జాతీయ వార్తలు

ఆదర్శ్ హౌసింగ్ భవనాన్ని కూల్చేయండి: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ముంబయిలో వివాదాస్పదంగా మారిన ఆదర్శ్ హౌసింగ్ సౌసైటీ భవంతిని కూల్చివేయాలంటూ బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. కార్గిల్ యుద్ధంలో పోరాడిన జవాన్లు, అమరులైన సైనికుల భార్యలకు బహుళ అంతస్థుల భవనాన్ని ఆదర్శ్ హౌసింగ్ సౌసైటీ నిర్మించింది. అయితే, ఇందులో రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు సైతం అక్రమాలకు పాల్పడి ఫ్లాట్లను పొందారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ వ్యవహారంపై బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. సిఆర్‌జెడ్ నిబంధనల్ని ఉల్లంఘించి సముద్రతీరాన నిర్మించినందున ఈ భవంతిని కూల్చివేయాలంటూ పర్యావరణ శాఖ ఇదివరకే ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేయరాదంటూ ఆదర్శ్ సొసైటీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ ఆదేశాలను సమర్థిస్తూ భవనం మొత్తాన్ని నేలమట్టం చేయాలంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకునేందుకు 12 రోజుల వ్యవధిని ఇస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.