జాతీయ వార్తలు

భారత్‌లోకి పాక్ మూకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెచ్చరించిన ఇంటెలిజెన్స్ * అప్రమత్తమైన ప్రభుత్వం

న్యూఢిల్లీ, నవంబర్ 22: పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు 15మంది దేశంలోకి అడుగుపెట్టినట్టు నిఘా విభాగాలుప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. దేశంలో మతకలహాలను రెచ్చగొట్టడంతోపాటు బిజెపి, ఆరెస్సెస్‌కు చెందిన ప్రముఖ నేతలను హత్యచేసే అవకాశం ఉందని కూడా నిఘావర్గాలు ప్రభుత్వానికి సూచించాయి. మన దేశంనుంచి పారిపోయి కరాచీలో తలదాచుకుంటున్న దావూద్ ఇబ్రహీంకు చెందిన ముంబయిలోని అతని అనుచరులతో పాక్ నిఘా సంస్థ దేశంలో అల్లకల్లోలం సృష్టించే అవకాశాలు ఉన్నట్టు నిఘా విభాగం పేర్కొంది. దావూద్ అనుచరులతో పాటు మన దేశంలో నిషేధిత సిమి, ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థలను కూడా ఐఎస్‌ఐ తన లక్ష్య సాధనకు ఉపయోగిస్తున్నట్టు నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండు తీవ్రవాద సంస్థల బలం ఇటీవలి కాలంలో తగ్గింది. అయితే దావూద్ అనుచరులు ఈ రెండు సంస్థలతో సంబంధాలను పునరుద్ధరించుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌లోని ప్రముఖ భారతీయ జనత పార్టీ నేతలు తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నారు. నేతలను హత్య చేసి అశాంతి సృష్టించటానికి అవసరమైన నిధులను దావూద్ పాక్‌నుంచి సరఫరా చేస్తున్నట్టు పోలీసులకు దొరికిన చోటాషకీల్ ముఖ్య అనుచరుడు విచారణలో వెల్లడించాడు. భారతీయ జనతా పార్టీకి చెందిన బెరుజీ జిల్లాలోని ప్రముఖ నాయకుడిని గత నెలలో తీవ్రవాదులు హత్య చేశారు. ఈ హత్యకు కావాల్సిన నిధులను చోటాషకీల్ అందించినట్టు పోలీసు దర్యాప్తులో ధ్రువపడింది. గతవారం పోలీసులు అనుమానంపై రెండు ఫోన్ కాల్స్‌ను టాప్ చేశారు. ఢిల్లీ, ముంబయి, యుపిలోని ముఖ్య రాజకీయ నేతలు, హిందూ మత ప్రచారకులతోపాటు సంఘ్ నేతలను అంతంచేసి మతకలహాలను రేకేత్తించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు బయటపడటంతో ఈ రాష్ట్రాలను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి.