క్రీడాభూమి
గెలిచినా ఇంటికే..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సిడ్నీ, మార్చి 13: ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌ని వర్షం కూడా వెంటాడింది. డక్‌వర్త్ లూయిస్ విధానం ద్వారా ఇంగ్లాండ్ 25 ఓవర్లలో 101 పరుగులు సాధించాల్సి ఉండగా, మరో 41 బంతులు మిగిలి ఉండగానే, కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. అయితే, భారీ విజయాన్ని నమోదు చేసినప్పటికీ ఈ జట్టు ఇంటిదారి పట్టక తప్పలేదు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 36.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. షఫీకుల్లా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్, రవి బొపారా చెరి రెండు వికెట్లు పడగొట్టారు. ఈ దిశలో భారీ వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. వాన తగ్గిన తర్వాత పూర్తి ఓవర్లు ఆడే అవకాశం లేకపోవడంతో, డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఇంగ్లాండ్ లక్ష్యాన్ని 25 ఓవర్లలో 101 పరుగులుగా నిర్ణయించారు. అలెక్స్ హాలిస్, ఇయాన్ బెల్ మొదటి వికెట్‌కు 83 పరుగులు జోడించి, ఇంగ్లాండ్ విజయాన్ని ఖాయం చేశారు. హమీద్ హసన్ బౌలింగ్‌లో అఫ్సర్ జజాయ్ క్యాచ్ అందుకోగా అలెక్స్ అవుటయ్యాడు. అతను 33 బంతులు ఎదుర్కొని, 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. ఇయాన్ బెల్ 56 బంతుల్లో 52 (ఆరు ఫోర్లు), జేమ్స్ టేలర్ 8 పరుగులతో అజేయంగా నిలిచి, ఇంగ్లాండ్‌కు 18.1 ఓవర్లలోనే, తొమ్మిది వికెట్ల భారీ తేడాతో విజయాన్ని అందించారు. 6.2 ఓవర్లు బౌల్ చేసి, కేవలం 13 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టిన క్రిస్ జోర్డాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్తంగా స్కోర్లు
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: 36.2 ఓవర్లలో 7 వికెట్లకు 111 (షఫీకుల్లా 30, నాసిర్ జమాల్ 17, మహమ్మద్ నబీ 16, క్రిస్ జోర్డాన్ 2/13, రవి బోపారా 2/32).
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ (లక్ష్యం 25 ఓవర్లలో 100 పరుగులు): 18.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 (అలెక్స్ 37, ఇయాన్ బెల్ 52 నాటౌట్, జేమ్స్ టేలర్ 8 నాటౌట్, హమీద్ హసన్ 1/17).