి తగాదా కారణం కాదు. తనను మానసికంగా క్షోభింపచేసిన జపేశ్యుడు రోగగ్రస్తుడై మంచాన పడ్డాడు. పైగా చిన్న వయస్సు. ఆ కుటుంబానికి వాడే దిక్కు. అదీ త్యాగయ్య వేదన.
‘నిన్ను సకల బాధలకు గురిచేసిన ఆ పెద్ద మనిషిని రక్షించమంటావేమిటి? అనకు స్వామీ! నువ్వు తప్పులు చేసిన వాళ్లను రక్షించలేదా? కుటుంబ నాశనానికి పూనుకున్న అశ్వత్థామను ధర్మరాజు రక్షించి వదిలిపెట్టలేదా? కాబట్టి ఏదో తెలియకచేసిన తప్పుల్ని పట్టించుకోవద్దని రాముణ్ణి బ్రతిమాలుతూ పాడి వేడుకున్నాడు. సోదరుణ్ణి కనికరించాడు. జపేశ్యుడన్న దుర్భాషల్ని పట్టించుకోలేదు. సాధారణంగా ఈ వేళ ఒకే కడుపున పుట్టిన ఎందరు అన్నదమ్ములకు ఇటువంటి బుద్ధి ఉందా? చెప్పండి.
పైగా ఈ జపేశ్యుడనే పెద్దమనిషి త్యాగయ్య రోజూ అర్చించి పూజించే పంచాయతన విగ్రహాన్ని తిన్నగా కావేరిలో విశిరేసి చక్కా వచ్చాడు. ఆయనున్న ఇల్లు, అదేమైనా ఇంద్రభవనమా? ఆ ఇంటిని వేరుచేయమని పీకల మీద కూర్చుని, విడగొట్టేదాకా నిద్రపోతే ఒట్టు. ‘వేద సన్నుతభవము వేరు చేసితిననుచు నాదు’పై పలికేరు. నరులు శ్రీరామ అని ఏడ్చాడు తప్ప, ఏ కోర్టు గుమ్మమూ తొక్కి ఎఱుగడు. భగవంతుడి యందు ‘గురి’కి అర్థం అది. ఈ విశ్వాన్ని నడిపేది విశ్వాసమే. పశుపక్ష్యాదుల కంటే మనిషిని వేరుచేసి చూడగలిగేదీ చూడతగినదీ.. ఈ విశ్వాసమే.
హరికథా పితామహుడైన ఆధిభట్ల నారాయణదాసు ఏదో కేవలం హరికథలు చెప్పి ఊరుకోలేదు.
ఆయనకు తెలియని భాషల్లేవు. ఆయన స్పృశించని సాహిత్య ప్రక్రియలు లేవు. అసాధ్యమైన వాటిని సుసంపన్నం చేసుకున్న పుంభావ సరస్వతి. మీదు మిక్కిలి దేవీ ఉపాసన గల దివ్య తేజోమూర్తి.
ఆయన దౌహిత్రుడైన సూర్యనారాయణ మశూచి వ్యాధి తగిలి నెల రోజులుగా బాధించింది.
‘మనవణ్ణి ‘తాతా’ అని సంబోధించే అలవాటు. ‘తాతా! ఈ వ్యాధి నిన్ను విడిచి నాకు వచ్చిన బాగుండును గదా’యని అమ్మవారిని ధ్యానిస్తూండగా ఆ మరునాడే పిల్లవాడికి వ్యాధి నయమవటం ప్రారంభించింది. అదే వ్యాధి దాసుగారికి సంక్రమించింది. ఎటువంటి ఆయాసము లేక అదే రోజు రాత్రి భీష్మాచార్యులు మాదిరిగా తనువు చాలించారు.

-- మల్లాది సూరిబాబు 90527 65490