ఆంధ్రప్రదేశ్‌

ఇదేం పనితీరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పనితీరు పట్ల పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి ఇటీవల నియమించిన పదిమంది సభ్యులతో చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి ఇటీవల జరిపించిన సర్వేల వివరాలను కమిటీ ముందు ఉంచారు. కనిష్టంగా ఒక ఎమ్మెల్యేకు 17 మార్కులు వస్తే, గరిష్ఠంగా మరో ఎమ్మెల్యేకు 74 మార్కులు వచ్చాయి. 20 నుంచి 30 శాతం మార్కులు వచ్చిన వారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ‘ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఇవి అన్ని నియోజకవర్గాలకు సమానంగానే అందుతున్నాయని, అటువంటప్పుడు ఎమ్మెల్యేలపై ఎందుకు ప్రజలు అసంతృప్తితో ఉన్నార’ని ప్రశ్నించారు. ప్రజలు సంతృప్తిగా ఉండడంతో ప్రభుత్వం సగం బాధ్యత వహిస్తే, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు రాజకీయంగా మిగిలిన భాగాన్ని భర్తీ చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఎమ్మెల్యేలు విఫలమయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తే, దాన్ని పార్టీ వర్గాలు ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండమని తను పదే పదే ఎమ్మెల్యేలకు, పార్టీ నాయకులకు చెపుతున్నా, వారు పెడచెవిన పెట్టారని అందుకే ప్రజల్లో వారి పట్ల సంతృప్తి లేదని చంద్రబాబు అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు అస్సలు నియోజకవర్గాల ముఖమే చూసిన దాఖలాలు లేవని అన్నారు. అందుకే పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇలా 400 మందిని ఎంపిక చేసి, వారికి శిక్షణా తరగతులు నిర్వహించాలని చంద్రబాబు ఈ కమిటీని ఆదేశించారు. ఒక్కో బ్యాచ్‌కి 30 మంది చొప్పున ఎంపిక చేసి, వారానికి రెండు బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.