S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/14/2018 - 18:32

తరువాత ఆ తల్లియొక్క దర్శన రూపమైన విద్యను లోకానికి అందించిన వాడు నంది. అందుకనే ఆ తల్లిని గురించి చెప్పే మహావిద్యకు నంది విద్యా అని పేరు. తద్విద్యారూపమైన అమృతాన్ని లోకానికి పంచి అమృత మయముగా లోకాన్ని సంరక్షించిన ఘనత నందీశ్వరునిది.
స్వామి కూడా అట్టి స్థితిలో ఉన్నాడు-

12/13/2018 - 19:15

ఆతని జీవితము బ్రహ్మానందానుభవ నందనవనమై, సర్వమత సామరస్య నిలయమై దీపించుటకిదియే హేతువు.
శ్రీరామకృష్ణుని ప్రథమ గురువు భైరవీ బ్రాహ్మణియను యోగినీమణి. ఈమె విశేష విద్యావంతురాలు, తాంత్రిక సాధనలయందఖండ విజయమును బడసిన మహనీయురాలు.

12/12/2018 - 19:53

హృదయము ఱంపముతో గోయబడినట్లు బాధగలుగ నేలపైబడి పొరలాడుచు, నాతడు పడు వేదనను గాంచిన జనులు, ‘‘అయ్యో, పాపము! ఈతడేదియో ‘శూలనొప్పి’చే బాధపడుచున్నాడు కాబోలును, లేక నిజముగా మాతృవియోగముచే గుందుచున్నాడు కాబోలును’’అని జాలిపడువారు. ఆతడిక హతాశుడై యొకనాడు జీవితము నంతమొందించుకొన బ్రయత్నించునంతలో అకస్మాత్తుగా సాక్షాత్కారము లభించెను.

12/11/2018 - 18:37

ధైర్యసాహసములకును స్వాతంత్య్రమునకును తోడిబాలురందెల్ల గదాధరుని జెప్పి మఱియొకని జెప్పవలయును. పసితనమునుండి సైతము పిఱికితనమననెట్టిదో, సిగ్గన నెట్టిదో, యాత డెఱుగడు. దృఢగాత్రుడును తేజో నిధియనగు నాతడు తాను న్యాయమని నమ్మిన విషయములలో నొకరి బెదిరింపులనెంత మాత్రము లక్షించువాడు కాడు. పెద్దలు వలదనినను తనయంతరాత్మ ధర్మమని తెల్పిన విషయముల నాతడు విడుచువాడు కాడు.

12/06/2018 - 18:45

నిత్యానందో నిర్గుణం బ్రహ్మ తస్మాత్ సగుణా విర్భావః
సగుణాత్‌శక్తిః శక్తేర్నాదబిందుః
బిందోః కుండలినీ కుండలినే్య ఆంతరరూపా
ఇయం చిత్కళా (షట్చక్ర నిరూపణం)
నిరాకారము నిర్గుణమూ అయిన పరతత్త్వము నుండి సగుణము సాకారమూ అయిన శక్తి తత్వమొకటి ప్రకటనమైనదనీ
సావిద్యా పరమా ముక్తేః హేతు భూతాసనాతనీ
సంసారబన్ధ హేతుశ్చ సైవ సర్వేశ్వరేశ్వరీ

12/05/2018 - 18:52

ప్రశ్న: సద్గురూ! మనం దేనిని గుడ్డిగా నమ్మకూడదనీ, జీవితంతో పరీక్షించి మనంతట మనమే తెలుసుకోవాలని మీరు చెబుతారు. కానీ, ఆధ్యాత్మికంగా ఎదగవలసిన విషయంలో మాత్రం గురువుపట్ల అచంచలమైన విశ్వాసం అవసరం అవుతుంది. నమ్మకానికీ, విశ్వాసానికీ మధ్య తేడా ఏమిటి?

12/04/2018 - 18:56

అలర్కుడు ధర్మం తప్పకుండా రాజ్యపాలన ప్రారంభించాడు. ప్రజలను కన్నబిడ్డలవలె భావించాడు. దుష్టులను యధావిధిగా దండించాడు. యజ్ఞయాగాదులు నిర్వహించాడు. ఎన్ని రాజభోగాలు అనుభవించినా అతనికి తృప్తి కలుగలేదు. సంసార సుఖాలపై విరక్తి కలుగలేదు. ఈ విధంగా అలర్కుడు విషయాసక్తుడైపోవడం వనవాసంలో వున్న అన్న సుబాహనికి తెలిసింది.

12/03/2018 - 18:33

ఋతధ్వజుడనే రాజు భార్య మదాలస. ఆమె మహాజ్ఞాని. ఒక శుభలగ్నంలో ఆమెకు ప్రథమ కుమారుడు జన్మించాడు. రాజు అతనికి విక్రాంతుడు అని నామకరణం చేశాడు. ఆ పేరు విన్న రాజోద్యోగులు అంతఃపుర పరివారం ఎంతో సంతోషించారు. కాని మదాలస ఒక చిరునవ్వు నవ్వింది. ఏడుస్తున్న ఆ బాలుని ఊయలలో పరుండబెట్టి ఊపుతూ ఈవిధమైన అర్థం వచ్చే జోలపాట పాడింది. ‘‘నాయనా, నీవు శుద్ధుడవు, నిరంజనుడవు, నిరాకారుడవు. నీకు పేరు లేదు.

12/02/2018 - 21:51

మన ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అనే సత్యాన్ని దర్శించారు. జీవకోటితో సహా సమస్త వస్తుజాలము, ప్రకృతి అంతా భగవంతుని రచన అని, అది అంతర్యామి అనగా సర్వమును సృష్టించి పాలించే భగవంతునిచే వ్యాపించబడి ఉన్నదని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈ సిద్ధాంతాన్ని నిరూపించటానికి సరైన ఉదాహరణ శ్రీసాయియే. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దుష్టశిక్షణ చేస్తారు.

11/29/2018 - 19:51

నిజంగా శ్రీ సాయి సచ్చరిత్రలోనే రాధాబాయికి బాబా కనువిప్పు కలిగించిన అధ్యాయం అమూల్యమైనది. బాబా రాధాబాయ్‌కి చేసిన ఈ హితబోధ మనుషులు ఎదుర్కొంటున్న సకల సమస్యలు, ఆయా సందర్భాలకు అనుగుణమైనది. దీనిని ఎవరికివారు తమ సమయ, సందర్భానికి అనువుగా మలుచుకుని పరిష్కారాన్ని పొందవచ్చు. ఇది కేవలం వట్టి బోధన మాత్రమేకాదు. మనుషుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే విజయ రహస్యం.
***

Pages