తెలంగాణ

సనాతన ధర్మానికి చిరునామా ‘సాయిధామం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: హిందూధర్మ పరిరక్షణ, సనాతనధర్మ ప్రచారం కోసం పనిచేస్తున్న సంస్థల్లో హైదరాబాద్ సమీపంలోని ‘సాయిధామం’ (సేవాశ్రమం) సంస్థను ప్రధానంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలో, ఆధ్యాత్మిక కేంద్రమైన కీసరకు ఆరు కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా బొమ్మల రామారం మండలం లోని రామలింగపల్లి గ్రామ పరిధిలో సాయిధామ క్షేత్రం ఉంది. హిందూ ధార్మిక కార్యక్రమాలను గత మూడు దశాబ్దాల కాలం నుండి కొనసాగిస్తున్నప్పటికీ, ప్రచారానికి ఈ సంస్థ దూరంగా ఉంటోంది. లక్షలాది రూపాయలు వ్యయం చేస్తూ, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పనిచేస్తున్న సాయిధామం మీడియా ద్వారా ప్రచారం చేసుకునేందుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. విద్య, వైద్య, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, సనాతన హిందూధర్మ కార్యక్రమాలను ఈ సంస్థ కొనసాగిస్తోంది. సాయిదత్త పీఠాధిపతి, శ్రీసాయి సేవాసమితి ట్రస్ట్, సాయినాథ క్షేత్రం, కోదండరామ సాయిసన్నిధానం సేవాశ్రమాల వ్యవస్థాపకులు స్వామి సత్యప్రదానంద ప్రభుజీ (గురూజీ) నేతృత్వంలో ఏర్పాటైన ఆశ్రమం యువతీ యువకులను ప్రోత్సహిస్తూ, హిందూధర్మ మార్గం ప్రచారంలో నిమగ్నమై ఉంది. స్వామి వివేకానంద బోధనలకు అనుగణంగా గురూజీ అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
మాతృస్థానం పేరుతో భారతమాత మందిరం, ప్రత్యూష పేరుతో బాలుర శిశుమందిరం, ఉష పేరుతో బాలికల శిశుమందిరం, సాయి విద్యాధామం పేరుతో ఉన్నతపాఠశాల (ఉచితంగా విద్య అందించే పాఠశాల), సురభి పేరుతో గోశాల, ద్వారవతి పేరుతో సాయిబాబా దేవాలయం, ఆదిగురు స్థానం పేరుతో దత్తాత్రేయ మందిరం, ధునిపేరుతో నిత్యాగ్నిహోత్రం, సంధ్యపేరుతో వృద్ధాశ్రమం, ప్రశాంతి పేరుతో వానప్రస్థ విభాగం ‘సాయిధామం’ ఆశ్రమంలో ఏర్పాటు చేశారు. సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల కోసం సాయికళ్యాణి పేరుతో ఆడిటోరియం నిర్మించారు. ఈ ఆశ్రమంలో అన్నపూర్ణ పేరుతో నిరతాన్నదాన మందిరం, ఆరోగ్య పేరుతో ప్రకృతి, హోమియో, యోగా వైద్యశాల నడుస్తున్నా యి. సాధన పేరుతో యోగసాధన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. భారతి పేరుతో పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సనాతన హిం దూధర్మ ప్రచారం కోసం ధర్మజ్యోతి పేరుతో ఒక మహోన్నత కార్యక్రమం చాలా కాలంగా కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలోని మైనేనివారిపాలెంలో సర్వతోభద్ర పేరుతో సాయి దేవాలయం, సాయినాథ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆనందసాయి ప్రభు పేరుతో సాయి దేవాలయాన్ని నిర్మించారు. సాయిధామం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు తెలియచేసేందుకు ‘సాయివాణి’ పేరుతో ధార్మిక, సామాజిక మాసపత్రిక నడిపిస్తున్నారు. పిల్లలకు ధార్మిక విద్య, దేశభక్తి బోధన నిరంతరం సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ధర్మప్రచారానికి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంస్థ నడిపించే కార్యక్రమాలన్నీ సాయి సేవా సమితి ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. సాయిధామం వ్యవస్థాపకులైన స్వామి సత్యపదానంద ప్రభుజీ గత ఏడాది జూలైలో శివైక్యం చెందిన తర్వాత సాయిసేవా సంస్థ ట్రస్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శుకవాణి ధర్మాధికారిగా పనిచేస్తూ, శనివారం అస్తమించారు. ప్రస్తుతం సంస్థ ఉత్తరాధికారిగా రాంబాబు వ్యవహరిస్తున్నారు. ధర్మాధికారి బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న అం శంపై సాయిసేవా సమితి ట్రస్టు సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని ఉత్తరాధికారి రాంబాబు, ట్రస్టుసభ్యుల్లో ఒకరైన ఎం.రాంమోహనరావు ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు. ఈ సంస్థ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలనుకునే వారు మొబైల్ 94404 13455/98481 33565లో సంప్రదించవచ్చని వారు వివరించారు.

భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తున్న సాయిధామం వ్యవస్థాపకులు
దివంగత స్వామి సత్యపదానంద ప్రభుజీ (ఫైల్‌ఫొటో)