ఓ చిన్నమాట!
భగవంతుడు గొప్పవాడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆ మధ్య ఓ కథ రాశాను. బీచుపల్లి దగ్గర బస్సు ప్రమాదం గురించిన కథ అది. కర్నూలుకి వెళ్తున్న బస్సు కృష్ణానదిలో పడి బస్సులోని ప్రయాణీకులందరూ చనిపోతారు.
చివరి క్షణంలో బస్సు మిస్ అయి మా మిత్రుడు ఒకడు ఆ బస్సు ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. ఆ విషయం మా అందరికీ తెలిసీ వాడిని ఉదయానే్న వెళ్లి కలిసి వచ్చాం. వాడి ఆనందానికి అవధుల్లేవు. ఇల్లంతా పండుగ వాతావరణం. నాకు సంతోషంగానే ఉంది కానీ ఆ బస్సు ప్రమాదం జరుగకపోతే మరెంత బాగుండేదనిపించింది.
మా మిత్రుడు అన్న ఒకే ఒక్క మాట - ‘గాడ్ ఈజ్ గ్రేట్’ (్భగవంతుడు గొప్పవాడు) అక్కడ చేరిన మా మిత్రులంతా అదే మాట. భగవంతుడు గొప్పవాడు కాక మరెవరుంటారు.
ఈ మధ్యకాలంలో అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. మా డాక్టర్ మిత్రుడు హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కి కార్లో బయల్దేరాడు. అది అర్ధరాత్రిపూట. పనె్నండు దాటిన తరువాత డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. కారు రెండు మూడు పల్టీలు కొట్టి రోడ్డుకి అర ఫర్లాంగు దూరంలో ఆగింది. అనుకోకుండా అటువైపు వచ్చిన రైతులు చూసి డ్రైవర్‌ని, మా మిత్రుడిని కారులో నుంచి బయటకు తీసుకొని వచ్చి వేరే వాహనంలో కరీంనగర్‌కి తరలించారు.
మా మిత్రుడికి చిన్న గాయాలు మాత్రమే తగిలాయి. డ్రైవర్‌కి బలమైన గాయాలు తగిలాయి. కాలూ, చెయ్యి కూడా విరిగింది. మా మిత్రుడిని చాలామంది కలిశారు. సంతోషం వ్యక్తపరిచారు. వాడు, అతని భార్య కూడా ‘్భగవంతుడు చాలా గొప్పవాడు’ అని కితాబు ఇచ్చారు.
భగవంతుడు గొప్పవాడే. అందులో ఏ మాత్రం సందేహం లేదు. కాని కొంతమందికి మాత్రమే ఎందుకు గొప్పవాడు అవుతున్నాడు. ఆ కర్నూలు బస్సులో ప్రయాణం చేసిన నలభై మందికి ఎందుకు గొప్పవాడు కాలేదు. వాళ్లని ఎందుకు కరుణించలేదు. అదే విధంగా మా డాక్టర్ మిత్రునికే ఎందుకు గొప్పవాడు అయినాడు? వాడి డ్రైవర్‌కి ఎందుకు గొప్పవాడు కాలేదు. అతన్ని ఎందుకు కరుణించలేదు? ఈ ప్రశ్నలు నన్ను చాలాకాలం నుంచి వెంటాడుతూనే ఉన్నాయి.
ఈ ప్రశ్నల పరంపర నాలో కొనసాగుతుండగానే ఆ మధ్య ఓ ఆధ్యాత్మికవేత్తతో ఓ గంట గడిపే అవకాశం లభించింది. ఈ రెండు వృత్తాంతాలు చెప్పి - ‘్భగవంతుడు కొంతమందికి మాత్రమే ఎందుకు గొప్పవాడుగా ఉంటాడు? మిగతా వాళ్లకు ఎందుకు గొప్పవాడుగా ఉండడు?’ అని అడిగాను.
‘మీరు చెప్పిన రెండు ప్రమాదాల్లో తప్పించుకున్న మీ మిత్రుల కోణం నుంచి చూడండి. భగవంతుడు గొప్పవాడు కాదా?’ అన్నాడు ఆయన.
ఆయన ఇచ్చిన సమాధానం నాకు అంతగా సంతృప్తిని కలిగించలేదు. ఇంకా ఏదో రెండు మూడు అనుబంధ ప్రశ్నలు వేశాను. కానీ వాటికి ఇలాంటి సమాధానమే వచ్చింది. వాళ్ల కోణం నుంచి చూస్తే భగవంతుడు గొప్పవాడే. కానీ ఆ ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వ్యక్తుల కోణం నుంచి చూస్తే సమాధానం సంతృప్తికరంగా అన్పించదు. వాళ్లు చనిపోవడానికి, గాయపడటానికి మనకు తెలియని కోణం మరేదైనా ఉందేమో తెలియదు.
ఏదైనా భగవంతుడు గొప్పవాడే!