S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/11/2019 - 19:56

పర్వతారోహణ.. ట్రెక్కింగ్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. దీనిలో ఎన్నో రకాల అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా ఈ రంగంలో పురుషులే ఉంటారు. లింగ వివక్ష ఎక్కువగా ఉన్న మొదటి పది దేశాల్లో మొరాకో కూడా ఒకటి అని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నివేదిక వెల్లడించింది. ఇప్పటికీ మొరాకో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో 80 శాతం మంది నిరక్షరాస్యులే.. కానీ మొరాకోలో పది మంది మహిళా ట్రెక్కింగ్ గైడ్లు ఉన్నారు.

03/08/2019 - 20:07

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా..
యత్రే తాస్తున పూజ్యంతే సర్వాస్తత్రా అఫలాః క్రియా!

03/07/2019 - 19:43

మహిళ..
మానవతామూర్తి..
మహోన్నత భావాలు కలగలసిన వ్యక్తి..
కుటుంబ వ్యవస్థకి మూలాధారమైన శక్తి..

03/06/2019 - 19:02

అనాదికాలం నుంచి సమాజంలో పురుషాధిక్యతే రాజ్యమేలుతోంది. మహిళలంటే చిన్నచూపు.. బానిసలనే భావం.. చెప్పింది చేయాలి అనే అధికారతత్త్వం.. చాలాకాలంగా మహిళలు మోస్తూనే ఉన్నారు. ఇవి చాలవన్నట్లు.. అత్యాచారాలు, హత్యలు, కిడ్నాపులు, ఆసిడ్ దాడులు మహిళలపై జరుగుతూనే ఉన్నాయి. ఈ సమాజంలో స్ర్తిని ఒక కామకేళి వస్తువుగా చూస్తున్నారు. సంఘంలో స్ర్తిలకి తీరని అన్యాయం జరుగుతోంది. న్యాయం జరగటం లేదు.

03/05/2019 - 18:38

కాలం మారుతున్నది. ప్రపంచం కుగ్రామంలా మారింది. మానవుడు రాతియుగం, మంత్రయుగం దశలు దాటి యంత్రయుగంలోకి ప్రవేశించి నేడు రాకెట్ యుగంవైపు దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో మానవజాతిలో ఒక భాగం అయిన మహిళలు అన్ని రంగాలలో ఆనాటి నుంచి ఈనాటి వరకు రాణిస్తున్నప్పటికీ.. కేవలం లింగ వివక్ష కారణంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా భావిస్తూ చిన్నచూపుతో అణచివేయబడుతూ వున్నారు. అడుగడుగునా దురాగతాలు, మానభంగాలు జరుగుతూనే వున్నాయి.

03/04/2019 - 23:44

తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించకూడదు. పదే పదే వారికి ఒకటే విషయం చెప్పి విసిగించడం వంటివి చేయకూడదు. పిల్లలకు ఏ విషయం చెప్పదలచుకున్నా ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే చెప్పాలి. పదేపదే న్యాగింగ్ చేస్తే పిల్లలు తల్లిదండ్రులను లెక్కచెయ్యరు. పిల్లల్లోని లోపాలను ఎత్తి చూపడం కన్నా, వారిలోని స్కిల్స్‌ను గుర్తించి అభినందించండి. ఇతరుల ముందు మీ పిల్లల్ని తక్కువచేసి మాట్లాడకండి.

03/03/2019 - 22:28

మనం జరుపుకునే పర్వదినాలలో మహాశివరాత్రి ప్రధానమైనది. ప్రతి నెలలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజు కూడా శివరాత్రి అన్న పేరుతో శివపూజలు చేస్తాము. పనె్నండు నెలల్లో వచ్చే మాస శివరాత్రుల్లోకి ప్రధానమైన పర్వదినం మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చే కృష్ణ చతుర్దశిని ‘మహాశివరాత్రి’గా జరుపుకోవాలని ధర్మసింధు చెబుతుంది.
మాఘ కృష్ణ చతుర్దశ్యాం
ఆది దేవో మహానిశిః
శివలింగ తమోద్భూతః

03/01/2019 - 19:30

శత్రు దేశానికి పట్టుబడినా అదే ధీరత్వం..
వెన్ను విరిగినా వెన్ను చూపని ధైర్యం..
చుట్టూ శత్రువులు ఉన్నా..
అతని ఆత్మస్థైర్యం చెక్కుచెదరలేదు..
ఆ ధైర్యానికి జడిసే కాబోలు..
అతడ్ని భారతమాతకు
అప్పజెప్పాలనుకున్నారు..
ఆ మధుర క్షణం రానేవచ్చింది..
అభినందన్ సొంతగడ్డపై
అడుగు పెట్టాడు..
దేశం యావత్తూ ఆ ధీరుడికి
స్వాగతం పలికింది..

02/28/2019 - 20:08

మాఘమాసం.. పెళ్లిళ్ల సీజన్.. జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే పెద్ద పండుగ. అతిథులు, విందులు, వినోదాలు.. వంటివన్నీ ఒకత్తెయితే.. ఏఏ సందర్భానికి ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? ఎలా ముస్తాబు చేసుకోవాలి? ఇలాంటివి నేటి పెళ్లి కూతుర్లకు పెద్ద సమస్యలుగా కనబడతాయి. పసుపు కొట్టడం దగ్గర నుంచి రిసెప్షన్ వరకు.. ప్రతి సందర్భంలో ఎలా మెరిసిపోవాలి? అని బుర్రలు బద్ధలు కొట్టుకుంటుంటారు వధువులు..

02/28/2019 - 10:54

మహిళలు క్షణం తీరిక లేకుండా చాలా పనులు చేస్తుంటారు. ఇంట్లో, బయట.. ఎన్నో పనులు.. వంటపని, బూజు దులిపే పని, ఇల్లు ఊడ్వటం, బట్టలు ఉతకడం, గిన్నెలు, పిల్లలను బడికి పంపడం.. వీటితో పాటు ఉద్యోగానికి కూడా వెళుతూ.. మేము చాలా చురుకుగా ఉన్నాం అనుకుంటే మాత్రం పొరపాటే.. చాలాసార్లు మహిళలు.. తాము శారీరక వ్యాయామం చేయకపోవడానికి ఇంటి పనులనో, ఉద్యోగాన్నో సాకుగా చూపిస్తుంటారు.

Pages