S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

03/24/2019 - 02:05

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధి పట్ల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తున్న నేరమయ నిర్లక్ష్యం పట్ల ఈ ప్రాంతాల ప్రజలలో నానాటికీ అసహనం పెరుగుతోంది. నేతలు మాటలే తప్ప చేతలలో చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదనే ఆగ్రహం జనంలో వ్యక్తం అవుతున్నది. హామీల వర్షం కురిపించడం తప్ప ఆచరణలో పట్టించుకొనక పోవడం పట్ల ఆవేదన కలుగుతున్నది.

03/22/2019 - 23:12

ఏడాది కాలంగా క్లోమగ్రంధి క్యాన్సర్‌తో బాధ పడుతూ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (63) మృతి చెందడంతో భారత రాజకీ యాలలో ఒక అరుదైన నేతను కోల్పోయినట్లయింది. సాధారణ జీవితం ప్రారంభించి అత్యున్నత విద్యను అభ్యసించినా, అత్యున్నత పదవులు వెంటాడుతూ వచ్చినా ఆ మోజులో పడిపోకుండా, తన సహజ స్వభాభావాన్ని విడనాడకుండా అత్యున్నత విలువలకు ఆయన నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.

03/22/2019 - 01:37

మనుషుల కన్నా చరిత్ర గొప్పది. దానికి ఎన్నో మైలురాళ్లు ఉంటాయి. అవి చరిత్ర గతిని మలుపుతిప్పుతాయి. చరిత్రలో కొన్ని వేగ నిరోధకాలు కూడా ఉంటుంటాయి. వాటికీ చరిత్రలో స్థానం లభిస్తుంది. అంతమాత్రాన అదే చరిత్ర అనుకున్నా పొరపాటే. అలాంటి ఘట్టం ఒకటి పరిశీలించేందుకు మనం చరిత్రలోకి తొంగి చూస్తే వర్తమాన రాజకీయాలకు సమాధానం దొరుకుతుంది.

03/21/2019 - 01:08

‘ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నవాడిని ఎప్పుడూ హత్య చేసేందుకు ప్రయత్నించకు..’ అని రాజనీతిజ్ఞుడు, అమెరికా 28వ అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ చెప్పిన రాజకీయ సిద్ధాంతం అక్షరాలా మన దేశంలో కాంగ్రెస్ పార్టీకి అతికినట్లు సరిపోతుంది. చరిత్రలోకి వెళితే దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచినపుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 80 శాతం సీట్లు కాంగ్రెస్‌కే దక్కేవి.

03/20/2019 - 02:34

సృష్టి పరిణామ క్రమంలో అన్నింటి కన్నా ఉన్నతమైన స్థాయి జీవులదే. భూమిపై 14 మిలియన్ల జీవజాతులు అందుబాటులో ఉన్నా యి. బాక్టీరియాలు కాకుండా 1.8 మిలియన్ల జాతులు ప్రస్తుతం మనుగడలో ఉన్నాయి. వీటిలో వృక్షజాతులు 2.70 లక్షల రకాలు కాగా, జంతుజాతులు 45 వేలు ఉన్నాయి. మరో 9.5 లక్షల కీటకాలు, సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. ‘గ్లోబల్ టాక్సానమీ’ ప్రకారం ప్రతి ఏటా కొత్తగా 10 వేల జాతులను గుర్తించడం జరుగుతోంది.

03/17/2019 - 02:07

ప్రస్తుత 21వ శతాబ్దంలోని 3వ దశాబ్దిలో ప్రపంచం నాల్గవ పారిశ్రామిక విప్లవం కొత్త వాకిళ్ళు తెరుస్తున్న సాంకేతిక, శాస్ర్తియ ప్రజ్వలనం సృష్టిస్తున్న ఉజ్వల నేపథ్యంలో ప్రపంచంతోపాటు భారతదేశం అధి భౌతిక అత్యాధునిక జీవన స్థితిగతులను సంతరించుకొనే దిశలో అడుగులు వేస్తోంది.

03/15/2019 - 21:39

లోక్‌సభలో గుర్తింపు పొందిన ప్రతిపక్షం కూడా లేకుండా, దేశంలో మూడొంతుల రాష్ట్రాలలో అధికారంలో ఉన్న సమయంలో జరుగుతున్న ఎన్నికల పట్ల ఏ పార్టీ కూడా ఖంగారు పడనవసరం లేదు. ఎంతో భరోసాతో ప్రజల ముందుకు వెళ్ళడానికి సిద్ధపడ వలసింది. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా చెప్పుకొంటున్న బీజేపీలో అటువంటి ధీమా కనిపించడం లేదు.

03/15/2019 - 01:53

ఒకాయన చాలా డబ్బు ఖర్చుపెట్టి అందమైన భవనం కట్టుకొన్నాడు. అతని ఇంటిముందు ఇంటి యజమాని ఎవరితోనో ‘ఆ క్రొత్త ఇంటిపై రాయివేస్తాను’ అన్నాడు. క్రొత్త ఇంటి యజమాని రోజూ పనులన్నీ మానుకొని అతడు ఎప్పుడు రాయివేస్తాడా? అతనిపై పోలీస్ కేసు ఎప్పుడు పెట్టాలా? అని ఎదురుచూస్తున్నాడు. ఇతడు మాత్రం రోజూ రాయిని చేతిలో పట్టుకోవడం, ఇంటి అరుగుపై కూర్చొని సాయంత్రం లోపలికి వెళ్లడం చేస్తున్నాడు. కానీ కొట్టడం లేదు.

03/14/2019 - 01:00

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల పాపులర్ ఓటు ఎవరికి దక్కుతుంది? గత ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు ఎంతో తేడా ఉంది. ఈ ఎన్నికలు కచ్చితంగా నవ్యాంధ్రప్రదేశ్ దశ, దిశలకు మార్గనిర్దేశనం చేస్తాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగే తొలి ఎన్నికలివి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో పాటు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్లు అనుభవానికి పట్టం కట్టారు.

03/13/2019 - 02:13

‘అయోధ్య వివాదం’ కేవలం 1,480 గజాల స్థలం కోసం 1,500 ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అయోధ్యలోని రామజన్మభూమి వివాదం అందరికీ తెలిసినట్టు 1528 (మరికొన్ని వివరణల్లో 1527) సంవత్సరంలో బాబర్ భారత్‌కు రాకతో మొదలుకాలేదు. ముంబయిలో లభించిన ‘్ఫర్ రిపోర్ట్సు’ (1862, 1863, 1864, 1865) నివేదిక ప్రకారం రామజన్మభూమి స్థలాన్ని 1426 బీసీ లోనే కూల్చేశారు. అంటే దాదాపు 3,445 ఏళ్లుగా వివాదం ఉందనేది సుస్పష్టం.

Pages