జాతీయ వార్తలు

రాజ్యసభ సీటు కోసం బాబుతో మాట్లాడతా: అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపి నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో తమ పార్టీకి ఒక సీటు కేటాయించాలన్న విషయమై టిడిపి అధినేత చంద్రబాబుతో చర్చలు జరుపుతామని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం ఇక్కడ తెలిపారు. ఎపిలో ఎన్నిక జరిగే నాలుగు రాజ్యసభ స్థానాల్లో టిడిపి మూడు, వైకాపా ఒక సీటును గెలుచుకునే పరిస్థితి ఉంది. మిత్రపక్షమైన తమకు ఒక సీటు కేటాయించాలని రాష్ట్ర బిజెపి నేతలు కోరుతున్నారు. ఈ విషయమై బిజెపి నుంచి ఎలాంటి ప్రస్తావన రాలేదని టిడిపి యువనేత నారా లోకేష్ ఇదివరకే తెలిపారు. కాగా, ఎపి బిజెపికి త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని అమిత్ షా చెప్పారు. రాజ్యసభ సీటు కోసం బిజెపిలోనూ పలువురు నేతలు పోటీ పడుతున్నారు.