జాతీయ వార్తలు

అమిత్ షా ఎన్నిక ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా అమిత్ షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిజెపికి చెందిన ఇతర నాయకులెవ్వరూ నామినేషన్ దాఖలు చేయకపోవటంతో అమిత్ షా ఏకక్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. బిజెపి అధ్యక్ష పదవికి మొదటిసారి ఎన్నికైన అమిత్ షా మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్టీ అధ్యక్ష పదవికి 2014 మేలో రాజీనామా చేయటంతో మిగిలిన కాలానికి అధ్యక్షుడుగా అమిత్ షా కొనసాగారు. ఇప్పుడాయన ఎన్నికైన అధ్యక్షుడుగా మూడేళ్లపాటు బిజెపికి నాయకత్వం వహిస్తారు.
నరేంద్ర మోదీతోపాటు రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరు అమిత్ షా పేరును ప్రతిపాదించారు. సీనియర్ నాయకులు లాల్‌కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి అధ్యక్షుడి ఎంపిక కార్యక్రమానికి హాజరుకాకపోవటం గమనార్హం. ఆద్వానీ, జోషి మరికొందరు నీనియర్ నాయకులు అమిత్ షా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన పార్టీని నిర్వీర్యం చేస్తున్నారు తప్ప పటిష్టం చేయటం లేదన్నది వారి ఆరోపణ. అమిత్ షా బిజెపి అధ్యక్ష పదవి చేపట్టటం ఆర్‌ఎస్‌ఎస్‌కు కూడా మింగుడు పడటం లేదనే మాట వినిపిస్తోంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అధ్యక్ష పదవి చేపట్టేందుకు విముఖత చూపించటంవల్లే అమిత్ షా అభ్యర్థిత్వాన్ని అర్‌ఎస్‌ఎస్ బలపరచకతప్పలేదనే వాదన వినిపిస్తోంది.
అమిత్ షా ఎన్నికపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమిత్ షాను అభినందిస్తూ, ఆయన నాయకత్వంలో బిజెపి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనే ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు. అమిత్ షాకు గ్రామస్థాయి కార్యకర్త లక్షణాలతోపాటు పార్టీని నడిపించే పూర్తి స్థాయి అనుభవం ఉన్నదని మోదీ అభిప్రాయపడ్డారు. అమిత్ షా మూలంగా పార్టీకి ఎంతోమేలు కలుగుతుందని చెప్పారు. అమిత్ షా 2014 మేలో అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత బిజెపి మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే రెండు రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయింది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన బిజెపి దేశానికి గుండెకాయలాంటి ఢిల్లీ, రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న బిహార్ రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోవటం వలన నరేంద్ర మోదీ ప్రతిష్ట దిగజారింది. ఇదిలా ఉంటే ప్రధానిగా మోదీ, పార్టీ అధ్యక్షుడుగా అమిత్‌షా రంగంలోకి వచ్చిన తరువాత బిజెపిలో అధికారం కేంద్రీకృతమైందనే ఆరోపణలు ప్రారంభమయ్యాయి. దీనితోపాటు పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందనే ఆరోపణలు కూడా వచ్చాయి.