జాతీయ వార్తలు

ఒకే వ్యక్తి నుంచి సిఐసికి 3500 దరఖాస్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: భారత వైమానిక దళానికి చెందిన మాజీ అధికారి ఒకరు 3,500కి పైగా ఆర్టీఐ దరఖాస్తులతో కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి)ని ఉక్కిరిబిక్కిరి చేసారు. దీని ఫలితంగా సిఐసి ప్రతి అంశంపై తీర్పు ఇవ్వడానికి ముందు వివిధ ఉమ్మడి విషయాల కింద ఆ దరఖాస్తులన్నిటినీ వర్గీకరించాల్సి వచ్చింది. ఒకే అంశంపై మళ్లీ మళ్లీ అడగడం లాంటివి లేకుండా చూడడానికి దరఖాస్తులను వడపోత పోయాల్సిన అవసరం ఉందని కూడా సిఐసి పేర్కొంది. తలకు మించిన భారంగా మారిన ఈ దరఖాస్తులను ‘హ్యాండిల్’ చేయడానికి ఒక విధానాన్ని కనుగొనడానికి ఈ విషయాన్ని ప్రధాన సమాచార కమిషనర్ ముందుంచడం జరుగుతుందని కూడా కమిషన్ తెలియజేసింది. సంజీవ్ శర్మ అనే ఆ భారత వైమానిక దళ మాజీ అధికారినుంచి వచ్చిన దరఖాస్తుల కవర్లను తెరవడం కోసమే కమిషన్ ఒక వ్యక్తిని పూర్తిగా కేటాయించాల్సి వచ్చింది! తాను భారత వైమానిక దళానికి సైతం 6 వేలకు పైగా ఆర్‌టిఐ దరఖాస్తులను పంపించినట్లు కూడా ఆయన చెప్పుకొన్నారు. దరఖాస్తు చేసిన వ్యక్తి భారత వైమానిక దళంలో రిటైర్డ్ అధికారి అని, విచారణ ప్రారంభమైన 2015 జూలై 15న ఈ కమిషన్ రిజిస్ట్రీ రిజిస్టర్ చేసిన ప్రకారం దరఖాస్తుదారుడు దాఖలు చేసిన దరఖాస్తుల సంఖ్య 3,588’ అని ప్రధాన సమాచార కమిషనర్ విజయ్ శర్మ తెలిపారు. తాను ఇప్పటికీ ఆర్‌టిఐ దరఖాస్తు చేస్తూనే ఉన్నానని, ఇంకా కొనసాగిస్తూనే ఉంటానని విచారణల సందర్భంగా ఆయన చెప్పినట్లు కూడా శర్మ తెలిపారు. అంతేకాదు, రెస్పాండెంట్లు తన పట్ల చాలా తప్పు చేస్తున్నారని, తన దరఖాస్తులపై దృష్టిపెట్టి న్యాయం చేయాలని కూడా ఆయన పదే పదే కోరినట్లు కూడా శర్మ తెలిపారు.