S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/17/2016 - 02:11

బెనౌలిమ్ (గోవా), అక్టోబర్ 16: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2008లో తలెత్తిన ఆర్థిక సంక్షోభంనుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని, ఈ సంక్షోభం ప్రభావం బ్రిక్స్ దేశాల ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపించినప్పటికీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అయిదు దేశాలతో కూడిన ఈ కూటమి శక్తి సామర్థ్యాలు ఏమాత్రం మారలేదని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అన్నారు.

10/17/2016 - 02:36

పణాజీ, అక్టోబర్ 16: ఉగ్రవాదం పాకిస్తాన్ ముద్దుబిడ్డ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. రెండు రోజులుగా గోవాలో జరుగుతున్న బ్రిక్స్-బిమ్‌స్టెక్ సదస్సులో భాగంగా బిమ్‌స్టెక్ దేశాధినేతలతో మోదీ సమావేశమయ్యారు. పాకిస్తాన్ ఉగ్రవాదపు అంధకారాన్ని ఆలింగనం చేసుకుని ఉందని, ఉగ్రవాదులు ఆ దేశపు ముద్దుబిడ్డలయ్యారని మోదీ అన్నారు.

10/17/2016 - 02:07

ఖాట్మండు, అక్టోబర్ 16: భారత్, చైనాల మధ్య క్రియాశీల వారధి పాత్ర పోషించాలని నేపాల్ కోరుకుంటోందని నేపాల్ ప్రధాని ప్రచండ భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో జరిపిన సమావేశాల్లో త్రైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యంకోసం ఒక ప్రతిపాదన చేశారని ఆదివారం స్థానిక మీడియా కథనం పేర్కొంది.

10/17/2016 - 01:58

ఎడిసన్ (న్యూజెర్సీ), అక్టోబర్ 16: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాకు భారత్ ‘వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన భాగస్వామి’ అని ఆయన అభివర్ణించారు.

10/17/2016 - 01:18

బెనౌలిమ్ (గోవా), అక్టోబర్ 16: ఉగ్రమూకల స్థావరాలపై మెరపు దాడుల ద్వారా పాకిస్తాన్‌ను చావుదెబ్బ తీసిన భారత్ అంతర్జాతీయ వేదికలపై ఆ దేశాన్ని ఏకాకిని చేసేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటోంది. ఆదివారం గోవాలో బ్రిక్స్ దేశాధినేతల సమావేశంలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పేరును నేరుగా ప్రస్తావించకుండా దాన్ని తూర్పారబట్టారు.

10/17/2016 - 01:18

బెనౌలిమ్ (గోవా), అక్టోబర్ 16: తమ గడ్డపైనుంచి ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థవంతంగా అడ్డుకోవాలని ప్రపంచంలోని అన్ని దేశాలకు ‘బ్రిక్స్’పిలుపునిచ్చింది. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితిలో ఒక అంతర్జాతీయ తీర్మానాన్ని ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ఆమోదించాలని కూడా కోరింది.

10/16/2016 - 07:26

కిగాలి, అక్టోబర్ 15: వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో శనివారం మరో చారిత్రక ముందడుగు పడింది. కార్బన్ డయాక్సైడ్‌కన్నా వెయ్యి రెట్లు భూతాపాన్ని పెంచగలిగే సామర్థ్యం కలిగి ఉన్న హైడ్రోఫ్లూరో కార్బన్ (హెచ్‌ఎఫ్‌సి)లను దశలవారీగా తగ్గించడానికి భారత్‌తో సహా 200 దేశాల మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది.

10/15/2016 - 08:23

వాషింగ్టన్, అక్టోబర్ 14: జమాత్ ఉత్ దవా చీఫ్ హఫీజ్ సరుూద్ కరుడుగట్టిన ఉగ్రవాదేనని అమెరికా పునరుద్ఘాటించింది. జమా త్, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలు వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాయని అన్నారు. రోజువారీ మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ మాట్లాడుతూ ఐరాస కరుడుగట్టిన ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ పేరు ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.

10/15/2016 - 07:32

లండన్, అక్టోబర్ 14: విశ్వం లోతుల్లోకి వెళ్లేకొద్దీ నిగూఢమైన ఎన్నో రహస్యాలు వెలుగులోకి వస్తు నే ఉన్నాయి. ఈ విశ్వంలో ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయన్నదానిపై ఎన్నో రకాలుగా పరిశోధనలూ జరిగాయి. శాస్త్ర పరిశోధన పరిధి ఇప్పటి వరకూ విస్తరించినంత వరకూ కనిపించిన గెలాక్సీలు వంద బిలియన్‌కు పైనే ఉన్నాయి.

10/15/2016 - 07:30

వాషింగ్టన్: ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించడంపై నిషేధం విధించాలని ట్రంప్ పిలుపునిచ్చిన నేపథ్యంలో వచ్చే నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశంలోని ప్రతి పదిమంది ముస్లింలలో ఏడుగురు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కే ఓటు వేయనున్నారు.

Pages