క్రీడాభూమి

క్రికెటర్లకు ఆటవిడుపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, నవంబర్ 30: మైదానంలో నువ్వా నేనా అన్న చందంగా పోటీపడే భారత్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు సోమవారం సరదాగా కాసేపు వన్య ప్రాణులను చూస్తూ గడిపారు. ఐదు రోజుల మూడో టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో ఇరు జట్ల క్రికెటర్లకు ఆటవిడుపు లభించింది. దీనితో చాలా మంది క్రికెటర్లు తడోబా అంధేరీ టైగర్ రిజర్వ్ (టిఎటిఆర్), ఉమ్రెద్ కర్హండ్ల వైల్డ్‌లైఫ్ సాంక్చురీ (యుకెడబ్ల్యుఎస్)ను సందర్శించి, ఆనందించారు. ఆజింక్య రహానే, అతని భార్య రాధిక, చటేశ్వర్ పుజారా, అతని భార్య పూజ, మురళీ విజయ్, వరుణ్ ఆరోన్ తదితరులు టిఎటిఆర్‌లో పులులను చాలా దగ్గరిగా చూస్తూ, సెల్ఫీలు దిగుతూ ఆనందించారు. ఆడపులి ‘తార’ను చూసిన భారత క్రికెటర్లు కేరింతలు కొట్టారు. దానిని వాహనంలో వెంబడిస్తూ, ఫొటోలను కెమెరా, సెల్ ఫోన్లలో బంధించారు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పోలాక్, మోర్న్ మోర్కెల్, కైల్ అబోట్ తదితరులు యుకెడబ్ల్యుఎస్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన ‘జై’ పేరుగల పులిని చూస్తూ, ఎక్కవ సమయం అక్కడే ఉన్నారు. మొత్తం మీద ఇరు జట్ల ఆటగాళ్లు, వారి భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్ సోమవారం లభించిన ఆటవిడుపును వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో గడిపారు.