క్రీడాభూమి

అట్టహాసంగా ‘శాగ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఫిబ్రవరి 5: దక్షిణాసియా క్రీడోత్సవాలు (శాగ్) శుక్రవారం ఇక్కడ అట్టహాసంగా మొదలైనాయి. కన్నుల పండువగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఈశాన్య రాష్ట్రాల భిన్న సంస్కృతుల మేళవింపుగా నిలిచింది. నగరంలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రీడోత్సవాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో 12 రోజుల పాటు సాగే ఈ క్రీడలు అధికారికంగా ప్రారంభమయినట్లయింది. పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న భారత్‌తో పాటుగా అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక-మొత్తం 8 దేశాలకు చెందిన 2600కు పైగా అథ్లెట్లు ఈ క్రీడల్లో పాలు పంచుకొంటున్నారు. స్టేడియంలో క్రిక్కిరిసిన ప్రేక్షకుల సమక్షంలో ప్రధాని మోదీ క్రీడలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి అవకావాలను అనే్వషించడానికి ఈ క్రీడలు ఈ ప్రాంతానికి ఒక సువర్ణావకాశంగా మోదీ అభివర్ణించారు. అసోం, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు ఎన్ రామచంద్రన్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గౌహతితో పాటుగా షిల్లాంగ్‌లో సైతం ఈ క్రీడల్లోని కొన్ని విభాగాల పోటీలు జరుగుతున్నాయి. శనివారం షిల్లాంగ్‌లో ఈ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది.
వివిధ కారణాల వల్ల అనేక సార్లు వాయిదా పడిన ఈ దక్షిణాసియా క్రీడలు దాదాపు నాలుగేళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన క్రీడోత్సవాలతో పోలిస్తే ఈ సారి క్రీడల్లో పాల్గొంటున్న అథ్లెట్ల సంఖ్య ఎక్కువ. 23 విభాగాలు, 228 ఈవెంట్లలో ఈ పోటీలు జరుగుతాయి. మొట్టమొదటిసారి అన్ని క్రీడల్లోను పురుషులు, మహిళల విభాగాలలో పోటీలు జరుగుతున్నాయి. ఈ సారి 228 బంగారు, 228 వెండి, 300 కాంస్య పతకాలకోసం అథ్లెట్లు పోటీ పడబోతున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని దక్షిణాసియా క్రీడల్లోను పతకాలలో అగ్రస్థానంలో నిలిచిన భారత్ తరఫున ఈ సారి కూడా అత్యధిక సంఖ్యలో 521 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఇందులో మహిళలు 245 మంది ఉన్నారు.
అథ్లెట్ల మార్చ్‌పాస్ట్‌తో ఈ వేడుకలు మొదలైనాయి. క్రీడల మస్కాట్ అయిన ‘తిఖోర్’ ముందు నడవగా అఫ్గానిస్థాన్‌కు చెందిన క్రీడాకారులు మార్చ్‌పాస్ట్‌లో మొదట నడవగా, చివర్లో పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న భారత్ క్రీడాకారులు నడిచారు. ప్రతి దేశానికి చెందిన క్రీడాకారుల బృందానికి ముందు ఇద్దరు చిన్నారులు ఆయా దేశాల్లోని పవిత్ర నదినుంచి తెచ్చిన జలాల కలశాలతో నడిచారు. భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా వివిధ క్రీడాకారులు అంచెలంచెలుగా తెచ్చిన టార్చ్‌తోక్రీడా జ్యోతిని వెలిగించిన అనంతరం దాదాపు 45 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

మహిళల వాలీబాల్‌లో శుభారంభం
నిరాశపర్చిన ఫుట్‌బాల్ జట్టు
గౌహతి, ఫిబ్రవరి 5: దక్షిణాసియా క్రీడల్లో భారత మహిళల వాలీబాల్ జట్టు తమ పోరాటాన్ని అద్భుత రీతిలో ప్రారంభించింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 3-0 తేడాతో మాల్దీవులను ఓడించి శుభారంభాన్ని సాధించింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆరంభం నుంచే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి 25-9, 25-9, 25-10 తేడాతో ప్రత్యర్థులను మట్టికరిపించింది. కాగా, మహిళల విభాగంలో జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక 3-0 (25-19, 25-14, 28-26) తేడాతో నేపాల్ జట్టుపై విజయం సాధించింది. ఇక పురుషుల విభాగంలో శ్రీలంక జట్టు 3-0 (25-10, 25-15, 25-10) తేడాతో నేపాల్‌ను, పాకిస్తాన్ జట్టు 3-0 (25-22, 25-14, 25-20) తేడాతో మాల్దీవులను ఓడించగా, అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎంతో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 3-2 (25-12, 20-25, 21-25, 31-29, 15-13) తేడాతో గట్టెక్కింది. అయితే మహిళల ఫుట్‌బాల్ తొలి మ్యాచ్‌లో భారత జట్టు అభిమానులను నిరాశపర్చింది. ర్యాంకింగ్స్‌లో భారత్ కంటే ఎంతో దిగువన ఉన్న మాల్దీవుల జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కనీసం ఒక్క గోల్ కూడా నమోదు చేయలేదు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.