జాతీయ వార్తలు

అందరూ విశిష్ట సైనికులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రణక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన సియాచిన్‌లో ఇటీవల సజీవ సమాధి అయిన తొమ్మిది మంది వీర సైనికుల భౌతికకాయాలను సోమవారం న్యూఢిల్లీ నుంచి తమ సొంత రాష్ట్రాలకు తరలించారు. ఈ సందర్భంగా స్థానిక పాలమ్ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్, సైనికదళ ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, వైమానికదళ ప్రధానాధికారి అరూప్ రహా తదితరులు అమర జవానులకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. సియాచిన్‌లో సైనిక విధులు నిర్వర్తిస్తూ ఈ నెల 3వ తేదీన హిమపాతం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఈ తొమ్మిది మంది జవానులు దేశానికి ఎనలేని సేవలు అందించిన వారే కావడం గమనార్హం. వీరిలో ఎంతో సమర్ధుడైన జెసిఓ (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్)గా పేరు తెచ్చుకున్న సుబేదార్ టిటి.నగేశ ఒకరు. 22 ఏళ్ల నుంచి సైనిక దళంలో పనిచేస్తున్న నగేశ తన సర్వీసులో సగం కంటే ఎక్కువ కాలం (12 ఏళ్లు) అత్యంత ప్రతికూల ప్రదేశాల్లో పనిచేశారు. అత్యంత ధైర్యసాహసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచి ‘మిస్టర్ రాంబో’గా ఖ్యాతి పొందిన నగేశ ‘ఆపరేషన్ పరాక్రమ్’తో పాటు జమ్మూ-కాశ్మీరులోని మెంధర్ సెక్టార్‌లో నిర్వహించిన ‘ఆపరేషన్ రక్షక్’, ఈశాన్య భారతావనిలో నిర్వహించిన ‘ఆపరేషన్ రైనో’ల్లో పాల్గొని దేశానికి విశిష్ట సేవలు అందించారని సైనికాధికారులు తెలిపారు. అలాగే సియాచిన్ హిమపాతంలో కన్నుమూసిన వీర జవానుల్లో ఎన్‌సిఓ (నాన్ కమిషన్డ్ ఆఫీసర్)గా పనిచేస్తున్న హవల్దార్ ఎం.ఎలుమలై కూడా ఉన్నారు. ఎంతటి సంక్లిష్టమైన బాధ్యతనైనా ఎంతో ధైర్యసాహసాలతో నిర్వర్తించే ఎలుమలై 1996 అక్టోబర్ 28వ తేదీన మద్రాస్ రెజిమెంట్ 19వ బెటాలియన్‌లో చేరి అనతి కాలంలోనే ఆ బెటాలియన్‌కు స్ఫూర్తి ప్రదాతగా, ‘అందరివాడు’గా ఎదిగారని అధికారులు వివరించారు.