ఆంధ్రప్రదేశ్
బైబిల్ యూనివర్సిటీ డైరెక్టర్‌పై ఫిర్యాదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 July 2016
విజయనగరం(టౌన్), జూలై 25: జిల్లాలోని డెంకాడ మండలం మోదవలసలోని బైబిల్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ డైరెక్టర్ ఎల్.ప్రసన్నబాబు శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసారు. ఫిర్యాదును పరిశీలించిన ఎఎస్పీ ఎవి రమణ పరిశీలించారు. ఎ ఎస్పీకి బైబిల్ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులతోకలసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పిల్లలతో ప్రసన్నబాబు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. దీంతో ఎఎస్పీ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై భోగాపురం సిఐ వైకుంఠరావును విచారణ అధికారిగా నియమించగా ఆయన తక్షణం స్పందించి విచారణ ప్రారంభించారు.