Others

అందానికి కొబ్బరి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనల్ని సేదతీర్చేవి కొబ్బరి నీళ్లే. సేద తీరడానికే కాదు ఆరోగ్యానికి కూడా కొబ్బరి నీళ్లు ఎంతో ప్రశస్తమైనవే. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి కొబ్బరి నీళ్లు. అదెలాగో చూద్దాం..
చర్మం కాంతివంతం
చర్మ సౌందర్యానికి కొబ్బరిపాలు చక్కగా పనిచేస్తాయి. అరకప్పు కొబ్బరిపాలలో కొన్ని గులాబీ రేకులు, స్పూన్ తేనె కలిపి ఒక బకెట్ గోరువెచ్చటి నీళ్లలో వేసుకొని స్నానం చేస్తే శరీరానికి తగిన తేమ అందుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఎండాకాలంలో కొబ్బరి పాలలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి పది నిముషాలు అలాగే ఉంచి తరువాత దానిలో దూదిని ముంచి ముఖమంతా పట్టించి కాసేపటి తరువాత చల్లటి నీళ్లతో కడుక్కుంటే ముఖం మీద పేరుకుపోయిన దుమ్ముపోయి చర్మం తాజాగా ఉంటుంది.
ముఖంపై మొటిమలు నివారించుకోవచ్చు
ముఖ సౌందర్యానికి కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లతో ముల్తానీ మట్టిని ముద్దగాచేసి దానిని ముఖం, మెడ భాగాలకు రాసుకోవడంవలన ఎండవలన కమిలిన చర్మాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకువస్తుంది. దీనితో శరీరానికి మర్దన చేసుకుంటే శరీరంమీద పేరుకుపోయిన మలినాలను తొలగించి చర్మానికి మెరుపునిస్తుంది. మొటిమల నివారణిగా కూడా పనిచేస్తాయి కొబ్బరి నీళ్లు. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నీళ్లను ముఖానికి రాసుకొని ఉదయానే్న శుభ్రం చేసుకుంటే మొటిమలను నివారిస్తుంది. ప్రతిరోజు కొబ్బరినీళ్లతో ముఖాన్ని శుభ్రంచేసుకుంటుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. చర్మానికి కావలసిన తేమ కూడా చక్కగా అందుతుంది. ఇన్‌ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. కొబ్బరి నీళ్లు తరచుగా తాగుతుంటే శరీరానికి కావలసిన పోషకాలు అంది, చర్మాన్ని యవ్వనంగా ప్రకాశవంతంగా మారుస్తాయి.
సిల్కీగా కేశాలు
కేశ సౌందర్యానికి కూడా కొబ్బరి నీళ్లు చక్కగా పనిచేస్తాయి. తల స్నానానికి ముందు కొబ్బరి నీళ్లతో తలకు బాగా మసాజ్ చేసుకొని తరువాత తల స్నానంచేస్తే జుట్టు మృధువుగా, సిల్కీగా తయారవుతుంది. కొబ్బరి నీళ్లు జుట్టుకి కండీషనర్‌గా కూడా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లు జుట్టు చుండ్రును కూడా నివారిస్తాయి. వీటిలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు బాగా ఉన్నందువలన వీటిని జుట్టుకు పట్టించుకోవడం వలన తలలో చుండ్రును తగ్గించి దురద, ఇన్‌ఫెక్షన్లంటిని అరికట్టి జుట్టుబాగా పెరగడానికి సహాయపడుతుంది.
కొబ్బరి పాలతో పాదాల సౌందర్యం
కొబ్బరి పాలలో కొద్దిగా తేనె చుక్కలు, రెండు టేబుల్ స్పూన్ బియ్యపు రవ్వ, బాదం నూనెతో కలిపి పాదాలకు పట్టించి మర్దనాచేసి, తరవాత చల్లటి నీళ్లతో కడుక్కుంటే పాదాలు మృదువుగా మారతాయి.

- లలిత