జాతీయ వార్తలు

ఇరుదేశాల మైత్రికి నిదర్శనం:అమిత్‌షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అమెరికాలో ప్రధాని మోదీ నిర్వహించిన ‘హౌదీ మోదీ’ కార్యక్రమం ఇరుదేశాల మైత్రి బంధాన్ని ఇనుమడింపజేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. ఆయన ప్రధాని అమెరికా పర్యటనపై తన స్పందనను ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కారకులైన ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ వివిధ దేశాలతో మంచి స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారనీ, అమెరికాతో ప్రత్యేక అనుబంధం నిన్నటి వేదికే నిదర్శనమనీ, ప్రపంచ వ్యాప్తంగా మోదీకి లభిస్తున్న ఆదరణను భారత ప్రజలకు దక్కుతున్న గౌరవంగా ఆయన అభివర్ణించారు. అమెరికా గడ్డపై బలమైన భారత్‌ను మోదీ ఆవిష్కరించారని, తెలిపారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో హౌడీ మోదీ కార్యక్రమం నిలిచిపోతుందనీ, ప్రపంచ రాజకీయ చరిత్రలో ఈ ఘటన చెరగని ముద్ర వేస్తుందన్నారు.