ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ పొదుపు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, జూన్ 20: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుటుని విద్యుత్ పొదుపు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే తొలిసారిగా విద్యుత్ ఆదాచేసే ఎల్‌ఇడి ఫ్యాన్ల పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ ఆదాకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఎల్‌ఇడి బల్బులు నామ మాత్రపు ధరకు పంపిణీచేశామన్నారు. అలాగే లక్ష ఎల్‌ఇడి ఫ్యాన్లు పంపిణీకి సిద్ధం చేశామన్నారు. ఒక్కో ఫ్యాను ధర రూ.2000 కాగా సబ్సిడీపై రూ.1100కే అందిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉందన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్ రాష్ట్ర అవసరాలకు సరిపోతుందన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిమాండ్, సప్లై మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాల్సివుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాలు, పరిశ్రమల పురోగతి దృష్ట్యా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్థాపించేందుకు చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వివరించారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఏపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ, ఎంపీ గోకరాజు గంగరాజు, ఏపి ఇపిడిసిఎల్ సిఎండి రేవుముత్యాలరావు, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, రాష్ట్రప్రభుత్వవిప్ చింతమనేని ప్రభాకర్, శాసనమండలి విప్ అంగర రామ్మోహన్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
కాపులకు ఇచ్చిన
హామీ నిలబెట్టుకుంటున్నా
భీమవరం: ఎన్నికల ముందు జరిపిన పాదయాత్రలో కాపుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో జరిగిన ఏరువాక ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ల విషయమై గతంలో ఎందరో హామీలిచ్చినా గాలికి వదిలేశారన్నారు. గత పదేళ్లలో ప్రభుత్వాలన్నీ కాపులను పట్టించుకోలేదన్నారు. ఎవ్వరూ ఏం చెయ్యని సమయంలో కాపులకు బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే రూ.70 కోట్లు మేర రుణాలు ఇచ్చామని, భవిష్యత్తులో ఇంకా ఇస్తామన్నారు. కాపులను బిసిల్లో చేర్చడానికి మంజూనాథ కమిషన్ ఏర్పాటుచేశామన్నారు.

ఎల్‌ఇడి ఫ్యాన్లు పంపిణీచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు